హనీట్రాప్, దుబాయ్ రిటన్, కాలేజ్ అమ్మాయితో వల, రాసలీలలు టీవీలో చూపిస్తాం !

బెంగళూరు: మధ్యప్రదేశ్ లో హైటెక్ హనీట్రాప్ ముఠా అరెస్టు అయిన విషయం మరువక ముందే కర్ణాటకలో మరో హనీట్రాప్ ముఠా అరెస్టు అయ్యింది. దుబాయ్ నుంచి వచ్చి చేతినిండా డబ్బులు ఉన్న వ్యక్తికి కాలేజ్ అమ్మాయిని ఎరగా వేసి రూ. 50 లక్షలు లూటీ చెయ్యడానికి ప్రయత్నించిన ముఠాను మడికేరి పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే రాసలీలల వీడియో టీవీలో చపిస్తామని నిందితులు బ్లాక్ మెయిల్ చేశారు.

 హనీట్రాప్ కింగ్ పిన్

హనీట్రాప్ కింగ్ పిన్

హనీట్రాప్ ప్రముఖ నిందితుడు (కింగ్ పిన్) కరీంలాల్, రియల్ ఎస్టేట్ వ్యాపారి అహమ్మద్ అజారుద్దీన్ (24), కతార్ లో కారు డ్రైవర్ గా పనిచేస్తున్న అబూబక్కర్ సిద్దికీ (33), హైసనార్ (27), ఇర్షాద్ ఆలీ (27), ఎఎ. సమీర్ (26) అనే నిందితులతో పాటు కాలేజ్ అమ్మాయిని అరెస్టు చేశామని పోలీసులు అన్నారు.

కాలేజ్ అమ్మాయి

కాలేజ్ అమ్మాయి

కుశాలనగర్ లోని కొడుగు భువనగిరిలో నివాసం ఉంటున్న యువతి (21) మడికేరి మహిళా కాలేజ్ లో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నది. కాలేజ్ అమ్మాయితో పరిచయం ఉన్న నిందితులు ఆమెకు మామమాటలు చెప్పి, నగదు ఆశ చూపి హనీట్యాప్ ఉచ్చులోకి దింపారు. యువతిని అడ్డం పెట్టుకుని అక్రమ మార్గంలో నగదు సంపాధించాలని వీరు ప్లాన్ వేశారు.

దుబాయ్ రిటన్

దుబాయ్ రిటన్

ఎమ్మమాడు ప్రాంతానికి చెందిన గఫూర్ అనే వ్యక్తి ఉద్యోగం చేసి ఇటీవల సొంత ఊరికి వచ్చి కొత్తగా ఇంటిని నిర్మిస్తున్నాడు. గఫూర్ దగ్గర భారీ మొత్తంలో నగదు ఉన్న విషయం నిందితులకు తెలుసు. ఇంటి నిర్మాణ పరికరాలు తక్కువ ధరకు ఇప్పిస్తామని నమ్మించిన నిందితులు గఫూర్ ను మైసూరు పిలుచుకుని వెళ్లారు.

హోం స్టేలో రాసలీలలు

హోం స్టేలో రాసలీలలు

మైసూరుకు వెలుతున్న సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి అహమ్మద్ అజారుద్దీన్, కరీం కలిసి మార్గం మధ్యలోనే కాలేజ్ అమ్మాయిని కారులో కుర్చుపెట్టుకున్నారు. తరువాత కాలేజ్ అమ్మాయి, గఫూర్ ను హోం స్టే దగ్గరకు తీసుకెళ్లారు. హోం స్టేల్ లో కాలేజ్ అమ్మాయి గఫూర్ తో రోమాన్స్ చెయ్యడం మొదలుపెట్టంది. అదే సమయంలో ఆ రాసలీలల దృశ్యాలను నిందితులు వీడియోలు తీశారు

టీవీలో చూపిస్తాం

టీవీలో చూపిస్తాం

గఫూర్, కాలేజ్ అమ్మాయి రోమాన్స్ చేస్తున్న వీడియోలతో నిందితులు బ్లాక్ మెయిల్ చేశారు. తాము మీడియా నుంచి వచ్చామని, రూ. 50 లక్షలు ఇవ్వకపోతే టీవీలో ఈ క్లిప్పింగ్స్ ప్రసారం చేస్తామని నిందితులు గఫూర్ ను బ్లాక్ మెయిల్ చేశారు. గఫూర్ ను బెదిరించి అక్కడే అతని దగ్గర ఉన్న రూ. 60 వేలు, రూ. 55 వేల విదేశీ కరెన్సీ లాక్కొన్నారు. 66.

వీడియోలతో బ్లాక్ మెయిల్

వీడియోలతో బ్లాక్ మెయిల్

ఊరికి వచ్చిన తరువాత గఫూర్ ను బెదిరించి రూ. 3.80 లక్షలు తీసుకున్నారు. మిగిలిన రూ. 46 లక్షలు ఇవ్వాలని వేధింపులకు గురి చెయ్యడంతో గఫూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కాలేజ్ అమ్మాయితో పాటు నిందితులు అదర్నీ అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+