వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక సీఎం కుర్చీలో నేడు కుమారస్వామి, 25న బలపరీక్ష, 29న మంత్రి వర్గం, అసమ్మతి దెబ్బ!

|
Google Oneindia TeluguNews

Recommended Video

కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా హెచ్.డి.కుమారస్వామి

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్.డి.కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా హెచ్.డి.కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రిగా కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి. పరమేశ్వర్ మాత్రమే బుధవారం ప్రమాణస్వీకారం చేస్తున్నారు. పూర్తి మంత్రి వర్గం ప్రమాణస్వీకారం చెయ్యడానికి వారం రోజులు (మే 29) గడువు విధించారు. అసమ్మతి దెబ్బతో వారం రోజులు సమయం తీసుకుంటున్నారని సమాచారం.

కాంగ్రెస్, జేడీఎస్ చర్చలు

కాంగ్రెస్, జేడీఎస్ చర్చలు

బెంగళూరు నగరంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన నాయకులు సుదీర్ఘంగా చర్చలు జరుపుతూనే ఉన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవుల పంపకంపై రెండు పార్టీల నేతలు ఓ నిర్ణయానికి వచ్చారు.

కుమారస్వామికి కోత

కుమారస్వామికి కోత

కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఎన్ని మంత్రి పదవులు పంచుకోవాలి అంటూ చర్చలు జరిపారు. కాంగ్రెస్ కు 20 మంత్రి పదవులు ఇవ్వాలని మొదట నిర్ణయించారు. ముఖ్యమంత్రితో పాటు 13 మంత్రి పదవులు, స్పీకర్ పదవి ఇవ్వాలని జేడీఎస్ డిమాండ్ చేసింది. అయితే చివరి నిమిషయంలో కుమారస్వామి కోరికకు కోత పడింది. కాంగ్రెస్ కు 22 మంత్రి పదవులు, జేడీఎస్ కు 12 మంత్రి పదవులు వస్తున్నాయి.

కాంగ్రెస్, జేడీఎస్ లెక్క

కాంగ్రెస్, జేడీఎస్ లెక్క

బెంగళూరులో కాంగ్రెస్, జేడీఎస్ నేతలు చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి. పరమేశ్వర్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ కేసీ. వేణుగోపాల్, జేడీఎస్ పార్టీ నుంచి హెచ్.డి. కుమారస్వామి, హెచ్.డి. రేవణ్ణలు చర్చలు జరిపారు.

రెండోసారి రమేష్ కుమార్

రెండోసారి రమేష్ కుమార్


కర్ణాటక స్పీకర్ గా కర్ణాటక- ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని శ్రీనివాసపురం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రమేష్ కుమార్ ను నియమిస్తున్నారు. స్పీకర్ నియామకంపై కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఓ అంగీకారానికి వచ్చాయి. గతంలో రమేష్ కుమార్ స్పీకర్ గా, మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.

మే 29వ తేది మంత్రులు

మే 29వ తేది మంత్రులు


కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేస్తున్న హెచ్.డి. కుమారస్వామి మే 25వ తేదీ శుక్రవారం అసెంబ్లీలో బలపరీక్షలో మెజారిటీ నిరూపించుకోవడానికి సిద్దం అయ్యారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు కూడకట్టుకుని బలపరీక్షలో విజయం సాధించి మే 29వ తేదీ బుధవారం మంత్రి వర్గంతో ప్రమాణస్వీకారం చేయించాలని హెచ్.డి. కుమారస్వామి, కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు.

English summary
HDK to seek the trust vote on Friday. This will be preceded by the speaker’s election. full council of ministers will be sworn in on May 29. Designated CM HD Kumaraswamy’s oath taking ceremony to be held on today, May 23. KPCC president Dr. G. Parameshwar also taking oath along with Kumaraswamy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X