మహిళలకు ప్రతి నెలా రూ.2,100 - రెండు ఫ్రీ సిలిండర్లు ..!!

జార్ఖండ్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. రెండు కూటములు హోరా హోరీ గా ఎన్నికల్లో పోరాటం చేస్తున్నాయి. అధికారంలో ఉన్న జేఎంఎం నాయకత్వంలోని కూటమి తమ ఎన్నికల హామీలను ప్రకటించింది. ఇదే సమయంలో గతం కంటే భిన్నంగా ఆకర్షణీయ హామీలతో బీజేపీ తమ సంకల్ప పత్రాన్ని ప్రజల ముందుకు తెచ్చింది. మహిళా ఓటర్లను ఆకట్టుకోవటమే లక్ష్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ మేనిఫెస్టోను ప్రకటించారు.

బీజేపీ మేనిఫెస్టో
జార్ఖండ్ ఎన్నికల కోసం బీజేపీ పలు హామీలు గుప్పించింది. మహిళల కోసం తమ మేనిఫెస్టోలో ప్రత్యేకంగా పథకాలను ప్రకటించింది. గోగో దీదీ పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ.2,100 ఆర్థిక భరోసా ఇస్తామని తెలిపింది. దీపావళి, రక్షాబంధన్‌ కానుకగా ఏడాదికి ఉచితంగా రెండు ఎల్​పీజీ గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని చెప్పింది. రూ.500కే గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని పార్టీ మేనిఫెస్టో లో స్పష్టం చేసింది. యువత కోసం బీజేపీ ఉపాధి కల్పన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావన చేసింది. తాము అధికారంలోకి వస్తే 2.87 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా 5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని మరో కీలక హామీ ఇచ్చింది.

Home minister Amit Shah releases BJP s manifesto for Jharkhand featuring key promises

కీలక హామీలు
మేనిఫెస్టో విడుదల సమయంలో అమిత్ షా రాష్ట్ర ప్రజలకు పలు హామీలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం పైన పలు ఆరోపణలు చేసారు. పోటీ పరీక్షల పేపర్ల లీకేజీకి జార్ఖండ్ కేంద్రంగా మార్చారని..తాము అధికారంలోకి వస్తే పేపర్ లీకేజీల పైన విచారణ చేస్తామని ప్రకటించారు. పరిశ్రమలు, గనుల కారణంగా నిర్వాసితులైన ప్రజలకు పునరావాసం కోసం ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సర్నా మతపరమైన కోడ్ అంశంపై చర్చించి, తగిన నిర్ణయం తీసుకుంటామని అమిత్ షా వెల్లడించారు. హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వ హయాంలో గిరిజనులకు భద్రత లేదని విమర్శించారు.

Home minister Amit Shah releases BJP s manifesto for Jharkhand featuring key promises

చొరబాటు దారులను తరిమేస్తాం
రాష్ట్రంలో చొరబాటు దారులు అక్రమంగా వచ్చి ఆడబిడ్డలను ప్రలోభపెట్టి పెళ్లి చేసుకుంటు న్నారంటూ ఆరోపణలు చేసారు. జార్కండ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు కేవలం ప్రభుత్వాన్ని మార్చేవే కావని... రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఎన్నికలుగా అమిత్ షా పేర్కొన్నారు. చొరబాటుదారులు, అవినీతిని ప్రోత్సహించే ప్రభుత్వం కావాలా.. అదే సమయంలో అభివృద్ధి, సరిహద్దులను కాపాడే మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కావాలా ప్రజలు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. చొరబాటుదారులను తరిమికొడతామని అమిత్ షా స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+