Wife: రేప్ కేసు నుంచి తప్పించుకోవాలని ఆమెతోనే పెళ్లి, పంచాయితీ పెట్టి మూడుసార్లు ఫ్రీగా తలాక్ చెప్పాడు!
పోలీసు కేసు, జైలు శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఆ యువకుడు అత్యాచారం చేసిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన కొంతకాలం తరువాత ఆమెకు మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేశాడు.
న్యూఢిల్లీ: ఓ యువతిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి మీద అత్యాచారం చేసిన నిందితుడు పోలీసు కేసులు అవుతాయని భయపడిపోయాడు. పోలీసు కేసు, జైలు శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఆ యువకుడు అత్యాచారం చేసిన యువతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే పెళ్లయిన కొంతకాలం తరువాత ఆమెకు మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేసి వివాహాన్ని రద్దు చేసుకున్నాడు.
రేప్ కేసు ఉండదని, ఇప్పుడు ఆమె నా భార్య అని, విడాకులు ఇచ్చిన తరువాత ఎలాంటి సమస్య ఉండదని అనుకున్నాడు. అయితే బాధితురాలు ధైర్యంగా అతని అంతు చూడాలని ఆమె భర్తపై పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టింది.

అత్యాచారం చేసిన అమ్మాయితో పెళ్లి
ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ లోని పున్హానా ప్రాంతంలో సమీర్ అహ్మద్ అనే యవకుడు నివాసం ఉంటున్నాడు. మూడు సంవత్సరాల క్రితం 28 ఏళ్ల యువతి మీద సమీర్ పదేపదే అత్యాచారం చేశాడు. తరువాత పోలీసు కేసు అయితే జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడిన సమీర్ రేప్ చేసిన యువతిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అనుకున్నట్లే ఆ యువతిని ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు.

పీడపోతుందని తలాక్ చెప్పాడు
భార్య మీద మోజు తీరిపోవడంతో ఆమెకు తలాక్ చెప్పి ఆమెను పీడ వదిలించుకోవలని సమీర్ డిసైడ్ అయ్యాడు. పంచాయితీలో మూడుసార్లు భార్యకు తలాక్ చెప్పిన సమీర్ తరువాత పోస్ట్ ద్వారా విడాకుల పత్రాలను అతని భార్యకు పంపించాడు. పోస్టులో విడాకుల పత్రాలు రావడంతో సమీర్ భార్య హడలిపోయింది. భర్త అంతు చూడాలని డిసైడ్ అయిన సమీర్ భార్య పోలీసులకు ఆశ్రయించింది.

నా భర్త ఏం చేశాడంటే?
2020లో సమీర్ అహ్మద్ నాతో బలవంతంగా శారీరక సంబంధాలు పెట్టుకున్నాడని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాన్ని తాను కుటుంబసభ్యుల దృష్టికి తీసుకెళ్లాను. సమీర్ మా కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. చివరకు నన్ను పెళ్లి చేసుకోవడానికి సమీర్ అంగీకరించాడు. మే 29, 2020న మేము ఇస్లామిక్ పద్ధతుల ప్రకారం ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం చేసుకున్నామని సమీర్ భార్య పోలీసులకు చెప్పింది. అయితే నన్ను ఎప్పుడూ తన భర్త సమీర్ అతని ఇంటికి తీసుకెళ్లలేదని బాధితురాలు పోలీసులకు చెప్పింది.

నా మొగుడు పద్దతి మార్చుకోలేదు
జనవరి 24, 2021న, నా కుటుంబ సభ్యులు సమీర్ ఇంటికి వెళ్లారు. వారితో పాటు పంచాయతీ సభ్యులు కూడా వెళ్లి వివాదాన్ని పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఈసారి తన ఎదుటే మూడుసార్లు తలాక్ తలాక్ తలాక్ అని చెప్పిన తన భర్త సమీర్ తనతో విడాకులు తీసుకున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తకు ఎంత నచ్చచెప్పినా అతను పద్దతి మార్చుకోలేదని, అందుకే తాను ఇప్పుడు కేసు పెడుతున్నానని బాధితురాలు చెప్పిందని, సమీర్ మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్ననామని గురుగ్రామ్ పోలీసు అధికారు రాకేష్ కుమార్ స్థానిక మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications