బిల్కిస్ బానో కేసులో దోషులను ఎలా విడుదల చేశారు?: గుజరాత్‌కు సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన విధానంపై సుప్రీంకోర్టు గురువారం పలు ప్రశ్నలు సంధించింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేసి, ఆమె కుటుంబాన్ని హత్య చేసిన కేసులో దోషులుగా తేలిన వ్యక్తులను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం విచారిస్తోంది.
దోషుల మరణశిక్షను జీవితఖైదుగా మార్చారు. అలాంటి పరిస్థితుల్లో 14 ఏళ్ల శిక్ష పూర్తయిన వెంటనే వారిని ఎలా విడుదల చేశారు? ఇతర ఖైదీలను ఇలాగే ఎందుకు విడుదల చేయలేదు? ఈ కేసులో నేరస్థులకు మాత్రమే పాలసీ ప్రయోజనాలు ఎందుకు కల్పించారు? సంస్కరణల పేరుతో కరుడుగట్టిన నేరస్థులకు ఇలాంటి అవకాశం ఇవ్వడం ఎంతవరకు సమజసం? అని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది.

అంతేగాక, 14 ఏళ్ల తర్వాత విడుదల చేస్తామనే ఈ విషయాన్ని ఇతర ఖైదీలకూ వర్తింపజేస్తారా? ఈ పాలసీకి కొందరిని మాత్రమే ఎందుకు ఎంపిక చేస్తున్నారు? ఇస్తే అందరికీ అవకాశం ఇవ్వాలి కదా? అలా ఎంతవరకు అమలవుతోంది? మన జైళ్లు ఎందుకు నిండిపోతున్నాయి? అందుకు సంబంధించిన డేటా మా ముందు ఉంచండి అని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
బిల్కిస్ బానో దోషుల విడుదల కోసం జైలు సలహా కమిటీని ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారని, అందుకు సంబంధించిన వివరాలను సమర్పించాలని గుజరాత్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. గోద్రా కోర్టులో విచారణ జరగకున్నా అక్కడి అభిప్రాయం అక్కడ అభిప్రాయం ఎందుకు తీసుకున్నారో చెప్పాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బిల్కిస్ బానో తరపు న్యాయవాది శోభా గుప్తా వాదిస్తూ దోషుల విడుదలపై గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని అన్నారు.
ఈ విషయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇందులో కేంద్రం కూడా భాగం కాలేదు. దోషి రాధేశ్యామ్ దరఖాస్తును ఉద్దేశించి మాత్రమే సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, ప్రభుత్వం 11 మంది దోషులకు ఊరట కల్పించిందని చెప్పారు. రాధేశ్యామ్ విడుదలపై మాత్రమే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించగా.. గుజరాత్ ప్రభుత్వం దోషులందరినీ విడుదల చేసిందని తెలిపారు. దోషుల విడుదల గురించి తనకు కనీస సమాచారం ఇవ్వలేదని బిల్కిస్ బానో పేర్కొంది. దీంతో ఆమె పిటిషన్‌పై విచారణను ఆగస్టు 24కు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications