షాక్ : భారత హాకీ ప్లేయర్‌పై చీటింగ్ కేసు..
భారత హాకీ జట్టు ప్లేయర్, అర్జున అవార్డు గ్రహీత వరుణ్ కుమార్‌పై చీటింగ్ కేసు నమోదైంది. వివాహం చేసుకుంటానని తనను నమ్మించి మోసం చేశాడంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ యువ క్రీడాకారిణి వరుణ్ కుమార్‌పై కేసు పెట్టింది. భారత హాకీ జట్టు ఆటగాడు వరుణ్‌కుమార్‌పై తాజాగా కర్ణాటక బెంగళూరులోని జ్ఞానభారతి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
వరుణ్‌కుమార్ హిమాచల్‌ప్రదేశ్‌కు చెందినవాడు. ప్రస్తుతం అతను భారత హాకీ జట్టులో డిఫెండర్‌గా కొనసాగుతున్నాడు. వరుణ్‌కుమార్ 2017లో ఇండియన్ టీమ్‌లోకి వచ్చాడు. 2022లో జరిగిన బర్మింగ్హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో వరుణ్‌కుమార్ రజతం గెలిచాడు. 2020లో టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం, అనంతరం 2022 ఆసియా గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి జట్టులో నిలిచాడు. క్రీడా రంగంలో ఇతను చేసిన సేవలగాను 2021లో ఇతనిని కేంద్రప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. తాజాగా ఈ ఆటగాడిపై హైదరాబాద్‌కు చెందిన ఓ యువ క్రీడాకారిణి కేసు పెట్టడం జరిగింది.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు : ఈ క్రీడాకారిణి 2016-17 సమయంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సౌత్ డివిజన్ ఇచ్చే శిక్షణకు ఎంపిక అయ్యింది. అదే సమయంలో వరుణ్‌కుమార్ తనకు సోషల్‌మీడియాలో పరిచయం అయ్యాడు. వారి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా చిగురించింది. ఈ క్రమంలో 2019లో డిన్నర్‌కని తీసుకెళ్లి ఆమెపై లైంగికంగా సంబంధం పెట్టుకున్నాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో ఐదేళ్లపాటు సంబంధాన్ని కొనసాగించాడని పోలీసులకు వివరించింది. గత సంవత్సరం నుంచి తను తప్పించుకుని తిరుగుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications