గుర్మీత్ వీడియోలున్నాయి: తండ్రితో సంబంధంపై ఏడ్చిన హనీప్రీత్, ఎట్టకేలకు అరెస్ట్
డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. డేరా బాబాకు శిక్ష ఖరారు చేసినప్పటి నుంచి ఆమె అదృశ్యమయ్యారు.
Recommended Video

న్యూఢిల్లీ: డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. డేరా బాబాకు శిక్ష ఖరారు చేసినప్పటి నుంచి ఆమె అదృశ్యమయ్యారు. 38 రోజుల తర్వాత ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జైలుకు వెళ్లిన తొలి నాళ్లలో డేరా బాబా హనీప్రీత్‌ను కలవరించాడు. ఇప్పుడు గుర్మీత్‌కు ఎంతో ఇష్టమైన ఆమెను పంజాబ్ పోలీసులు పంచకుల పోలీసులకు (హర్యానా) అప్పగించారు.

పోలీసులకు లొంగిపోతాను
అంతకుముందు, గుర్మీత్-తనకు మధ్య అక్రమ సంబంధం ఉందంటూ వచ్చిన వార్తల పైన కూడా హనీప్రీత్ స్బందించింది. ఓ తండ్రి తన కూతురును ప్రేమతో ముట్టు కోకూడదా, మా ఇద్దరి విషయంలో తప్పుడు వార్తలు సృష్టించారని ఆవేదన వ్యక్తం చేసింది. నేను పోలీసులకు లొంగిపోతానని చెప్పింది.

లుకౌట్ నోటీసులపై ఆశ్చర్యం
తనపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయని తెలిసి షాకయ్యానని హనీప్రీత్ చెప్పింది. తన మీద కేసు ఉందని వస్తున్న వార్తలు అబద్ధాలని చెప్పింది. గుర్మీత్‌ని కోర్టుకు తీసుకెళ్లినప్పుడు నేనూ అతనితో వెళ్లానని మా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు రాశారని, తండ్రిని కోర్టుకి తీసుకెళుతుంటే కూతురు వెళ్లడంలో తప్పేమిటని ప్రశ్నించింది.

గుర్మీత్ వీడియోలు ఉన్నాయి
తనకు జడ్జి అనుమతిచ్చారు కాబట్టి వెళ్లానని, ఇందులో నేను చేసిన తప్పేమిటని ప్రశ్నించింది. ఇప్పటి వరకు గుర్మీత్‌కి సంబంధించిన అన్ని వీడియో క్లిప్పింగ్‌లు ఉన్నాయని హనీప్రీత్ స్పష్టం చేసింది. అందులో ఏం జరిగిందో క్లారిటీగా ఉందని చెప్పింది.

నా తండ్రితో సంబంధమా
తన తండ్రితో సంబంధం ఉందని తప్పుడు వార్తలు సృష్టిస్తే వారికి ఏం వస్తుందని హనీప్రీత్ ప్రశ్నించింది. ఓ పవిత్రమైన బంధాన్ని తప్పుగా చూపించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించింది. నా తండ్రి అరెస్ట్ తర్వాత తాను ఇంట్లోనే ఉన్నానని, పారిపోలేదని చెప్పింది.

వాళ్ల క్యారెక్టర్ తెలుసుకోండి
గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడిందన్న విషయమై బాధపడుతున్నామని హనీప్రీత్ చెప్పింది. తమకు దేశంపై ప్రేమ ఉందని, తన తండ్రి గుర్మీత్ మీద ఆరోపణలు చేస్తున్న వారెవరో తనకు చెప్పాలని, ముందు వాళ్ల క్యారెక్టర్ ఏమిటో తెలుసుకోమనమని చెప్పింది. వారు చెప్పింది నమ్ముతారు కానీ ఆరు కోట్ల మంది జనం చెప్పేది మాత్రం నమ్మరా? అని నిలదీసింది. గుర్మీత్ ఆడపిల్లల్లో ఎంతో ధైర్యం నింపారని చెప్పింది. సుప్రీం కోర్టు దాకా వెళ్తామని చెప్పింది.

సినిమాల్లో నటనపై
తన తండ్రి చేసిన సినిమాల్లో నటించానని హనీప్రీత్ చెప్పింది. నిజానికి తనకు సినిమాల్లోకి రావాలన్న ఆలోచనే లేదని, తనకు దర్శకురాలు కావాలని ఉండేదని, కానీ గుర్మీత్ తొలి సినిమా తీస్తున్నప్పుడు జరిగిన ఆడిషన్‌లో ఎంపికయ్యానని, సినిమాలోని పాత్రకి నేను సరిపోతాననిపించి ఆయన నన్ను ఎంపిక చేసుకున్నారని చెప్పింది.

డేరాకు వారసులు లేరంటూ హనీప్రీత్ కంటతడి
డేరాకి వారసులంటూ ఎవరూ లేరని హనీప్రీత్ చెప్పింది. గుర్మీతే ఎప్పటికైనా అధినేతగా ఉంటారని చెప్పింది. ఓ అమ్మాయి తన తండ్రి విషయంలో ఇలా చేస్తుందా అని అక్రమ సంబంధాన్ని ఉద్దేశించి హనీప్రీత్ ఆవేదన వ్యక్తం చేసింది. తండ్రీకూతుళ్ల బంధం ఇంత నీచంగా ఉంటుందా? దేశంకోసం ఎంతో ఆరాటపడే వ్యక్తి ఇలాంటి నీచమైన పనులకు పాల్పడ్డాడు అంటే మీరు నమ్ముతారా? కాస్త ఆలోచించాలని హనీప్రీత్ ఏడ్చేసింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications