నడిరోడ్డులో హెలికాప్టర్ ఎమర్జన్సీ ల్యాండింగ్.. అసలు ఏం జరిగిందంటే ?
సాఫీగా సాగుతున్న ప్రయాణంలో ఊహించని షాక్ ఎదురైతే ప్రయాణీకుల ఫీలింగ్ ఎలా ఉంటుంది.. అది కూడా గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో అయితే భయంతోనే ప్రాణాలు పోతాయి. ఇలాంటి అనుకోని పరిస్థితుల్లోనే నడిరోడ్డుపై హెలికాప్టర్ ల్యాండ్ అయితే ఇంక ఆ ఊహించడానికి కూడా ఒకింత ఆశ్చర్యం, భయం అని కలగలిపి వస్తాయి. ప్రయాణిస్తున్న వారికే కాదు ఈ తతంగాన్ని చూస్తున్న వారందరికీ కూడా భయం భయం గానే ఉంటుంది అనడంలో సందేహం అక్కర్లేదు. ఈ తరహా ఘటనే ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది.
ఉత్తరాఖండ్ లో ఛార్ ధామ్ యాత్ర కొనసాగుతోంది. భారీ సంఖ్యలో భక్తులు ఈ యాత్రను చేసేందుకు.. రుద్రప్రయాగ్ కు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి కొంతమంది కాలినడకన లేదా వాహనాల్లో వెళ్తే.. మరికొందరు హెలికాప్టర్ లలో వెళ్తుంటారు. ఈ క్రమంలోనే కేదార్‌నాథ్‌కు వెళ్లే భక్తులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్.. బదాసు ప్రాంతంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. జనావాసాల మధ్య ఒక్కసారిగా హెలికాప్టర్ అత్యవసరంగా దిగడంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు.

హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు సమాచారం అందగానే మెడికల్, ఎమర్జెన్సీ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సేవలందించారు. ఈ ఘటనలో ఆ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులతోపాటు ఒక పైలట్ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో హైవేపై ప్రయాణిస్తున్న ఓ కారు తీవ్రంగా ధ్వంసం అయింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ గా మారాయి.
అయితే ఉత్తరాఖండ్‌లో ఉండే ప్రతికూల వాతావరణం కారణంగా అప్పుడప్పుడు ఇలా హెలికాప్టర్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం సర్వసాధారణమే అని చెబుతున్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ (యూసీఏడీఏ) కూడా స్పందించింది. వెంటనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కి సమాచారం అందించింది. ఈ అత్యవసర ల్యాండింగ్‌కు గల కారణాలపై డీజీసీఏ దర్యాప్తు జరిపిన తర్వాత అధికారులు మరిన్ని విషయాలు వెల్లడించనున్నారు. మిగిలిన హెలికాప్టర్ కార్యకలాపాలు షెడ్యూల్ ప్రకారమే సాధారణంగా జరుగుతున్నాయని తెలిపారు.
#WATCH | Uttarakhand | A private helicopter en route to Kedarnath Dham made an emergency landing in Guptkashi of Rudraprayag district due to a technical fault. All the people on board the helicopter are safe: Uttarakhand ADG Law and Order Dr V Murugeshan
— ANI (@ANI) June 7, 2025
CEO of UCADA has… pic.twitter.com/Zj1SLluZ7N
మరోవైపు ఇటీవల ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో మే 8వ తేదీన ఓ ప్రైవేటు హెలికాఫ్టర్ భాగీరధి నది సమీపంలో కుప్పకూలింది. 200 కిలోమీటర్ల లోతైన లోయలోకి జారిపడటంతో ఆరుగురు యాత్రికులు మృతి చెందగా.. మరో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications