Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Honour killing: కులపిచ్చి, మైనర్ కూతురు, బాయ్ ఫ్రెండ్ ను చంపేసి ?, కృష్ణా నదిలో కలిపేసి ?

బెంగళూరు/బాగల్ కోటే: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువకుడు, ఓ అమ్మాయికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. సంవత్సరం క్రితం ఇద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమికుల కులాలు వేరు. మా అమ్మాయిని వదిలేయాలని, ప్రేమ పేరుతో ఆమెతో తిరిగితే నీ అంతు చూస్తామని ఇంతకు ముందే ప్రియురాలు కుటుంబ సభ్యులు ప్రియుడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అయితే ప్రేమికులు మాత్రం కలుస్తూనే ఉన్నారు. ఇటీవల అమ్మాయి కనపడటం లేదని ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. మూడు రోజుల తరువాత మా కొడుకు కనపడటం లేదని ప్రియుడి తండ్రి పోలీసు కేసు పెట్టాడు. అయితే ప్రేమికుల ఆచూకి మాత్రం చిక్కలేదు. ప్రియుడి కుటుంబ సభ్యులకు డౌట్ వచ్చి ప్రియురాలి కుటుంబ సభ్యుల మీద కేసు పెట్టారు. పోలీసులు యువతి అన్నను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. ప్రేమికులను కిరాతకంగా హత్య చేసి లోదుస్తులు మాత్రం వదిలేసి బట్టలు మొత్తం తీసేసి ఇద్దరి శవాలను నదిలో విసిరేశామని ప్రియురాలి కుటుంబ సభ్యులు అంగీకరించడం కలకలం రేపింది. ప్రేమికులను ఎంతకిరాతకంగా హత్య చేశారో తెలుసుకున్న స్థానికులు హడలిపోయారు.

ఒకే గ్రామంలో లవర్స్

ఒకే గ్రామంలో లవర్స్

కర్ణాటకలోని బాగలకోటే (జిల్లా కేంద్రం) సమీపంలోని బేవినమట్టి గ్రామంలో 17 ఏళ్ల వయసు ఉన్న రాజేశ్వరి అనే మైనర్ బాలిక నివాసం ఉంటున్నది. ఇదే గ్రామంలో విశ్వనాథ్ (22) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కే ప్రాంతంలో నివాసం ఉంటున్న విశ్వనాథ్ కు, మైనర్ అమ్మాయి రాజేశ్వరికి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. సంవత్సరం క్రితం విశ్వనాథ్, రాజేశ్వరి ఇద్దరూ ప్రేమించుకున్నారు.

అమ్మాయి కుటుంబ సభ్యులు వార్నింగ్

అమ్మాయి కుటుంబ సభ్యులు వార్నింగ్

అందరి ప్రేమికులు లాగానే విశ్వనాథ్, రాజేశ్వరి రహస్యంగా కలుసుకునేవాళ్లు, కొన్ని నెలల పాటు ప్రేమికులు విశ్వనాథ్, రాజేశ్వరిల వ్యవహారం బయటకురాలేదు. నాలుగు నెలల క్రితం రాజేశ్వరి ప్రేమ వివాహం ఆమె కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. నువ్వు పద్దతి మార్చుకోవాలని రాజేశ్వరికి ఆమె కుటుంబ సభ్యులు మందలించారు.

కులం తక్కువ వాడు అని ?

కులం తక్కువ వాడు అని ?

ప్రేమికులు విశ్వనాథ్, రాజేశ్వరీల కులాలు వేరు. మా అమ్మాయిని వదిలేయాలని, ప్రేమ పేరుతో ఆమెతో తిరిగితే నీ అంతు చూస్తామని ఇంతకు ముందే ప్రియురాలు రాజేశ్వరి అన్న రవి (19)తో పాటు అతని సమీప బంధవులు, ఫ్రెండ్స్ కలసి ప్రియుడు విశ్వనాథ్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అయితే ప్రేమికులు విశ్వనాథ్, రాజేశ్వరి మాత్రం రహస్యంగా కలుస్తూనే ఉన్నారు.

మిస్సింగ్ కేసుల్లో ట్విస్ట్

మిస్సింగ్ కేసుల్లో ట్విస్ట్

మా అమ్మాయి రాజేశ్వరి కనపడటం లేదని ఆమె తండ్రి పరసప్ప బాగలకోటే గ్రామీణ పోలీసులను ఆశ్రయించాడు. మూడు రోజుల తరువాత మా కొడుకు విశ్వనాథ్ కనపడటం లేదని అతని తండ్రి పోలీసు కేసు పెట్టాడు. అయితే ప్రేమికులు, విశ్వనాథ్, రాజేశ్వరి ఆచూకి మాత్రం చిక్కలేదు. ప్రియుడు విశ్వనాథ్ కుటుంబ సభ్యులకు డౌట్ వచ్చి ప్రియురాలు రాజేశ్వరి కుటుంబ సభ్యుల మీద కేసు పెట్టారు.

పరువు హత్యలు.... ప్రియురాలి అన్న కింగ్ పిన్

పరువు హత్యలు.... ప్రియురాలి అన్న కింగ్ పిన్

బాగలకోటే పోలీసులు రాజేశ్వరి అన్న రవిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. ప్రేమికులు విశ్వనాథ్, రాజేశ్వరిలను మేమే కిరాతకంగా హత్య చేశామని రవి అంగీకరించడంతో పోలీసులు షాక్ అయ్యారు. పోలీసులు ప్రియురాలు రాజేశ్వరి అన్న రవితో పాటు అమ్మాయికి సమీప బంధువులు అయిన బీరప్ప (18),హనుమంత (22) అనే ముగ్గురిని అరెస్టు చేశారు.

 కారులో కిడ్నాప్ చేసి ప్రేమికుల దారుణ హత్య

కారులో కిడ్నాప్ చేసి ప్రేమికుల దారుణ హత్య

అక్టోబర్ 3వ తేదీన నిర్జనప్రదేశంలో మాట్లాడుకుంటున్న ప్రేమికులు విశ్వనాథ్, రాజేశ్వరీలను ఆమె అన్న రవి, హనుమంత, బీరప్ప కలసి బోలెరో వాహనంలో కిడ్నాప్ చేశారు. కారులోనే రాజేశ్వరిని ఆమె వేసుకున్న పంజాబీ డ్రెస్ వేల్ తో గొంతు బిగించి దారణంగా హత్య చేశామని నిందితులు అన్నారు.

 జీపులో ప్రియుడు ఫినిష్

జీపులో ప్రియుడు ఫినిష్


రాజేశ్వరిని హత్య చేసిన వెంటనే బోలెరో జీపులో విశ్వనాథ్ ను దారుణంగా పొడిచి చంపేశారు. ప్రేమికులు ఎవరు గుర్తు పెట్టకుండా వారి లోదుస్తులు మాత్రం వదిలేసి బట్టలు మొత్తం తీసేసి ఆల్ మట్టి రోడ్డులోని కృష్ణా నదిలో విసిరేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు
కృష్ణా నదిలో శవాలు కోసం గాలించినా ఇప్పటి వరకు చిక్కడం లేదని పోలీసులు అన్నారు. తక్కువ కులం వాడిని ప్రేమించిందని రాజేశ్వరీని, ఆమె ప్రియుడు విశ్వనాథ్ ను హత్య చేశామని రాజేశ్వరి అన్న రవి, ఆమె బంధువులు అంగీకరించారని పోలీసు అధికారులు అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+