Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లేటుగా లేటెస్టుగా అభిమానిని పెళ్లి చేసుకున్న విజయ్ కాంత్, తండ్రికి ఎంత మంది భార్యలు !

కెప్టెన్ విజయ్ కాంత్ పెళ్లి చాలా ఆలస్యంగా జరిగింది. విజయ్ కాంత్ హీరో అయిన చాలా ఏళ్ల తరువాత ప్రేమలతను పెళ్లి చేసుకున్నారు. దీని వెనుక చాలా పెద్ద కథ కూడా ఉంది. సినిమా రంగంలో గొప్ప విజయాలు సాధించిన విజయ్ కాంత్ తన పెళ్లిని చాలా సంవత్సరాలు వాయిదా వేసుకుంటూ వచ్చారు. 1989లో అతను ఈరోడ్‌లో ఉచిత ఆసుపత్రిని, చెన్నైలోని సాలిగ్రామంలో విజయ్ కాంత్ ఉచిత ఆసుపత్రులను నిర్మించాడు.

విజయ్ కాంత్ తన సన్నిహితులు, అభిమానులకే కాకుండా ఎంతోమంది తెలియని వారికి కూడా సాయం చేశారు. విజయ్ కాంత్ తండ్రి అళగరస్వామికి ఆండాళ్, రుక్మణి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. విజయ్ కాంత్ ఆండాళ్ అమ్మాళ్ కుమారుడు. విజయ్ కాంత్‌తో విజయలక్ష్మి, నాగరాజన్, తిరుమలదేవి జన్మించారు. విజయ్ కాంత్ తండ్రి రెండో భార్య రుక్మిణి అమ్మాళ్‌కు సెల్వరాజ్, బాల్‌రాజ్, చిత్రాదేవి, రామరాజ్, మీనాకుమారి, శాంతి, పృథ్వీరాజ్ అనే 7 మంది సంతానం ఉన్నారు.

Hero Vijay Kant, who got married at a late age, was born in Vellore district to Premalatha

సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుని సినిమా రంగంలో విజయం సాధించి డబ్బు సంపాదించిన విజయ్ కాంత్ ఆయన సవతి తల్లి పిల్లలకు అండగా నిలిచి అందరికి ఎన్నో సహాయాలు చేశారు.అన్నదమ్ములందరికి విజయ్ కాంత్ వివాహాలను ఘనంగా జరిపించాడు. తమ్ముళ్ల వివాహాన్ని విజయ్ కాంత్ నిర్వహించారు. సినిమా కథలో మాదిరిగానే తన అన్నదమ్ములందరికీ పెళ్లిళ్లు చేసి అతని బాధ్యత పూర్తి చేసే నాటికి విజయ్ కాంత్ వయసు 37 ఏళ్లు. అప్పుడే కుటుంబ సభ్యుల ఒత్తిడితో ప్రేమలతను వివాహం చేసుకున్నాడు.

తమిళనాడులోని వేలూరు జిల్లాకు చెందిన బీఏ పట్టభద్రురాలు ప్రేమలత అప్పటికే స్టార్ హీరో అయిన విజయ్ కాంత్‌కు వీరాభిమాని. విజయ్ కాంత్ కు 37 ఏళ్ల వయసు ఉన్న సమయంలో ప్రేమలత ఆయన చేయి పట్టుకున్నారు. విజయ్ కాంత్ 1990 జనవరి 31వ తేదీన ప్రేమలతను వివాహం చేసుకున్నారు. అప్పటికి అతని వయసు 37 సంవత్సరాలు. విజయకాంత్-ప్రేమలత వివాహమై 33 ఏళ్లు పూర్తయ్యాయి.

Hero Vijay Kant, who got married at a late age, was born in Vellore district to Premalatha

డీఎంకే అధినేత కరుణానిధి అంటే విజయకాంత్‌కు చాలా ఇష్టం. ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ అంటే విజయకాంత్ కు కూడా ఇష్టం. విజయకాంత్ పెళ్లిని అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి నిర్వహించారు. విజయకాంత్‌కు వివాహ శుభాకాంక్షలు తెలిపిన డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి నా సోదరుడు విజయ్ కాంత్‌ సినిమా రంగంలో ఉన్నతస్థాయికి చేరినా ఆయనకు నియంత్రణ కలిగి ఉంటారని.. కళారంగంలో ఉన్నతస్థాయికి వెళ్లినా అహంకారం దరిచేరకుండా చూసుకుంటారన్నారని కరుణానిధి విజయ్ కాంత్ పెళ్లి రోజు కితాబు ఇచ్చారు.

కరుణానిధితో పాటు విజయ్ కాంత్ అభిమాన నాయకుడు మూపనార్, సంగీత విద్వాంసుడు ఇళయరాజా, సత్యరాజ్, ప్రభు, ఎస్.ఎస్.చంద్రశేఖర్, పాండియన్, థియాకు, ఎస్. థాను, రామనారాయణన్, భారతీరాజా, మణివణ్ణన్, ఎస్.బి.ముత్తురామన్, శంకరగణేష్ వంటి సినీ ప్రముఖులు విజయ్ కాంత్, ప్రేమలతల వివాహ వేడుకలో పాల్గొన్నారు. విజయ్ కాంత్ పెళ్లికి వేల సంఖ్యలో అభిమానులు కూడా హాజరయ్యారు. విజయ్ కాంత్ సతీమణి ప్రేమలతా విజయ్ కాంత్ తమిళ, తెలుగు, ఇంగ్లీష్ బాషలు అనర్గలంగా మాట్లాడుతారు. ప్రేమలతా సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు సమీపంలోనే ఉంది.

Hero Vijay Kant, who got married at a late age, was born in Vellore district to Premalatha

తమిళ సినీరంగంలో ఎంజీఆర్ అభిమానిగా, రాజకీయాల్లో కరుణానిధిని ఆదర్శంగా తీసుకున్న విజయ్ కాంత్ ఈ రెండింటినీ కలుపుకుని తన అభిమాన సంఘాలను ఎంజీఆర్ తరహాలో మంచి పనులు చేసేలా తీర్చిదిద్దారు. ఆ తర్వాత అదే తన రాజకీయాలకు పునాదిగా మారింది. ప్రభాకరన్‌పై ఉన్న అభిమానంతో పెద్దకొడుకు విజయ ప్రభాకరన్‌ అని పేరు పెట్టారు. రెండో కొడుకుకి షణ్ముఖ పాండియన్ అని పేరు పెట్టాడు. అయితే కుటుంబ సభ్యులతో పాటు లక్షలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలను వదిలేసిన విజయ్ కాంత్ అనంత లోకాలకు వెళ్లిపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+