డీకే శివకుమార్ శాస్వతంగా తీహార్ జైలుకు వెలుతారు ?, హెచ్ డీ సంచలనం, ఏం జరుగుతోంది ?

బెంగళూరు: కర్ణాటక డీసీఎం డీకే. శివకుమార్ తీహార్ జైలుకు (tihar jail) వెళ్లి వచ్చారని, ఆయన శాశ్వతంగా తీహార్ కు (tihar jail) తిరిగి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి (Kumaraswamy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కుమారస్వామి వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తప్పుబట్టారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన డీకే శికుమార్ (dk shivakumar) కుమారన్న (కుమారస్వామి) గతంలో ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో ఆయన మాటలతోనే చెప్పారని డీసీఎం డీకే శివకుమార్ వ్యంగంగా అన్నారు.

కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా మీద, నా సోదరి, సోదరుడిపైనా, నా భార్యపైనా కేసులు పెట్టారని డీకే శివకుమార్ (dk shivakumar) గుర్తు చేశారు. తర్వాత ఇప్పుడు కుమారస్వామి (Kumaraswamy) ఏం చేయ్యాలో చెప్పాడు. ఇక ఈ విషయం గురించి తరువాత మాట్లాడుకుందాం అన్నారు. కాంగ్రెస్ (Congress), జేడీఎస్ ల (JDS) సంకీర్ణ ప్రభుత్వం పతనానికి డీకే శివకుమార్ (dk shivakumar) కారణమని కుమారస్వామి చేసిన ఆరోపణలపై డీకే శివకుమార్ మండిపడ్డారు.

HD Kumaraswamy who made sensational comments that DK Shivakumar will once again go to Tihar Jail
కర్ణాటకలోని కాంగ్రెస్ప ప్రభుత్వం త్వరలో కుప్పకూలిపోతుందని చెప్పిన కుమారస్వామి వ్యాఖ్యలపైన డీకే శివకుమార్ (dk shivakumar) స్పందించారు. కుమారస్వామి (Kumaraswamy) చాలా పెద్ద వ్యక్తి, ఆయన జాతకాలు బాగా చెబుతారని, మా ప్రభుత్వం ఎలా కూలిపోతుంది అని ఆయన ఎలా చెప్పారు అని పూర్తి సమాచారం తెలుసుకుని మాట్లాడుతానని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.

బెంగళూరు (Bengaluru) నగరంలో 5,000 చదరపు అడుగుల భవనం ఉన్న యజమానులు బీబీఎంపీకి 2, 000 చదరపు అడుగుల కట్టడం ఉన్నట్లు తప్పుడు లెక్కలు చూపించి ఆస్తి పన్ను ఎగవేస్తున్నారని, అలాంటి అక్రమాలు అరికట్టి అన్ని సక్రమంగా ఉండేటట్లు చూస్తామని డీకే శివకుమార్ అన్నారు. అక్రమ కట్టడాలతో పాటు కరెంట్ బిల్లులు, విద్యుత్ బిల్లులు కూడా ఇలాగే ఉన్నాయని, వాటి పూర్తి సమాచారం సేరరించాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (dk shivakumar) వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+