వైరల్ వీడియో: RCB ఫ్యాన్స్ కంటే ఘోరంగా ఉన్నారేంట్రా బాబు..

ప్రముఖ తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 33 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉండటం కలచివేస్తోంది. తమిళనాడులోని కరూర్ లో నిర్వహించిన ర్యాలీకి భారీగా అభిమానులు, కార్యకర్తలు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. క్షతగాత్రులను కరూర్‌ లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ర్యాలీకి ఒక్కసారిగా లక్షలాది మంది తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది.

ఈ ఘటనపై ఇప్పటికే ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు ఫ్రీగా మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై రేపు ఉదయం వరకు ప్రాథమిక రిపోర్టు అందించాలని సీఎం స్టాలిన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. కరూర్ తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున సాయం చేస్తామని సీఎం స్టాలిన్ వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ. 1 లక్ష పరిహారం అందించనున్నట్లు తెలిపారు. అలాగే రేపు కరూర్ వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు.

అయితే ఈ ఏడాది జూన్ లో బెంగళూరులో కూడా భారీతొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. అయితే అప్పుడు కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ రూల్స్ ను పాటించలేదని వ్యక్తం అయింది. అయితే ఇప్పుడు కూడా ఇలాంటి పరిణామమే ఎదురైనట్లు తమిళ న్యూస్ ఛానెళ్లు చెబుతున్నాయి. విజయ్ అభిమానులు, కార్యకర్తలు రూల్స్ ను పాటించలేదని చెబుతున్నాయి. అభిమానులు ర్యాలీలో విపరీతంగా ప్రవర్తిస్తున్నారని ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని గతంలోనూ చాలా కంప్లైంట్స్ వచ్చినట్లు సమాచారం.

విజయ్ ఫ్యాన్స్ చెట్లు ఎక్కడం, టవర్స్ ఎక్కడం, కిలోమీటర్ల కొద్దీ ర్యాలీలుగా బయల్దేరడం, గోడలు ఎక్కడం, ఇలా విజయ్ ను చూసేందుకు లక్షలాది మందిగా తరలివస్తున్నట్లు సమాచారం అందుతోంది. విజయ్ శనివారాల్లో ఇప్పటి వరకు నిర్వహించిన ర్యాలీల్లో ప్రతిసారీ ఫ్యాన్స్, కార్యకర్తలు భారీగానే వస్తున్నట్లు తెలుస్తోంది. శని ఆదివారాల్లో చాలా స్కూళ్లు, కాలేజీలు సెలవు కారణంగా విద్యార్థులు, యూత్ విజయ్ ను చూసేందుకు అధిక సంఖ్యలో వస్తున్నట్లు సమాచారం. పొద్దట్నుంచి ఏమీ తినకుండా విజయ్ కోసం ఎదురు చూస్తున్నట్లు ర్యాలీలో కొందరు ఫ్యాన్స్ చెప్పడం గమనార్హం. గతంలో ఆర్సీబీ ఫ్యాన్స్ చేసినట్లుగానే వీళ్లు కూడా క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించినట్లు అందుకే తొక్కిసలాట జరిగినట్లు తమిళ మీడియా చెబుతోంది.

History Repeats in Red Karur Rally Stampede Mirrors RCB s Deadly Overcrowding Blunder

మరోవైపు కరూర్ మీటింగ్ కు పోలీసులు 10 వేల మందికే పర్మిషన్ ఇచ్చారు. కానీ అక్కడికి 2 లక్షల మంది వచ్చారు. అంతమందికి సరపడా స్థలం లేక తొక్కిసలాట జరిగినట్లు అక్కడి మీడియా ఛానళ్లు చెబుతున్నాయి. అలాగే విజయ్ రావాల్సిన సమయం కంటే 5-6 గంటలు ఆలస్యంగా వచ్చినట్లు సమాచారం. ఎటువంటి నియంత్రణ లేకుండా ఒక చిన్న స్థలంలో వేలాది మంది గుమిగూడటమే తొక్కిసలాటకు దారి తీసిందని తమిళ మీడియా పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+