మా హీరో అలాంటి వాడు కాదు, ఫ్రీ సర్టిఫికెట్ ఇచ్చిన ప్రకాష్ రాజ్, సుదీప్ మాత్రం ? !
బెంగళూరు/హైదరాబాద్: స్యాండిల్ వుడ్ హీరో, బహుబాష నటుడు, దర్శకుడు కిచ్చ సుదీప్ బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే కిచ్చ సుదీప్ బీజేపీలో చేరుతారని ప్రచారం జరగడంతో కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నటీనటులతో పాటు చాలా మంది ఏం జరుగుతోంది అంటూ ఆసక్తిగా ఎదురు చూశారు.
కిచ్చ సుదీప్ తో పాటు స్యాండిల్ వుడ్ కు చెందిన మరో స్టార్ హీరో దర్శన్ సైతం బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. ఇదే విషయంలో బహుబాష నటుడు, దర్శక నిర్మాత ప్రకాష్ రాజ్ స్పంధించారు. కిచ్చ సుదీప్ గురించి తనకు బాగా తెలుసు, కిచ్చ సుదీప్ అమ్ముడుపోయే వ్యక్తి కాదు, మా హీరో మంచోడు అంటూ నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.

కర్ణాటకలో అధికారంలో ఉన్న అవినీతి బీజేపీ ప్రభుత్వం ఈ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తోందని నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. అయితే కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ తో కలిసి విలేకరులతో మాట్లాడిన కిచ్చ సుదీప్ తాను బీజేపీలో చేరడం లేదని, బసవరాజ్ బోమ్మయ్ కోసం ప్రచారం చేస్తానని కిచ్చ సుదీప్ అన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బసవరాజ్ బోమ్మయ్ సూచించిన అన్ని నియోజక వర్గాల్లో ప్రచారం చేస్తానని, కర్ణాటక మొత్తం తిరిగి ఎన్నికల ప్రచారం చెయ్యడం సాధ్యం కాదని హీరో కిచ్చ సుదీప్ అన్నారు. అయితే బసవరాజ్ బోమ్మయ్ చెప్పిన నియోజక వర్గాలు అన్నీ ప్రచారం చేస్తానని చెప్పిన కిచ్చ సుదీప్ పరోక్షంగా బీజేపీకి మద్దతు తెలిపినట్లే అని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు అంటున్నారు. అయితే సీఎం బసవరాజ్ బోమ్మయ్ కోసం మాత్రమే అంటున్న కిచ్చ సుదీప్ పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇచ్చినట్లే అని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications