Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాస్ తో రోమాన్స్, మొబైల్ లో రికార్డు, ప్రియుడితో కలిసి, రూ. 50 లక్షలు స్వాహా, మళ్లీ!

ఉద్యోగం చేస్తున్న సందర్బంలో తన బాస్ తో చనువుగా ఉంటున్న సమయంలో ఆ దృశ్యాలను మొబైల్ లో రికార్డు చేసి తరువాత అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్న యువతి.

చెన్నై: ఉద్యోగం చేస్తున్న సందర్బంలో తన బాస్ తో చనువుగా ఉంటున్న సమయంలో ఆ దృశ్యాలను మొబైల్ లో రికార్డు చేసి తరువాత అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్న యువతి, ఆమె ప్రియుడిని చెన్నై నగర పోలీసులు అరెస్టు చేశారు.

మాజీ బాస్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్న తమిళనాడులోని కోలత్తూరు ప్రాంతానికి చెందిన సుకన్య అలియాస్ సుగన్య (25), ఆమె ప్రియుడు ప్రవీణ్ కుమార్ (40) అనే ఇద్దరిని అరెస్టు చేశామని గురువారం చెన్నై నగర డిప్యూటీ పోలీసు కమిషనర్ రాజేంద్రన్ తెలిపారు.

చెన్నైలో పేరు మోసిన వ్యాపారి !

చెన్నైలో పేరు మోసిన వ్యాపారి !

చెన్నై నగరంలోని మాదవరంలో నివాసం ఉంటున్న విజయరాజన్ (45) వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి అనేక వ్యాపారాలు ఉన్నాయి. కోలత్తూరుకు చెందిన సుకన్య విజయరాజన్ దగ్గర ఉద్యోగంలో చేరింది. విజయరాజన్ దగ్గర సుకన్య చాల నమ్మకంతో ఉండేది.

హనీట్రాప్ లో పడేసిన సుకన్య !

హనీట్రాప్ లో పడేసిన సుకన్య !

వ్యాపారం విషయంలో విజరాజన్ కు పూర్తిగా సహకరిస్తూ ఆయన దగ్గర నమ్మకంగా ఉన్న సుకన్య అతని వ్యాపారలావాదేవీలు పూర్తిగా తెలుసుకునింది. చివరికి విజయరాజన్ ఒంటరిగా ఉన్న సమయంలో అతన్ని తన అందంతో రెచ్చగొట్టింది. అతన్ని తన తగ్గరకు తీసుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసింది.

నిగ్రహం కోల్పోయిన బాస్ !

నిగ్రహం కోల్పోయిన బాస్ !

సుకన్య తన అందంతో రెచ్చగొట్టడంతో ఆమె బాస్ విజయరాజన్ నిగ్రహం కోల్పోయాడు. ఆమెకు దాసోహం అన్నాడు. ఇద్దరూ సన్నిహితంగా, శారీరకంగా దగ్గర అయ్యారు. గత మూడు సంవత్సరాల నుంచి ఇద్దరి మద్య ఈ రాసలీలల తతంగం జరుగుతోంది.

మెదడుకు పదును పెట్టిన సుకన్య !

మెదడుకు పదును పెట్టిన సుకన్య !

తనబాస్ విజయరాజన్ తో ఏకాంతంగా ఉన్న సమయంలో అతనికి తెలీకుండా రహస్యంగా ఆ దృశ్యాలను ఆమె మొబైలో రికార్డు చేసింది. కార్యాలయాన్ని బెడ్ రూంగా తయారు చేసే విధంగా ఆమె తన బాస్ విజయరాజన్ ను రెచ్చగొట్టింది. అలా మూడేళ్ల నుంచి ఎన్నో రాసలీలల వీడియోలు రికార్డు చేసిందని సమాచారం.

సీన్ లోకి సుకన్య ప్రియుడు

సీన్ లోకి సుకన్య ప్రియుడు

సుకన్య తనకంటే 15 ఏళ్ల వయస్సు పెద్దవాడైన ప్రవీణ్ కుమార్ ను ప్రేమించింది. ప్రవీణ్ కుమార్ కు ఇంతకు ముందే వేరే మహిళతో వివాహం అయ్యింది. మా బాస్ తో తాను అక్రమ సంబంధం పెట్టుకున్నానని, నీవు ఆ దృశ్యాలను మొబైల్ లో వీడియో తీస్తే రూ. కోట్లు సంపాధించవచ్చని సుకన్య ఆమె ప్రియుడు ప్రవీణ్ కుమార్ కు చెప్పింది.

అప్పుడే సుఖం, క్షణాల్లో నెత్తిన పిడుగు !

అప్పుడే సుఖం, క్షణాల్లో నెత్తిన పిడుగు !

ఒక రోజు ఒంటరిగా ఉన్న బాస్ విజయరాజన్ దగ్గరకు సుకన్య వెళ్లింది. అతన్ని రెచ్చగొట్టి అతని కోరిక తీర్చింది. అంతే తరువాత అతనికి తన మొబైల్ లో ఉన్న ఓ వీడియో చూపించింది. ఆ వీడియో చూసిన విజయరాజన్ తల మీద పిడుగుపడినట్లు అయ్యింది. ఆ వీడియో చూసిన తరువాత అతని నోట మాటరాలేదు.

ఫస్ట్ వికెట్ కు రూ. 50 లక్షలు !

ఫస్ట్ వికెట్ కు రూ. 50 లక్షలు !

తన మొబైల్ ఉన్న వీడియో చూపించిన సుకన్య తన అసలు స్వరూపం బయటపెట్టింది. ఈ వీడియో తనకు కాబోయే భర్త తీశాడని, అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తానని అతను బెదిరిస్తున్నాడని, అప్పుడు నీ వ్యాపారంతో పాటు నా జీవితం నాశనం అవుతోందని అతన్ని బెదిరించింది. సుకన్య ఆమె ప్రియుడు ప్రవీణ్ కలిసి వ్యాపారి విజయరాజన్ ను బ్లాక్ మెయిల్ చేసి అతని దగ్గర రూ. 50 లక్షలు లాగేశారని వెలుగు చూసింది.

సెకండ్ వికెట్ రూ. 25 లక్షలు, నోబాల్ !

సెకండ్ వికెట్ రూ. 25 లక్షలు, నోబాల్ !

మొదటి విడతలో రూ. 50 లక్షలు లాగేసిన సుకన్య తరువాత అతని దగ్గర ఉద్యోగం నిలిపివేసింది. మళ్లీ తన మాజీ బాస్ ను బ్లాక్ మెయిల్ చేసి రూ. కోట్లు వసూలు చెయ్యాలని సుకన్య, ప్రవీణ్ కుమార్ ప్లాన్ చేశారు. విజయరాజన్ దగ్గరకు వెళ్లి రూ. 25 లక్షలు ఇవ్వాలని లేదంటే ఆ వీడియోలు యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తామని బెదిరించారు. సుకన్య చేష్టలతో విసిగిపోయిన వ్యాపారి విజయరాజన్ చెన్నై నగర డిప్యూటీ పోలీసు కమిషనర్ రాజేంద్రన్ కు ఫిర్యాదు చేశారు.

మేం మొబైల్ లో రికార్డు చేశాం !

మేం మొబైల్ లో రికార్డు చేశాం !

చెన్నై నగర డిప్యూటీ పోలీసు కమిషనర్ రాజేంద్రన్ ఆదేశాల మేరకు ఇన్స్ పెక్టర్ శంకర్ వెంటనే సుకన్య, ప్రవీణ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అవును మేం మొబైల్ లో దృశ్యాలు రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేశామని అంగీకరించారు.

ఆ డబ్బుతో జల్సాలు, నగలు

ఆ డబ్బుతో జల్సాలు, నగలు

బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేసిన డబ్బుతో సుకన్య తన ప్రియుడు ప్రవీణ్ కుమార్ తో కలిసి జల్సా చేసిందని వెలుగు చూసింది. అంతే కాకుండా భారీ మొత్తంలో సుకన్య బంగారు నగలు కోనుగోలు చేసిందని పోలీసులు గుర్తించారు. సుకన్య నుంచి అశ్లీల దృశ్యాలు ఉన్న మొబైల్ లు, 15 సవర్ల బంగారం, 10 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని చెన్నై నగర డిప్యూటీ పోలీసు కమిషనర్ రాజేంద్రన్ తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+