లవ్ జీహాద్, 10 మంది ముస్లీం అమ్మాయిలకు వల వేస్తే అప్పుడు తెలుస్తోంది, తరువాత ? శ్రీరామ సేన్ చీఫ్ !
ఒక్క ముస్లీం యువకుడు ఓ హిందూ యువతిని పెళ్లి చేసుకుంటే ఓ హిందూ యువకుడు పది మంది ముస్లీం అమ్మాయిలను వలలో వేసుకుని వారిని పెళ్లి చేసుకోవడానికి సిద్దం కావాలని పిలుపునివ్వడం హాట్ టాపిక్ అయ్యింది.
బెంగళూరు/బాగల్ కోటే: లవ్ జీహాద్ దెబ్బతో భారతదేశంలో హిందూ సంఘాలు ముస్లీం యువకుల మీద మండిపడుతున్నాయి. ఇదే సమయంలో ముస్లీం యువకులను వివాహం చేసుకున్న హిందూ యువతులు ఆత్మహత్యలు చేసుకోవడం, హత్యలకు గురికావడం జరుగుతున్నాయి. లవ్ జీహాద్ ను మనం ఎదుర్కోవాలంటే ఒకటికి పది రెట్లు మనం ముందు ఉండాలని శ్రీరామసేన చీఫ్ పిలుపునిచ్చారు. లవ్ జీహాద్ పేరుతో ఒక్క ముస్లీం యువకుడు ఓ హిందూ యువతిని పెళ్లి చేసుకుంటే ఓ హిందూ యువకుడు పది మంది ముస్లీం అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి సిద్దం కావాలని, ఆ ప్రయత్నాలు చెయ్యాలని పిలుపునివ్వడం హాట్ టాపిక్ అయ్యింది.

శ్రీరామసేన చీఫ్
ప్రమోద్ ముతాలిక్, ఈ పేరు కొత్తగా పరిచయం చెయ్యనవసరం లేదు. శ్రీరామసేన వ్యవస్థాపకుడు అయిన ప్రమోద్ ముతాలిక్ హిందూ యువకులను ఆకర్షించి ప్రసంగాలు చెయ్యడంలో దిట్ట. అంతే కాదు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి యువతను రెచ్చగొడుతున్నాడని ప్రమోద్ ముతాలిక్ మీద అనేక మంది విమర్శలు చేస్తున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా ప్రమోద్ మతాలిక్ మాత్రం హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని కాపాడుకోవాలని హిందువులకు పిలుపునిస్తున్నారు.

దేశంలో ఏం జరుగుతోంది ?
లవ్ జీహాద్ పేరుతో హిందూ అమ్మాయిలను ముస్లీం అబ్బాయిలు వలలో వేసుకుని వారి జీవితాలను నాశనం చేస్తున్నారని శ్రీరామసేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ ఆరోపించారు. దేశంలో ఏదోఒక చోట ముస్లీం యువకులు హిందూ అమ్మాయిలను ప్రేమించినట్లు నటించి వారిని పెళ్లి చేసుకుని వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ప్రమోద్ ముతాలిక్ ఆరోపించారు. కర్ణాటకలోని బాగల్ కోటేలో శ్రీరామసేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వాడు దేనికి పెళ్లి చేసుకుంటాడు అంటే ?
ఓ ముస్లీం యువకుడు లవ్ జీహాద్ ముసుగులో ఓ హిందూ అమ్మాయికి వల వేస్తాడు. నిన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా చూసుకుంటానని హిందూ అమ్మాయికి మాయమాటలు చెప్పి ముగ్గులోకి దింపుతాడు. పెళ్లి చేసుకున్న తరువాత హిందూ అమ్మాయికి మతం మార్చి ఇస్లాం మతం స్వీకరించాలని ఆమెకు నరకం చూపిస్తాడని, దీనినే లవ్ జీహాద్ అంటారని ప్రమోద్ ముతాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మీరు పది మందిని వలలో వేసుకోండి
లవ్ జీహాద్ పేరుతో ఓ ముస్లీం యువకుడు మన హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన మతంలో ఓ సంఖ్య తగ్గిపోతందని ప్రమోద్ ముతాలిక్ అన్నారు. ఓ ముస్లీం ఓ హిందూ యువతిని పెళ్లి చేసుకుని లవ్ జీహాద్ అంటూ మురిసిపోతే మనం చేతులు కట్టుకుని కూర్చోకూడదని, ఓ హిందూ అబ్బాయి 10 మంది ముస్లీం యువతులను ఆకర్షించి వారిని పెళ్లి చేసుకోవడానికి సిద్దంగా ఉండాలని, అలాంటి ప్రయత్నాలు చెయ్యాలని శ్రీరామసేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

టార్టెట్ ముస్లీం అమ్మాయిలు
మీరు ముస్లీం అమ్మాయిలను ముగ్గులోకి దింపి వారిని పెళ్లి చేసుకోండి, ఇలా చేసిన హిందూ అబ్బాయిలకు శ్రీరామసేన రక్షణగా ఉంటుందని, మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం మా భాధ్యత అని శ్రీరామసేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో బీజేపీ పక్కా హిందూ పక్షపాతి కాదని, రెండు ముఖాలతో బీజేపీ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని, మన శ్రీరామసేన నిజమైన హిందుత్వ సంఘం అంటూ ప్రమోద్ ముతాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
-
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..! -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
ఎవరికీ తెలియని అందమైన అడవి.. హైదరాబాద్ కు 40 కి. మీ. దూరంలోనే.. -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది












Click it and Unblock the Notifications