Rains: మహారాష్ట్ర, గుజరాత్‍లో భారీ వర్షాలు.. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు..

రాబోయే రెండు రోజుల్లో కొంకణ్‌లోని కొన్ని ప్రదేశాలు, మధ్య మహారాష్ట్రలోని పశ్చిమ ఘాట్ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది."చురుకైన రుతుపవన పరిస్థితుల కారణంగా రాబోయే 2-3 రోజులలో కొంకణ్‌లోని కొన్ని ప్రాంతాలు, మధ్య మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది" అని IMD చెప్పింది.

వాతావరణ పరిస్థితుల కారణంగా, మత్స్యకారులు కూడా జూన్ 29 నుంచి జూలై 3 వరకు సముద్రంలోకి వెళ్లొద్దని కోరారు. మహారాష్ట్ర, గుజరాత్, హిమాచల్​ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, గోవా, ఉత్తరప్రదేశ్, వెస్ట్​బెంగాల్, కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. గురుగ్రామ్​లో ఉదయం 6 గంటల నుంచి కురిసిన కుండపోత వర్షానికి ఎక్స్​ప్రెస్​వే సహా 25 ప్రాంతాలు నీట మునిగాయి.

 Rains

ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు ముగ్గురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. చెట్లు కూలిపోగా, కార్లు వరదకు కొట్టుకుపోయాయి. థానేలోని దివాలో 16 ఏండ్ల బాలుడు వరదలో గల్లంతయ్యారు. థానే సిటీలో 20 సెం.మీ. వర్షపాతం నమోదయింది. గోవాలో జూలై 3 వరకు అనేక జిల్లాలు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది.

"గోవాలో చురుకైన రుతుపవన పరిస్థితులతో మునుపటి అంచనాల కొనసాగింపుగా, జూన్ 29, 30 మరియు జూలై 1, 2, 3, 2023 తేదీలలో రాష్ట్రంలోని ఉత్తర గోవా & దక్షిణ గోవా జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది" అని IMD పేర్కొంది.ఢిల్లీలో, రాబోయే నాలుగు రోజుల్లో దేశ రాజధానిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

 Rains

దక్షిణ భారతదేశంలో జూలై 5 వరకు కేరళ, మహే, కోస్టల్ & సౌత్ ఇంటీరియర్ కర్నాటకలో తేలికపాటి నుంచి మోస్తరు వరకు చాలా విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+