Coronavirus : కరోనా సోకినట్టు ఎలా గుర్తించాలి... ఇవే వైరస్ లక్షణాలు..
కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటిని గడగడలాడిస్తోంది. దీనికి మందు లేకపోవడంతో నివారణ పైనే అన్ని దేశాలు ఫోకస్ చేశాయి. వైరస్ సోకకుండా ఉండేందుకు.. సోకిన తర్వాత ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కీలక సలహాలు,సూచనలు చేస్తున్నాయి. ముఖ్యంగా కరోనా లక్షణాలు బయటపడితే.. వెంటనే ఆసుపత్రికి రావాలని సూచిస్తున్నాయి. జ్వరం,నీరసం,పొడి దగ్గు.. వీటిని కరోనా లక్షణాలుగా చెబుతున్నారు. క్రమంగా వీటి తీవ్రత పెరగవచ్చు. వైరస్ సోకిన ఐదు రోజుల తర్వాత ఈ లక్షణాలు బయటపడుతాయి. సాధారణంగా రెండు నుంచి 14 రోజుల పాటు వీటి లక్షణాలు కనిపించవచ్చు.
కొంతమందిలో ఇతరుల కంటే తక్కువ లక్షణాలు బయటపడవచ్చు.ఇప్పటివరకు నమోదైన కరోనా వైరస్ కేసుల్లో కొన్ని కామన్ లక్షణాలు ఇవే..

జ్వరం
పొడి దగ్గు
కఫం
శ్వాస ఆడకపోవడం
కండరాల నొప్పులు లేదా కీళ్ల నొప్పులు
గొంతు మంట
కరోనా వైరస్ సోకినవారిలో ముక్కు కారడం అనేది అరుదుగా చెబుతున్నారు. సాధారణ జ్వరం,జలుబు లక్షణాలతో కరోనా వైరస్ లక్షణాలు దగ్గరగా ఉంటాయి.
Recommended Video
ఆయా రాష్ట్రాల్లో కరోనా వైరస్ హెల్ప్ లైన్ నెంబర్స్ వివరాలు












Click it and Unblock the Notifications