ఐపీఎస్ అధికారులకు ర్యాంకుల వారీగా నెలకు ఎంత జీతమో తెలుసా..!
భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. ముఖ్యంగా దేశ శాంతిభద్రతలకు వెన్నెముకగా నిలిచేలా ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) వ్యవహరిస్తుంది అనడంలో సందేహం అక్కర్లేదు. ఇది కేవలం ఉద్యోగం కాదు ప్రజలకు సేవ చేయడానికి.. న్యాయం అందించడానికి గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. సివిల్స్ పరీక్షలో మెరిట్ సాధించిన ఎంతో మంది యువత ఐపీఎస్‌గా ప్రజలకు సేవలందిస్తున్నారు.
కాగా దేశ సేవ చేస్తూనే ఆకర్షణీయమైన జీతభత్యాలతో పాటు పలు ప్రయోజనాలను పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎస్ అధికారులకు ర్యాంక్ వారీగా నెలవారీ జీతం ఎంత వస్తుంది.. వారికి అందించే ప్రత్యేక అలవెన్స్‌లను ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

ఐపీఎస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వ సివిల్ సర్వీసెస్ మాదిరిగానే వేతన స్కేల్ ఉంటుంది. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు పే మ్యాట్రిక్స్ విధానం ద్వారా ఐపీఎస్ అధికారుల వేతనాలను నిర్ణయిస్తారు. అధికారి అనుభవం, సర్వీస్, ర్యాంక్ పెరిగే కొద్దీ జీతం కూడా పెరుగుతుంది. దేశంలో అత్యున్నత పోలీస్ పదవి అయిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) స్థాయిలో అత్యధిక జీతం ఉంటుంది.
ర్యాంకుల వారీగా నెలవారీ ప్రాథమిక వేతనం..
- డిప్యూటీ ఎస్పీ (DSP) / ఏసీపీ (ACP): రూ.56,100
- అడిషనల్ ఎస్పీ: రూ.67,700
- పోలీస్ సూపరింటెండెంట్ (SP): రూ.78,800
- డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (DIG): రూ.1,31,000
- ఇన్‌స్పెక్టర్ జనరల్ (IG): రూ.1,44,200
- అడిషనల్ డీజీపీ (ADGP): రూ.2,05,000
- డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP): రూ.2,25,000
ఇక అధికారులకు జీతంతో పాటు పలు రకాల భత్యాలు, సౌకర్యాలను పొందుతారు. ద్రవ్యోల్బణాన్ని బట్టి డియర్‌నెస్ అలవెన్స్ (DA) ఎప్పటికప్పుడు అందిస్తారు. అలానే పోస్టింగ్ నగరాన్ని బట్టి హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) మారుతుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఇది అత్యధికంగా ఉంటుంది. అధికారిక పర్యటనల కోసం ప్రయాణ భత్యం (TA) కూడా ఇస్తారు. ఇందులో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు కూడా ఉంటాయి.
మరోవైపు ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబాలకు ప్రభుత్వ ఆరోగ్య పథకాల కింద ఉచిత చికిత్స, వైద్య సదుపాయాలు కల్పిస్తారు. సీనియర్ ర్యాంక్ అధికారులకు భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సహాయకులను కూడా అందిస్తారు. ప్రభుత్వ గృహాలు (క్వార్టర్స్), విద్యుత్, సబ్సిడీలు, టెలిఫోన్ బిల్లులపై రాయితీలు వంటి ఇతర ప్రయోజనాలు కూడా ఐపీఎస్ అధికారులకు లభిస్తాయి. పిల్లల విద్య కోసం ప్రభుత్వం గుర్తించిన స్కూళ్లలో ప్రత్యేక కోటా, విదేశీ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం, ప్రభుత్వ ఖర్చుతో అధికారిక పర్యటనలు, హౌస్ లోన్, కారు లోన్ వంటి తక్కువ వడ్డీ రుణాలు పొందవచ్చు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications