ఆసేతు 'హిమాచలం'... 'యమునో'గ్ర రూపం
ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు జలప్రళయం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు హిమాచల్ ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలు నీటి మునిగాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 90 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లో 12 మంది, హర్యానా, పంజాబ్‌లో 21 మంది మరణించారు. ఉత్తరాఖండ్‌లో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారులను మూసివేశారు.
పర్యాటకుల్ని ఖాళీ చేయించడం క్లిష్టతరంగా మారింది. కొండచరియలు విరిగిపడడం, మెరుపు వరదల వల్ల ఎక్కడికక్కడే వాహనాలన్నీ నిలిచిపోయాయి. కాసోల్ లో 2వేల మందిని ఎన్ డీఆర్ ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించారు. వీరిలో 52 మంది పాఠశాల విద్యార్థులతోపాటు 100 మంది పర్వాతారోహకులున్నారు.

#WATCH | NDRF's Joint Rescue Ops saved 28 stranded shepherds/trekkers from Kinnaur, Himachal Pradesh's Kara area. Due to rising water levels, 11 people were trapped 15 kilometres from Kafnu village. On July 10th, the NDRF team, along with ITBP and Home Guard personnel, embarked… pic.twitter.com/e8Ns5CNQ9A
— ANI (@ANI) July 12, 2023
ఏడుగురు పర్వతారోహకుల్ని వాయుసేన విమానం రక్షించింది. భారీగా మంచు కురుస్తూ రోడ్డుమార్గాలను మూసేస్తోంది. కొన్ని బృందాలు మంచును తొలగిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1312 కోట్లరూపాయల ఆస్తి నష్టం సంభవించింది. నోయిడా సెక్టార్ 168లో గోశాల మునిగిపోవడంతో అందులోని మూగ జీవాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
#WATCH | Noida Sector 168, UP: Cattle being rescued from Gaushalas of Chhaprauli village after the area has been heavily flooded pic.twitter.com/1Fe6Wceh5U
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 12, 2023
దేశ రాజధానిలో యమునమ్మ మహోగ్ర రూపాన్ని దాల్చింది. నీటి మట్టం 208.51 మీటర్లకు చేరింది. ఈ స్థాయిలో ప్రవహించడం చరిత్రలో ఇదే తొలిసారి. హత్నీకుండ్ నుంచి హర్యానా ప్రభుత్వం దిగువకు వరదను విడుదల చేస్తోంది. దీనివల్ల నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని జల కమిషన్ అంచనా వేస్తోంది. అంబాలాలో హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ నివాసంలోకి భారీగా వరద నీరు చేరింది. మంత్రి ఇంటిముందు నీరు చేరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మంత్రి బయటకు వచ్చి విధి నిర్వహణ చేపట్టారు. పడవలో నగరమంతా పర్యటిస్తూ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
#WATCH | Noida Sector 168, UP: Cattle being rescued from Gaushalas of Chhaprauli village after the area has been heavily flooded pic.twitter.com/1Fe6Wceh5U
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 12, 2023












Click it and Unblock the Notifications