ముస్లీం బ్రదర్స్ తో లవ్, బావిలో శవాలు అయిన హిందూ అక్కాచెల్లెలు, ఏం జరిగింది?
చెన్నై/తిరుచ్చి: ఇద్దరు అక్కాచెల్లెళ్లు తాము ప్రేమించిన అబ్బాయిలను తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఇద్దరు హిందూ సోదరీమణులు ఇద్దరు ముస్లిం సోదరులతో ప్రేమలో ఉన్నారని, అమ్మాయిల తల్లిదండ్రులు వీరి ప్రేమను వ్యతిరేకిస్తున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలోని మరుంగాపురి తాలూకాలోని అయనపుదుపట్టి గ్రామానికి చెందిన విద్యా (21), గాయత్రీ (23) మృతదేహాలు తమిళనాడులోని తిరుచిరాపల్లి (తిరుచ్చి) జిల్లాలోని వలనాడు గ్రామంలోని బావిలో తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ అక్కాచెల్లెలు తిరుప్పూర్ జిల్లాలోని కాంగేయం వద్ద ఒక టెక్స్‌టైల్ మిల్లులో ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడ గాయిత్రీ, విద్యాలకు వారి సహోద్యోగులుగా పని చేస్తున్న ఇద్దరు ముస్లీం సోదరులు పరిచయం అయ్యారు.

హిందువులు అయిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు, ఇద్దరు ముస్లీం సోదరులు గాఢంగా ప్రేమించుకున్నారని తెలిసింది. దీన్ని సోదరి తల్లిదండ్రులు, దినసరి కూలీ అయిన తండ్రి పిచాయ్, తల్లి అఖిలాండేశ్వరికి చెప్పారు. అయితే ముస్లీం మతానికి చెందిన యువకులను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిల కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు.
అనంతరం తమ గ్రామంలోని ఆలయ ఉత్సవానికి హాజరయ్యేందుకు అక్కాచెల్లెళ్లిద్దరూ ఆదివారం సొంత గ్రామంలోని ఇంటికి వెళ్లారు. తమ కుమార్తెలు చాలాసేపు ఫోన్ కాల్స్‌లో నిమగ్నమై ఉండడాన్ని ఆమె తల్లిదండ్రులు గమనించారు. తరువాత కూతుర్లు ఇప్పటికీ ప్రేమలో ఉన్నారని తల్లిదండ్రులు వారిని ప్రశ్నించినప్పుడు గాయిత్రీ, విద్యా అవును మేము ప్రేమలో ఉన్నామని వారి తల్లిదండ్రులకు చెప్పారు.

మీరు ప్రేమిస్తున్న ముస్లిం సోదరులను మీరు పెళ్లి చేసుకుంటే మేము ఆత్మహత్య చేసుకుంటామని తల్లిదండ్రులు గాయిత్రీ, విద్యాను బెదిరించారు. తాము పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారనే భయంతో గాయిత్రీ, విద్యా కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని తువరంకురిచ్చి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. పశువుల కాపరులు ఇంటి సమీపంలోని బావిలో రెండు మొబైల్ ఫోన్లను గుర్తించగా, మృతదేహం నీటిలో తేలియాడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications