వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రుల జాబితా ఇదే...

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రులు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే, కొత్త మంత్రివర్గంలో ఎవరెవరు ఉండబోతున్నారు? పాత క్యాబినెట్లో ఎవరెవరికి మళ్లీ స్థానం దక్కుతుంది? దీనికి సంబంధించిన తుది జాబితాను సిద్ధం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత మూడు రోజులుగా కసరత్తు చేస్తూనే ఉన్నారు.

ఈ జాబితా ఖరారైంది. అనధికారికంగా విడుదలైంది. అయితే, ఇంకా అధికారికంగా జాబితాను విడుదల చేయలేదదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొత్త మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారికి ఇప్పటికే ఫోన్ చేసి సమాచారాన్ని తెలిపినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

సోమవారం ఉదయం 11.31 గంటలకు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వారి ఈ తుది జాబితా ఇదే.

కొత్త మంత్రివర్గంలో సభ్యులు వీళ్లే…

మంత్రివర్గం

ఇదిలా ఉంటే, కొడాలి నాని, మల్లాది విష్ణు, ప్రసాదరాజు, కొలగట్ల వీరభద్రస్వామిలకు క్యాబినెట్ హోదా కలిగిన పదవులు ఇస్తారని సమాచారం. కొడాలి నానికి ఏపీ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేసి దానికి అధ్యక్షునిగా నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని తెలుస్తోంది.

మల్లాది విష్ణుకు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఖాయమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. డిప్యూటీ స్వీకర్‌గా కొలగట్ల వీరభద్ర స్వామి, చీఫ్ విప్‌గా ప్రసాదరాజులను నియమించే అవకాశాలున్నాయి.

ధర్మాన ప్రసాదరావు
గుడివాడ అమర్‌నాథ్

బూడిద ముత్యాలనాయుడు

మొత్తంగా, ఈసారి ప్రకాశం జిల్లాకు మంత్రి పదవి దక్కలేదని తెలుస్తోంది. కులాలవారీగా చూస్తే కమ్మ, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ సామాజిక వర్గాలకు కూడా కొత్త మంత్రివర్గంలో చోటు దక్కలేదనే విమర్శలు కూడా అప్పుడే వినిపిస్తున్నాయి.

పల్నాడులో నిరసనలు

జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే మాచర్ల నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పిన్నెల్లి. రామకృష్ణరెడ్డికి మంత్రివర్గంలో చోటుకల్పించనందుకు నిరసనగా మండల కేంద్రమైన రెంటచింతలలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై టైర్లు తగలపెట్టారు.

రాస్తారోకో నిరసన కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గం మహిళ నాయకురాలు పాముల సంపూర్ణమ్మ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. వెంటనే తేరుకున్న వైసీపీ నేతలు ఆమెను అడ్డుకున్నారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Here is the list of new ministers in Jagans cabinet
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X