జరా సబర్ కరో: బాధను దిగమింగుతూ.. జోకులు వేస్తూ- షిండే ఇక తెరమరుగే?
Devendra Fadnavis: మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిపై 10 రోజుల పాటు కొనసాగిన సస్పెన్స్‌కు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా మాజీ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పేరు ఖరారైంది. కొద్దిసేపటి కిందటే- భారతీయ జనతా పార్టీ శాసన సభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. బీజేఎల్పీ సభ్యులు ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకున్నారు.
ఈ ఉదయం మహారాష్ట్ర శాసన సభ ఆవరణలోని కమిటీ హాలులో సమావేశమైంది బీజేఎల్పీ. పార్టీ కేంద్ర పరిశీలకులు నిర్మల సీతారామన్, విజయ్ రుపాణీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ భేటీకి హాజరయ్యారు. దేవేంద్ర ఫడ్నవిస్, చంద్రశేఖర్ బవాన్‌కులె, ఆశీష్ షెలార్ సహా కొత్తగా ఎన్నికైన 132 మంది శాసన సభ్యులు ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయ్ రుపాణీ- బీజేఎల్పీ నేతగా దేవేంద్ర ఫడ్నవిస్ పేరును ప్రతిపాదించారు. ఆశీష్ షెలార్ దీన్ని బలపరిచారు. ఆ వెంటనే ఫడ్నవిస్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రుపాణీ ప్రకటించారు. దీనితో కమిటీ హాల్ మొత్తం కూడా చప్పట్లతో మార్మోగిపోయింది. నిర్మల సీతారామన్ ఆయనను అభినందించారు.
ఆయన ఎంపికతో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫడ్నవిస్ పేరును ఖరారు చేసినట్టయింది. మహాయుటిలో మిత్రపక్షాలైన శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్ వర్గం) ఇక అనివార్యంగా ఫడ్నవిస్ పేరును సమర్థించాల్సిన పరిస్థితి ఏర్పడినట్టయింది.
దీని తరువాత మధ్యాహ్నం 3:30 గంటలకు మహాయుటి సమావేశమైంది. ఫడ్నవిస్ అభ్యర్థిత్వాన్ని ఈ కూటమి నాయకులు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ వెంటనే ముంబై కొలాబాలోని రాజ్ భవన్‌కు బయలుదేరి వెళ్లారు. ఫడ్నవిస్ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తోన్నట్లు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు లేఖ అందజేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమను ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
అనంతరం ఫడ్నవిస్, షిండే, అజిత్ పవార్ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. మరో అయిదేళ్ల పాటు రాష్ట్ర ప్రజలకు సుస్థిర, సమర్థవంతమైన పరిపాలన అందిస్తామని అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని, దీనికోసం జాయింట్ యాక్షన్ ప్లాన్‌ను రూపొందిస్తామని చెప్పారు.
ఈ విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే హుషారుగా కనిపించారు. ఏకంగా అజిత్ పవార్‌పై జోకులు పేల్చారు. చప్పట్లు కొడుతూ గట్టిగా నవ్వారు. ఆయన వేసిన జోకులకు ఫడ్నవిస్, అజిత్ పవార్ సహా అక్కడున్న వాళ్లంతా గట్టిగా నవ్వడం కనిపించింది.
గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా? అంటూ ఏక్‌నాథ్ షిండేను ఉద్దేశించి ఓ విలేకరి ప్రశ్నించారు. దీనికి ఆయన బదులిస్తూ అప్పుడే అంత తొందర ఎందుకని, సాయంత్రం వరకూ వేచి చూడాలని అన్నారు. మంత్రివర్గంలో తనకు బెర్త్ లభిస్తుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పననీ సమాధానం ఇచ్చారు.
VIDEO | Maharashtra: NCP Chief Ajit Pawar takes a jibe at Shiv Sena chief Eknath Shinde, when Eknath Shinde responded to a media query on whether he is taking oath as Deputy CM, by saying that he (Ajit Pawar) will be taking oath, and Eknath Shinde may take time and decide by the… pic.twitter.com/cTgl32l0mG
— Press Trust of India (@PTI_News) December 4, 2024
ఆ సమయంలో అజిత్ పవార్ జోక్యం చేసుకున్నారు. షిండే ఏం చేస్తారో లేదో తెలియదు గానీ.. గురువారం సాయంత్రం తాను మాత్రం ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాననీ కరాఖండిగా తేల్చి చెప్పారు. అజిత్ పవార్ వేసిన సెటైర్‌కు షిండే రియాక్ట్ అయ్యారు. అజిత్ దాదాకు పొద్దున చేసిన అనుభవం ఉంది.. సాయంత్రం చేసిన అనుభవమూ ఉందని చెప్పడంతో అందరూ గట్టిగా నవ్వారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications