సెక్స్ స్కాండల్ కేసు, విదేశాల్లో దాక్కొన్న మనమడికి మాజీ ప్రధాని సీరియస్ వార్నింగ్, లేదంటే?
కర్ణాటకలోని హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసు వ్యవహారం క్లైమాక్స్ కు చేరుకునే అవకాశం ఉంది. మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్. డీ. దేవేగౌడ ఆయన మనవడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నువ్వు మర్యాదగా బెంగళూరు వచ్చి సిట్ అధికారుల ముందు విచారణకు హాజరుకావాలని, ఇంతకాలం నువ్వు చేసింది చాలు అని మాజీ ప్రధాని దేవేగౌడ ఆయన మనమడు ప్రజ్వల్ రేవణ్ణకు సూచించారు.
లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విదేశాల్లో ఉన్నాడు. గురువారం మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ ప్రజ్వల్ రేవణ్ణకు నా హెచ్చరిక అనే పేరుతో ఓ లేఖ రాశారు. ఈ లేఖను మాజీ ప్రధాని దేవేగౌడ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో పోస్ట్ చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ వెంటనే కర్ణాటకకు రావాలని మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ ఆయన రాసిన లేఖలో సూచించారు.

మాజీ ప్రధాని దేవెగౌడ రాసిన లేఖ వివరాలు ఇలా ఉన్నాయి. మే 18వ తేదీన గుడికి వెళ్లినప్పుడు ప్రజ్వల్ రేవణ్ణ గురించి మాట్లాడానని, తనకు, నా కుటుంబానికి, నా సహచరులకు, స్నేహితులకు, నా పార్టీ కార్యకర్తలకు అతను కలిగించిన షాక్ నుండి, ఆ బాధ నుండి బయటపడి మాట్లాడటానికి కొంత సమయం పట్టిందని దేవేగౌడ ఆయన ఆయన లేఖను మొదలుపెట్టారు. చట్ట ప్రకారం ప్రజ్వల్ రేవణ్ణ దోషి అయితే అతను శిక్ష అనుభవించాలని తాను మొదటి నుంచి చెబుతున్నానని, నేను ఇప్పటికే అదే మాట చెబుతున్నానని మాజీ ప్రధాని దేవేగౌడ వివరించారు.
I have issued a warning to @iPrajwalRevanna to return immediately from wherever he is and subject himself to the legal process. He should not test my patience any further. pic.twitter.com/kCMuNJOvAo
— H D Deve Gowda (@H_D_Devegowda) May 23, 2024
ప్రజ్వల్ రేవణ్ణ తప్పు చేసినట్లు రుజువు అయితే అతన్ని చాలా కఠినంగా శిక్షించాలని, నా మాటగా నా కొడుకు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్. డీ. కుమారస్వామి ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి ఇదే చెబుతూనే ఉన్నారని మాజీ ప్రధాని దేవేగౌడ లేఖలో పేర్కొన్నారు. ఇంతకాలం మనమడు ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారంలో మౌనంగా ఉన్న మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ ఇప్పుడు అతన్ని సిట్ ముందు లొంగిపోవాలని బహిరంగంగా లేఖ రాయడం కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ మాటను ఆయన మనమడు ప్రజ్వల్ రేవణ్ణ ఎంత మాత్రం వింటాడు అనే విషయం త్వరలోనే తేలిపోతుంది.
-
Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీం షాక్-తెలంగాణ హైకోర్టు బెయిల్ పై..! -
Kerala Elections: కేరళ పోలింగ్ పై సీక్రెట్ గా ఈసీ..! కాంగ్రెస్ డౌట్స్..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications