rains: బెంగళూరులో దుమ్ము దులిపేసిన వాన దేవుడు, కరెంట్ కట్, వీకెండ్ లో చీకటి !

బెంగళూరు వరుణదేవుడు తన ప్రతాపం చూపించాడు. సాయంత్రం నుంచి అర్దరాత్రి వరకు విపరీతమైన వాన కురిసింది. భారీ వర్షం పడటంతో పలు ప్రాంతాల్లో ట్రాన్స్ ఫార్మర్లు ఢమాల్ అన్నాయి.

బెంగళూరు/ఎలక్ట్రానిక్ సిటీ: బెంగళూరు నగరంలో వరుణదేవుడు తన ప్రతాపం చూపించాడు. శుక్రవారం సాయంత్రం నుంచి అర్దరాత్రి వరకు విపరీతమైన వాన కురిసింది. విపరీతంగా వానలు పడటంతో పలు ప్రాంతాల్లో ట్రాన్స్ ఫార్మర్లు ఢమాల్ అన్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫా నిలిచిపోయింది. భారీ వానలతో పాటు కరెంట్ కట్ కావడంతో పలు ప్రాంతాల్లోని రహదార్లు చీకటి మయం అయ్యాయి. సాయంత్రం కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలుదేరిన చాలా మంది వర్షంలో చిక్కుకుని ఎక్కడవాళ్లు అక్కడే ఉండిపోయారు.

బెంగళూరు నగరంలోని జయనగర, మడివాళ, జయనగర, సర్దాపుర, హెచ్ఎస్ఆర్ లేఔట్, బాణసవాడి, కేఆర్ పురం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మెజస్టిక్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని మల్లేశ్వరం, రాజాజీనగర, బసవేశ్వరనగర, విధానసౌధ పరిసర ప్రాంతాల్లో ఓ మోస్తారుగా వర్షం కురిసింది. అయితే జయనగర, మడివాళ, బాణసవాడి పరిసర ప్రాంతాల్లో వాన దెవుడు దుమ్ముదులిపేయడంతో పలు ప్రాంతాల్లో చెట్టు విరిగి రోడ్ల మీదపడ్డాయి.

Heavy rains in Bengaluru, the rain put brakes on the weekend enjoyment.

బెంగళూరులో గురువారం, శుక్రవారం సుమారు 3.4 మీమీ వర్షపాతం నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు. బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలో రానున్న 48 గంటల్లో పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. బెంగళూరులోని బసవనగుడి, యలహంక, రాజాజీనగర, ఆర్ టీ గనగర్, యలహంక, హనుమంతనగర, విద్యాపీఠ, శివాజీనగర పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడిందని అధికారులు తెలిపారు.

బెంగళూరులో వీకెండ్ లో ఎంజాయ్ చెయ్యాలని అనుకున్న యువత శుక్రవారం రాత్రి పూర్తిగా నిరాశ చెందారు. బెంగళూరు నగరంలో పలు ప్రాంతాల్లో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పుట్టిన రోజు వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసుకోవడంతో భారీ వర్షం కురవడంతో పునీత్ రాజ్ కుమార్ పుట్టిరోజు వేడుకలు అర్దాంతరంగా నిలిచిపోయాయి. బెంగళూరు సిటీతో పాటు బెళగావి, ధారవాడ, గదగ్, హావేరి, బళ్లారి, చిక్కమగళూరు, చిత్రదుర్గ, దావణగెరె, హాసన్, కొడుకు, రామనగర, శివమొగ్గ, హాసన్, హావేరి తదితర జిల్లాలో కూడా భారీ వర్షాలు పడ్డాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+