యువకుడితో సంబంధం: ఇటుకలతో కొట్టి అమ్మాయి హత్య
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అవాంఛనీయమైన సంఘటన చోటు చేసుకుంది. 19 ఏళ్ల అమ్మాయిని తండ్రి, సోదరుడు ఇటుకలతో కొట్టి చంపారు. మరో వర్గానికి చెందిన యువకుడితో సంబంధం కొనసాగిస్తూ పట్టుబడిన అమ్మాయిపై వారు దాడి చేసి చంపేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు గురువారంనాడు మృతురాలి తండ్రిని, సోదరుడిని అరెస్టు చేశారు.
పరువు హత్యగా భావించిన పోలీసులు ఆ హత్యకు పాల్పిడన జగ్పాల్, అతని కుమారుడు సతీష్‌ను అరెస్టు చేసిటన్లు సీనియర్ పోలీసు సూపరింటిండెంట్ హెచ్ఎన్ సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మలీరా గ్రామంలో బహర్బూమికి వెళ్లిన సమయంలో ఆమెను పొలాల్లో హత్య చేశారు. ఇటుకలతో కొట్టి చంపినట్లు అమ్మాయి తండ్రి, సోదరుడు అంగీకరించినట్లు సింగ్ చెప్పారు.

మృతురాలిని ప్రతిభగా గుర్తించారు. మలిరా గ్రామంలో ప్రతిభ మరో యువకుడితో ఉండగా కుటుంబ సభ్యులు చూశారు. మంగళవారం ఉదయం ఆమె శవం పొలాల్లో కనిపించింది. తలపై ఇటుకలతో మోదిన గుర్తులున్నాయి. ఓ వారంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం జిల్లాలో ఇది రెండోది.
బహర్భూమికి వెళ్లినప్పుడు ఆమెను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేసి ఉంటారని కుటుంబ సభ్యులు తొలుత చెప్పారు. తాము కుటుంబ సభ్యుల పాత్రపై అనుమానించామని, తండ్రి చంపినట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. యువకుడితో సంబంధాన్ని అంగీకరించకపోతే అతనితో పారిపోతానని చెప్పిందని, దాంతో తాను తన కూతురిని చంపానని జగ్పాల్ చెప్పాడు.
తమ గ్రామానికి చెందిన ఓ దళిత యువకుడిని ప్రేమించినందుకు ముజఫర్‌నగర్ జిల్లాలో రుక్సర్ అనే 19 ఏళ్ల అమ్మాయిని అమె తండ్రి డిసెంబర్ 31వ తేదీన హత్య చేశాడు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications