వైరల్‌ వీడియో: టాయిలెట్‌ లో బ్లాక్ కోబ్రా.. చూడకుండా కూర్చుంటే..

సాధారణంగా వర్షాకాలంలో పాములు, పురుగులు, ఇతర కీటకాలు ఇంటి పరిసరాల్లోకి వస్తుంటాయి. ఇంటి ఆవరణలోని చెత్తా చెదారం ఉన్న ప్రదేశంలో తలదాల్చుకుంటాయి. ఒక్కోసారి ఇంట్లోకీ వస్తుంటాయి. ఇంట్లో, బాత్ రూమ్ లో బెడ్ రూమ్ ల్లోకి పాములు దూరిన ఘటనలు మనం చాలా చూసి ఉంటాం. తాజాగా అలాంటి ఘటనే మరోటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇక్కడో నల్లతాచు ఏకంగా ఓ హోటల్‌ లోని రెండో అంతస్తులో ఉన్న టాయిలెట్‌ కమ్మోడోలో ప్రత్యక్షం అయంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

రాజస్థాన్‌ లో జరిగిన షాకింగ్ ఘటన సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లాకు చెందిన ఈ వైరల్ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కెర్లు కొడుతోంది. అజ్మీర్ జిల్లా పుష్కర్ ప్రాంతం‌లోని ఒక హోటల్‌లో ఏకంగా నాగుపాము హల్ చల్ చేసింది. అది కూడా రెండవ అంతస్తులోని టాయిలెట్ కబోడ్ లో ఇలాంటి ఘటన జరగడం ఆందోళనకు గురిచేసింది. 4 నుండి 5 అడుగుల పొడవున్న నల్లతాచు పడగవిప్పి బుసలు కొడుతూ కనిపించింది. ఈ దృశ్యాలను హోటల్ సిబ్బంది వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.

Hooded Horror in the Throne Black Cobra Spotted in Rajasthan Toilet Commode Goes Viral

ఈ ఘటనపై హోటల్ సిబ్బంది సంబంధిత అధికారులకు తెలిపింది. దీంతో వాళ్లు సంఘటనా స్థలానికి చేరుకుని నల్లతాచును బంధించి అడవిలోకి సురక్షితంగా విడిచిపెట్టారు. వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు జరగడం సహజం అని చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వేల సంఖ్యలో వ్యూస్ తో దూసుకెళ్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+