Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జవాన్ సినిమా బ్యాన్ చెయ్యండి, సనాతనా, ఉదయానిధి ఎఫెక్ట్ తో సినిమా, గోవిందా గోవిందా !

చెన్నై/ముంబాయి: షారుఖ్ ఖాన్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం జవాన్ గురువారం అంటే సెప్టెంబర్ 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. జవాన్ సినిమా విడుదలకు మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది. షారుఖ్ ఖాన్ అభిమానులు, సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని జవాన్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

జవాన్ సినిమా విడుదలకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని షారూఖ్ రెండు రోజుల క్రితం తిరుమల వెళ్లి పంచె, తెల్ల షర్టు వేసుకుని హిందూ సాంప్రధాయ పద్దతిలో శ్రీవారిని దర్శనం చేసుకుని స్వామి వారి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. పఠాన్ విడుదల సమయంలో ఓ పాట ద్వారా చెలరేగిన స్పార్క్ కారణంగా చాలా మంది సినిమాను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

Hindu groups campaigning to ban Shahrukh Khans film Jawan, Udayanidhi Stalin is the TN distributor

ఆ దెబ్బతో షారుఖ్ ఖాన్, ఆ సినిమా బృందం బహిష్కరణ ధోరణిని ఎదుర్కొని నానా ఇబ్బందులను అనుభవించింది. అయితే జవాన్ సినిమా విషయంలో ఆ సినిమాను సాఫీగా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో షారూఖ్ ఖాన్ తిరుమలకు పంచె, ధోతి కట్టుకుని వెళ్లాడని కూడా అందరూ చెప్పుకున్నారు. అయితే జవాన్ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ ప్రారంభం కాగానే బహిష్కరణ ప్రచారం మొదలైంది.

మొత్తానికి జవాన్ కోసం ఎదురు చూస్తున్న సినీ అభిమానులకు ఒక్కసారిగా ఏం జరిగిందనేది ఆసక్తిగా మారింది. దీనికి కారణం సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, సినీ నిర్మాత ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రకటన కారణం అని వెలుగు చూసింది. గత కొన్ని రోజులుగా తమిళనాడు మంత్రి ఉదయానిధి స్టాలిన్ చేస్తున్న ప్రకటనలు సర్వత్రా సంచలనం సృష్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

Hindu groups campaigning to ban Shahrukh Khans film Jawan, Udayanidhi Stalin is the TN distributor

ఇటీవల చెన్నైలో మాట్లాడిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కరోనా వైరస్, మలేరియా, డెంగీ వ్యాధులతో పోల్చారు. నాతన ధర్మాన్ని రూపుమాపాలి అంటూ తమిళనాడు మంత్రి ఉదయానిధి స్టాలిన్ మండిపడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చినా తన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని తమిళనాడు మంత్రి ఉదయానిధి స్టాలిన్ చెబుతున్నారు.

ఇప్పుడు తమిళనాడు మంత్రి ఉదయానిధి స్టాలిన్ కు, షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాకు ఏమిటి సంబంధం అని చర్చ మొదలైయ్యింది. సనాతనా గురించి చెడుగా మాట్లాడిన ఉదయానిధి స్టాలిన్ కు షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాకు సంబంధం ఉందని వెలుగు చూడటంతో అందరూ షాక్ అయ్యారు.

తమిళనాడు మంత్రి ఉదయానిధి స్టాలిన్ చేసిన ఈ ప్రకటన షారుక్ ఖాన్ నటించిన జవాన్‌పై చాలా ప్రభావం చూపింది. అవును మొత్తానికి ఉదయనిధి స్టాలిన్ ప్రకటనకు జవాన్ సినిమాకి సంబంధం ఏంటంటే.. జవాన్ సినిమా హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లో కూడా ఒకేసారి, ఒకే రోజు దేశవ్యాప్తంగా విడుదల అవుతోంది.

Hindu groups campaigning to ban Shahrukh Khans film Jawan, Udayanidhi Stalin is the TN distributor

ఈ సినిమా తమిళనాడు పంపిణీ హక్కులను ఇప్పటికే తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆయన సొంతం చేసుకున్నారు. రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా జవాన్ తమిళ వెర్షన్ తమిళనాడుత పాటు బెంగళూరులో పంపిణీ చేస్తున్నారు. సినిమా విడుదల కాకముందే సనాతన ధర్మం గురించి ప్రకటన చేసిన తమిళనాడు మంత్రి ఉదయానిధి స్టాలిన్ మీద బీజేపీ నాయకులు, హిందూ సంఘాలు నిప్పులు చెరిగారు.

ఉదయానిధి స్టాలిన్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటూ బహిష్కరణ ట్రెండ్ మొదలైంది. జవాన్ సినిమాని ఎవరూ చూడకూడదని, సనాతన ధర్ములకు నిజమైన ఆత్మగౌరవం ఉంటే ఈ సినిమా చూడకూడదని ప్రచారం మొదలైంది.

మరోవైపు కుటుంబ సమేతంగా తిరుపతికి వెళ్లడాన్ని షారుఖ్ తట్టుకోలేక ఈ రకంగా హంగామా చేశాడని, అందుకే ఇలా తెరలేపారని కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. గతంలో తీవ్ర నిరసనల తర్వాత కూడా పఠాన్ సినిమా విజయం సాధించినా ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలిన మాట కూడా నిజం. మరి ఈ బహిష్కరణ ధోరణి జవాన్ సినిమాపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో కొన్ని రోజులు వేచి చూడాలి అంటున్నారు సినీ ప్రముఖులు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+