సంచలన నిర్ణయం తీసుకున్నా బీర్ కంపెనీ: ఉద్యోగులకు బిగ్ షాక్..!
ప్రముఖ బీర్ తయారీ సంస్థ భారీ షాక్ ఇచ్చింది. మద్యం ధరలు పెరుగుతోండటం, వినియోగదారుల డిమాండ్ తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. బీర్ తయారీ ఖర్చు అధికమౌతున్న నేపథ్యంలో ఈ తాజా నిర్ణయం తీసుకుంది. ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో సమీప భవిష్యత్తులో అమలు చేసేలా కఠిన నిర్ణయాలను తీసుకుంది. అనేక సవాళ్లను ఎదుర్కొనాల్సి రావడం వల్ల భారీ ఎత్తున సంస్థను పునర్వ్యవస్థీకరించనుంది.
6,000 ఉద్యోగాల తొలగింపు..
రాబోయే రెండు సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,000 ఉద్యోగాలను తొలగించనున్నట్లు హైనికెన్ బ్రేవరేజెస్ సంస్థ ప్రకటించింది. వినియోగదారుల డిమాండ్ తగ్గడం, వ్యయాలు పెరగడంతో పాటు ఇటీవలే చీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీనామా అనంతరం నాయకత్వ అనిశ్చితి వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. తన లాభాల వృద్ధి అంచనాలను కూడా తగ్గించింది. మున్ముందు మరిన్ని లేఆఫ్స్ ఉండొచ్చని తెలిపింది.

ఖర్చును తగ్గించుకోవడం..
మార్కెట్ విలువరీత్యా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్రూవర్ అయిన హైనేకెన్, ఉత్పాదకతను పెంచే ప్రయత్నంలో భాగంగా తమ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో దాదాపు ఏడు శాతం మందిని, అంటే 5,000 నుండి 6,000 పోస్టులను తొలగించనుంది. ప్రస్తుతం కంపెనీలో 87,000 మంది ఉద్యోగులు ఉన్నారు. తాజా లేఆఫ్ ద్వారా ఖర్చును తగ్గించుకోవడంతో పాటు ప్రస్తుత ఉద్యోగుల పని సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది.
సీఈఓ ఆకస్మికంగా రాజీనామా..
కిందటి నెలలో సీఈఓ డాల్ఫ్ వాన్ డెన్ బ్రింక్ ఆకస్మికంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలువడింది. వాన్ డెన్ బ్రింక్ మే నెలలో పదవి నుంచి వైదొలగనున్నారు. ఆయన వారసుడి కోసం కంపెనీ అన్వేషణ మొదలు పెట్టింది. ఈ ఉద్యోగ కోతలు ప్రధానంగా వృద్ధి అవకాశాలు తక్కువగా ఉన్న ప్రాధాన్యత లేని మార్కెట్‌లపై దృష్టి సారించనున్నాయి. అంతేకాకుండా, గతంలో ప్రకటించిన పునర్నిర్మాణ కార్యక్రమాల ద్వారా సప్లై నెట్‌వర్క్, ప్రధాన కార్యాలయం, ప్రాంతీయ వ్యాపార విభాగాలలో మరిన్ని తగ్గింపులు ఉంటాయని కంపెనీ వెల్లడించింది.
ఆదాయ వృద్ధి అంచనాల్లోనూ కోత..
ఈ చర్యలు సంస్థ కార్యకలాపాలను బలోపేతం చేయడంతో పాటు వృద్ధిలో పెట్టుబడులు పెట్టే సామర్థ్యాన్ని కొనసాగించడానికి ఉద్దేశించినవని హైనేకెన్ ఫైనాన్షియల్ డివిజన్ చీఫ్ హెరాల్డ్ వాన్ డెన్ బ్రూక్ పేర్కొన్నారు. హైనేకెన్ 2026లో నిర్వహణ లాభాల వృద్ధి 2 నుండి 6 శాతం మధ్యన ఉంటుందని అంచనా వేస్తోంది. గత సంవత్సరం అంచనా వేసిన 4 శాతం నుండి 8 శాతంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అయినప్పటికీ- 2025లో వార్షిక ఆర్గానిక్ నిర్వహణ లాభాల వృద్ధి 4.4 శాతంగా నమోదైంది.












Click it and Unblock the Notifications