Honnavar: కర్ణాటకలోని హిడెన్ ప్యారడైజ్ 'హొన్నావర్' పర్యాటక ప్రాంతం విశేషాలు ఇవే..

కర్ణాటకలో అనేక చారిత్రక కట్టడాలు, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు, పురాతనమైన క్షేత్రాలు ఉన్నాయి. ఫ్యామిలీతో మంచి ట్రిప్ వేయాలనుకునేవారికి కర్ణాటక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నిత్యం ఉద్యోగ, వ్యాపారాల్లో బిజీ బిజీగా ఉండే చాలా మంది కాస్తంత విశ్రాంతి కోసం రిలాక్స్ అవ్వడానికి టూర్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో మంచి ట్రిప్ ఎంజాయ్ చేసి రావాలనుకునేవారికి కర్ణాటకలోని హిడెన్ జెమ్, హిడెన్ ప్యారడైజ్ అని పిలిచే హొన్నావర్ టూరిస్ట్ ప్రాంతాన్ని ఎప్పుడైనా సందర్శించారా..? ఇక్కడకు వెళ్తే తిరిగి రావాలనిపించదు. అంత అద్భుతంగా ఇక్కడి ప్రాంతం ఉంటుంది. ఉత్తర కన్నడ జిల్లాలోని ఓ అందమైన తీర ప్రాంతమే హొన్నావర్.. ఈ ప్రాంతం అరేబియా సముద్రం, శరావతి నది సంగమం ప్రాంతంలో ఉంటుంది. అందుకే ఈ పర్యటక ప్రాంతాన్ని హిడెన్ జెమ్ ఆఫ్ కర్ణాటక అని పిలుస్తుంటారు.

హొన్నావర్ లోని ప్రసిద్ధమైన ఎకో బీచ్ ప్రశాంతమైన వాతావరణం, పరిశుభ్రమైన తీరానికి నెలవుగా ఉంటుంది. హొన్నావర్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఈ బీచ్ ఉంటుంది. కర్ణాటకలోని రెండు బ్లూ ఫ్లాగ్ బీచ్‌ లలో ఇదీ ఒకటి. ఇక్కడే అప్సర కొండ జలపాతం, బీచ్ ఉంటాయి. ఇది ఒక అందమైన జలపాతం, సూర్యాస్తమయం చూసేందుకు అద్భుతమైన ప్రదేశంగా ఉంది. దట్టమైన ఆకుపచ్చని చెట్ల మధ్య ఈ జలపాతం ప్రశాంత వాతావరణాన్ని అందిస్తుంది. అలాగే శరావతి నది వెంబడి ఉన్న హొన్నావర్ బ్యాక్‌ వాటర్స్, కొబ్బరి చెట్ల మధ్య బోటింగ్‌ చేస్తే ఆ అనుభుతి మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. అందుకే నార్వే దౌత్యవేత్త ఎరిక్ సోల్హీమ్ ఈ బ్యాక్‌ వాటర్స్‌ ను స్వర్గం అని పేర్కొన్నట్లు సమాచారం.

అలాగే శరావతి మాన్ గ్రూవ్ బోర్డ్ వాక్.. అంటే దట్టమైన మడ అడవుల మధ్య నిర్మించిన చెక్క నడకదారి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అంతేకాక హొన్నావర్ లోని ఇడగుంజి మహా గణపతి ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా అలరారుతోంది. ఇడగుంజి ఆలయ నిర్మాణ భక్తులను, పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అలాగే శ్రీరామ తీర్థం రాముడి సంచార సమయంలో సందర్శించిన ప్రదేశంగా పౌరాణిక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

Honnavar tourist Here are the highlights of hidden paradise and tourist destination in Karnataka

ఇక హొన్నావర్ కు ఎలా చేరుకోవాలి..? హైదరాబాద్ నుంచి హొన్నావర్ కు డైరెక్ట్ రైలు సర్వీస్ లేదు. కానీ హైదరాబాద్ నుంచి గోవా, మంగళూరు లేదా హుబ్బళ్లి వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి లోకల్ బస్సు లేదా ట్యాక్సీ తీసుకుని వెళ్లొచ్చు. ఇక రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి గోవా లేదా మంగళూరుకు డైరెక్ట్ గా విమానాలు ఉంటాయి. అక్కడినుంచి టాక్సీలో హొన్నావర్ కు చేరుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+