viral video:వామ్మో.. బ్రెడ్.. దానిపై చాక్లొట్, ఛీజ్, ఐస్‌క్రీమ్.. ఇదీ శాండ్ విచా..? లేక
పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి అని ఊరికే అనలేదు. ఈ కాలంలో కొత్తగా టేస్ట్ చేద్దాం అనుకునేవారు చాలా మంది ఉన్నారు. టేస్టీగా ఉంటే చాలు.. ఎంతదూరం అయినా వెళ్లేందుకు రెడీ అవుతారు. అలా కొత్త కొత్త వస్తువులను రెడీ చేస్తున్నారు. చాలా మంది వాటిని ఇష్టపడుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో చేసిన తిను బండారాలు బెడిసికొడుతుంటాయి. గుజరాత్‌లో ఆ వీధి వ్యాపారి ఇలానే చేశారు. అతను చాక్లొట్ చీజ్ శాండ్ విచ్ తయారు చేశారు.

శాండ్ విచ్ ఇలా..?
గుజరాత్ భావ్‌నగర్‌కు చెందిన ఓ వీధి వ్యాపారి వెరైటీగా శాండ్ విచ్ తయారు చేశారు. దానికి అతను స్ట్రాబెర్రీ జామ్, ఛీజ్, చాక్లొట్ ఐస్ క్రీమ్ కలిశాడు. అవును మీరు వింటున్నది నిజమే.. దానిని కొందరు పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది. ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేస్తున్నారు. చాలా మంది అబ్బే ఇదేం బావుంటుందని అడుగుతున్నారు. చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
లవ్ షేప్‌లో తయారు చేసి..
బ్రెడ్‌ను హార్ట్ సేప్‌లో కట్ చేశాడు. మరొ వ్యక్తి చాక్లెట్‌ను పొడి మాదిరిగా చేశాడు. దానిని బ్రెడ్‌పై వేశాడు. తర్వాత ఛీజ్ వేశాడు. బట్టర్ కూడా వేశాడు. అంతటితో ఊరుకోలేదు రెండు చాక్లెట్ ఐస్ క్రీమ్స్ కట్ చేశాడు. లవ్ షేప్ మరొటి కట్ చేసి అందులో పెట్టాడు. శాండ్ విచ్ కూడా రెండుగా విడదీసి.. ఇక తినడమే తరువాయి అని చెబుతున్నాడు. వీడియో తెగ వైరల్ అవుతుంది. 654.9 కే సార్ల చూశారు. 3 వేల లైకులు కూడా వచ్చాయి.

దారుణమైన ఫుడ్ కాంబినేషన్
చాలా మంది ఇదీ దారుణమైన ఫుడ్ కాంబినేషన్ అంటున్నారు. బట్టర్, జామ్, చాక్లొట్ అయితే ఓకే.. కానీ ఐస్ క్రీమ్, ఛీజ్ వాడటం సరికాదని ఒకరు అంటున్నారు. ఇదీ తనకు ఏ మాత్రం నచ్చలేదని కామెంట్ చేశారు. ఇలా చాలా మంది బాగోలేదని రాశారు.

ఒమర్ అబ్దుల్లా కూడా
ఈ డిష్ చూసి జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా షాక్ తిన్నారు. దీనిని ఎవరూ తయారు చేశారు. మార్కెట్లోకి ఎలా వచ్చింది.. అని ప్రశ్న వేశాడు. తనకు గుజరాత్ ఫుడ్ అంటే ఇస్టం అన్నాడు. కానీ ఇదీ మాత్రం నచ్చలేదని చెప్పారు. ఇదీ నరకంలో తయారు చేసే ఫుడ్ మాదిరిగా ఉంది. ఈ రోజు తన కళ్లు దీనిని చూసి తప్పు చేశాయని మరొకరు అన్నారు. ఇలా చాలా మంది కామెంట్స్ చేశారు.












Click it and Unblock the Notifications