Rebel Star: రాజకీయాల్లోకి రెబల్ స్టార్ కొడుకు ?, దళపతి ఫ్యామిలీకి చుక్కలు, మెగాస్టార్ హీరోయిన్ దెబ్బతో !

రాజకీయాల్లో చక్రం తప్పి కేంద్ర మంత్రిగా పని చేసిన రెబల్ స్టార్ కొడుకు పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దం అయ్యిందని తెలిసింది.అయితే మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్ తీసుకునే నిర్ణయం మీద ఆ హీరో ఎంట్రీ ఉంటుందా,లేదా?అని తెలుస్తుంది.

బెంగళూరు/మండ్య: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలలో కొత్త, కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు రాజకీయ నేతలు కేంద్ర రాజకీయాల కంటే రాష్ట్ర రాజకీయాలపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అందరి చూపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై పడింది. ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రేస్. జేడీఎస్ పార్టీలు తమ సత్తాచాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కర్ణాటకలో మరోసారి కింగ్ మేకర్ కావాలని జేడీఎస్ అనేక ప్రయత్నాలు చేస్తోంది. అయితే పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రెబల్ స్టార్ కుమారుడు రాజీకాయల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

తెలుగింటి ఆడపడుచు మీద ఫోకస్

తెలుగింటి ఆడపడుచు మీద ఫోకస్

కర్ణాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అందరి కన్ను మండ్యా మీద పడింది. గత లోక్ సభ ఎన్నికల్లో మండ్య లోక్ సభ నియోజకవర్గం నుంచి ప్రముఖ నటి, స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్ అంబరీష్ సతీమణి, తెలుగింటి ఆడపడుచు సుమలతా అంబరీష్ స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. గతంలో రెబల్ స్టార్ అంబరీష్ కేంద్ర మంత్రిగా, మండ్య ఎమ్మెల్యేగా, కర్ణాటక మంత్రిగా పని చేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో అంబరీష్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. అయితే అంబరీష్ అనారోగ్యంతో చనిపోవడంతో ఆయన భార్య, నటి సుమలతా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

దళపతి అడ్డాలో సుమలత ?

దళపతి అడ్డాలో సుమలత ?

మండ్యా ఎంపీ సుమలతా అంబరీష్ రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. మండ్యా జిల్లాలో దళపతి (మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ)కు కంచుకోటగా ఉంది. మాండ్య జిల్లాలో కాంగ్రెస్, బీజేపీలు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తుండగా జేడీ మాత్రం తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఏడింటిని గెలుచుకుని కాంగ్రెస్, బీజేపీకి మొండి చెయ్యి చూపించింది.

దళపతి ఫ్యామిలీకి చుక్కలు చూపించిన సుమలత

దళపతి ఫ్యామిలీకి చుక్కలు చూపించిన సుమలత

అనిసీట్లను గెలుసుకున్న జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు, మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ మనుమడు. ప్రముఖ హీరో నిఖిల్ కుమారస్వామిని గెలిపించుకోలేకపోయింది. నిఖిల్ కుమారస్వామికి చుక్కలు చూపించిన సుమలతా అంబరీష్ పరోక్షంగా కాంగ్రెస్, ప్రత్యక్షంగా బీజేపీ నాయకుల మద్దతు తీసుకుని స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. అప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల్లో పరోక్షంగా సుమలతా కారణంగా మండ్యాలో బీజేపీ ఖాతా తెరిచింది. ఆ సమయంలో దళపతిని లొంగదీసుకున్న కాంగ్రెస్ కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి బీజేపీని దెబ్బ కొట్టే ప్రయత్నంలో చేసిన వ్యూహం ఫలించింది.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దెబ్బతో ?

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దెబ్బతో ?

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో సుమలతా సైలెంట్ అయిపోయారు. బీజేపీ మద్దతు ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ ఆ పార్టీ అధికార కార్యకలాపాలకు సుమలతా దూరం ఉన్నారు. ఇప్పటికే సుమలతాతో సన్నిహితంగా ఉంటున్న అనుచరులు బీజేపీ వైపు మొగ్గు చూపుతుండగా సుమలతా బీజేపీలో చేరే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయమై ఎంపీ సుమలతా బీజేపీకి మద్దతుగా, వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదు. కానీ వారి చుట్టూ ఉన్న వాళ్లు మాత్రం రాజకీయంగా ఎదగడానికి బీజేపీలో చేరిపోతున్నారు.

ఏం జరుగుతోంది ?

ఏం జరుగుతోంది ?

గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మాండ్యాలో జేడీఎస్ కొత్త ఆశలు పెట్టుకుంది. గతంలో సీఎంగా ఉన్న సిద్ధరామయ్యపై విరుచుకుపడ్డ మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబీకుల ఇంటికి వెళ్లి ఆదుకున్నారా ?, వాళ్లకు ఏమైనా సహాయం చేశారా ? అని నిలదీశారు. దీంతో ప్రజలు జేడీఎస్ వైపు మొగ్గు చూపారు. గత ఎన్నికల్లో పాత మైసూర్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని జేడీఎస్ ఈ ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే ఈసారి రాష్ట్రవ్యాప్తంగా జేడీఎస్ ఫోకస్ పెట్టడంతో హెచ్ డీ కుమారస్వామితో పాటు కొందరు నేతలు జలయత్రా, పంచరథయాత్రల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సిన పరిస్థితి అనివార్యమైంది. అంతేకాకుండా కాంగ్రెస్, బీజేపీలను రాజకీయంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి జేడీఎస్ కు ఎదరైయ్యింది.

రాజకీయాల్లోకి రెబల్ స్టార్ కొడుకు ?

రాజకీయాల్లోకి రెబల్ స్టార్ కొడుకు ?

మండ్యాలో కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల వ్యూహాలను అనుసరిస్తున్నాయి. మండ్యా జిల్లాలో బీజేపీకి ప్రభావవంతమైన నాయకుల కొరత ఉంది, ఎంపీ సుమలతా, ఆమె కుమారుడు, హీరో, రెబల్ స్టార్ కొడుకు అయిన అభిషేక్ గౌడ్‌ అలియాస్ అభిషేక్ ను రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకురావడం ద్వారా ప్రయోజనం పొందాలనేది బీజేపీ ప్లాన్ అని తెలిసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్, కాంగ్రెస్, ప్రత్యక్షంగా బీజేపీ సహకారంతో పరోక్షంగా స్వతంత్ర అభ్యర్థిగా లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన సుమలతా అంబరీష్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ స్వతంత్ర అభ్యర్థిగా సుమలతా పోటీ చేసి గెలవడం అంత సులభం కాదని రాజకీయ విశ్లేకులు అంటున్నారు.

బీజేపీలోకి జూనియర్ రెబల్ స్టార్ ?

బీజేపీలోకి జూనియర్ రెబల్ స్టార్ ?

సుమలతా రాష్ట్ర రాజకీయాలపై ఎక్కువగా ఆసక్తి చూపకుండా వచ్చేసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తటస్థంగా ఉండే అవకాశం ఉందని తెలిసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలించిన తరువాత సుమలతా తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపక తప్పదు. సుమలతాను రాజకీయంగా పైకి తీసుకురావాలని కాంగ్రెస్ నాయకులు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని తెలిసింది. అందేకే రెబల్ స్టార్ కుమారుడు అంబరీష్ ను కర్ణాటక రాజకీయాల్లో దింపాలని సుమలతా ఆలోచిస్తున్నారని తెలిసింది. అయితే ఈ విషయంలో మాత్రం సుమలతా ఏమాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.

మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్ డిసైడ్ చేస్తారు ?

మెగాస్టార్ చిరంజీవి హీరోయిన్ డిసైడ్ చేస్తారు ?

సుమలతా అంబరీష్ కుమారుడు అభిషేక్ కు మాత్రం బీజేపీ టిక్కెట్ ఇస్తే మండ్యా రాజకీయాలు మాత్రం మరింత రసవత్తరంగా మారిపోతాయని తెలిసింది. అన్నట్లు సుమలతా గతంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు అనేక మంది తెలుగు హీరోలతో నటించి మంచి హోమ్లీ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాప్ హీరోయినగా కొనసాగుతున్న సమయంలోనే సుమలతా స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్ అంబరీష్ న ప్రేమించి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+