సుప్రీంకోర్టుకు ప్రశంసలు- ఆ కీలక నిర్ణయంతో పిటిషనర్లకు ఎంతో ఊరట..!

దేశ అత్యున్నత న్యాయస్ధానం అయిన సుప్రీంకోర్టుకు అత్యవసర న్యాయం కోరి వచ్చే కక్షిదారులకు దాన్ని అందించడంలో జరుగుతున్న జాప్యాన్ని గమనించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర కేసుల విచారణ విషయంలో పాటించాల్సిన నియమావళిని ఆయన విడుదల చేశారు. దీన్ని అనుసరించి తాజాగా దాఖలైన కొన్ని కేసుల్లో కక్షిదారులు ఎంతో ఊరట పొందారు. దీంతో సుప్రీంకోర్టు నిర్ణయంపై ప్రశంసలు వినిపిస్తున్నాయి.

తాజాగా తన అబార్షన్‌కు అనుమతి ఇవ్వాలని కోరుతూ అత్యాచారానికి గురైన ఓ బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు కూడా అంతే వేగంగా స్పందించింది. వెంటనే ఈ పిటిషన్ పై విచారణ జరిపి ఆమెకు ఉపశమనం ఇచ్చేలా కీలక తీర్పు ఇచ్చేసింది. ఇలాంటివే మరికొన్ని కేసులు కూడా ఉన్నాయి. వీటిలో పిటిషనర్లకు తక్షణ ఉపశమనం ఇచ్చేలా ఉన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక ఓ కీలక కారణం ఉంది.

how does supreme courts new SOP help petitioners in these latest cases?

అత్యవసర కేసుల విచారణ కోసం భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ కొత్త మార్గదర్శకాలను రూపొందించారు. వీటిని తప్పనిసరిగా పాటించాలని రిజిస్ట్రీకి ఆదేశాలు ఇచ్చారు. వీటిని అమలు చేయడం మొదలుపెట్టాక దాఖలైన పలు కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం దొరికింది. కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ప్రకారం అనూహ్యంగా అత్యవసర విషయాలను ఉదయం 10.30 గంటలలోపు కోర్టు ప్రస్తావన అధికారికి ఫ్లాగ్ చేయవచ్చని తెలిపారు.

భోజన విరామ సమయంలో లేదా అత్యవసరం అయితే అధికారి దానిని ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచవచ్చని మార్గదర్శకాలు చెబుతున్నాయి. అలాగే అటువంటి అభ్యర్థనలను ఇమెయిల్ ద్వారా పంపే సదుపాయాన్ని కూడా కల్పించింది. ఈ ఇ-మెయిల్‌లను ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నిశితంగా పరిశీలిస్తున్నారని కోర్టు వర్గాలు తెలిపాయి.సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌కు సుప్రీంకోర్టు అర్థరాత్రి బెయిల్ మంజూరు చేయడం, నుహ్‌లో ఇటీవల జరిగిన మత ఘర్షణలపై అత్యవసర విచారణ ఈ మార్గదర్శకాల ప్రకారం తీసుకున్న నిర్ణయాలేనని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+