కర్ణాటకలో స్టాలిన్ బీటీమ్ ప్రభుత్వం, కుర్చో అంటే కుర్చుని, పైకిలేయ్ అంటే !
బెంగళూరు/చెన్నై: కర్ణాటక (karnataka) రాష్ట్ర వ్యాప్తంగా కావేరి జలాల కోసం పోరాటాలు కొనసాగుతున్నాయి. మంగళవారం బెంగళూరు బంద్ నేపథ్యంలో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని (karnataka)కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలను ఖండించిన మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి సిద్దరామయ్య మీద మండిపడుతున్నారు. దీనిపై వరుస ట్వీట్లు చేసిన మాజీ సీఎం కుమారస్వామి (Kumaraswamy) కావేరి కోసం (cauvery) పోరాటం చేస్తున్న వారి గొంతు నొక్కాలని కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గపు ఎత్తులు వేస్తోందని ఆరోపించారు.
ఇది కన్నడిగుల ప్రభుత్వమా? స్టాలిన్ ఆధ్వర్యంలో కర్ణాటకలో (karnataka)ఉన్న డీఎంకే పార్టీ బీటీమ్ ప్రభుత్వమా ? అంటూ కుమారస్వామి ప్రశ్నించారు. కావేరీ (cauvery) నదీ జలాల పంపిణీలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ. కుమారస్వామి (Kumaraswamy) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కన్నడిగుల ప్రభుత్వమా? తమిళనాడులో అధికారంలో ఉన్న స్టాలిన్ ఆధ్వర్యంలోని రెండో ముఖం ప్రభుత్వామా అని ప్రశ్నించారు.

కన్నడిగుల మనోభావాలు దెబ్బతీస్తున్న సిద్దరామయ్య ప్రభుత్వం తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్పినట్లు వింటోందని, నీళ్లు (cauvery) వదాలి అని స్టాలిన్ అంటే సార్ వదిలేస్తాము అంటూ కర్ణాటకలోని (karnataka) ప్రభుత్వం వ్యవహరిస్తోందని జేడీఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ. కుమారస్వామి (Kumaraswamy) మండిపడుతున్నారు. తమిళనాడులో డీఎంకే పార్టీకి కాంగ్రెస్ పార్టీ బీ టీమ్ అని కుమారస్వామి మండిపడ్డారు.

కావేరి పోరాటాన్ని అణచివేసేలా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నిస్తున్నదని, కావేరి (cauvery) నీటి కోసం వీధుల్లో పోరాడుతున్న రైతులు, కార్యకర్తలను అరెస్టు చేశారని, రాత్రికి రాత్రే అరెస్టు చేయడం ప్రభుత్వ దురాగతాలకు అద్దంపడుతోందని, కర్ణాటకలో (karnataka) కాంగ్రెసక వాళ్లకు ఒక న్యాయం, కన్నడిగులకు మరో న్యాయమా? అని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి (Kumaraswamy) సీఎం సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

బంద్ లో పాల్గోన్న వారిని అరెస్టు చేశారని, రైతులను కన్నడ సంఘాల కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని, తమిళనాడుకు వెంటనే కావేరీ (cauvery) నీటిని ఆపాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ డీఎంకే బీ టీమ్‌గా మారడం వల్లే కావేరీ సంక్షోభం ఏర్పడిందని కన్నడిగులకు (karnataka)అర్థమైందని కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
-
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!












Click it and Unblock the Notifications