ఆర్దిక సంస్కర్త మన్మోహన్ ఆస్తులు, అప్పుల లెక్కలు..!!

దేశ ఆర్దిక పరిస్థితులను గాడిలో పెట్టిన మాజీ ప్రధాని మన్మోహన్ ఆస్తులు ఎంతో తెలుసా. ఆర్దిక మేధావిగా యావత్ దేశం కీర్తించిన మన్మోహన్ ఆస్తుల లెక్కలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దేశ ప్రధానిగా మన్మోహన్ పది సంవత్సరాలు సేవలు అందించారు. మన్మోహన్ మరణం పట్లు పలువు రు ప్రముఖులు నివాళి అర్పించారు. రేపు (శనివారం) అధికారిక లాంఛనాలతో మన్మోహన్ అంత్య క్రియలు జరగనున్నాయి.

దేశానికి ఆర్దిక మార్గదర్శిగా నిలిచిన మాజీ ప్రధాని మన్మోహన్ గురువారం రాత్రి తుది శ్వాస విడి చారు. ప్రధాని మోదీ, అమిత్ షా తో సహా సోనియా, రాహుల్, కాంగ్రెస్ ప్రముఖులు మన్మోహన్ నివా సానికి వెళ్లి నివాళి అర్పించారు. దేశ వ్యాప్తంగా వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. తెలంగాణలో ఈ రోజు ప్రభుత్వ కార్యలయాలు, విద్యా సంస్థలకు సెలవు ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మన్మోహన్ భౌతిక ఖాయానికి నివాళి అర్పించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని గా ఉన్న సమయంలో మన్మోహన్ పలు కీలక నిర్ణయాలతో తన దైన ముద్ర వేసారు.

How Much Wealth Did Former PM Manmohan Singh Leave Behind details here

ఇక, దేశ ఆర్దిక వ్యవస్థను గాడిన పెట్టిన సంస్కరణల రూపశిల్పిగా చెప్పుకోనే మన్మోహన్ వ్యక్తిగత ఆర్దిక నిర్వహణ పైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. సుదీర్ఘ కాలం ఆర్దిక మంత్రిగా.. పదేళ్ల పాటు ప్రధానిగా ఉన్న మన్మోహన్ ఆస్తుల విలువ రూ 15 కోట్ల 77 లక్షలు. రాజ్యసభలో మన్మోహన్ ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం ఆయనకు ఢిల్లీ, చండీఘడ్ లో ఆయన పేరు మీద ఫ్లాట్లు ఉన్నాయి.

అయితే, దేశం బంగారు తాకట్టు నుంచి సంస్కరణల బాట పట్టించిన మన్మోహన్ కు ఎలాంటి అప్పులు లేవు. ఎక్కడా ఆడంబరాలకు పోయినట్లు గా విమర్శలు లేవు. ప్రతిపక్షాలు సైతం అభిమానించేలా మన్మోహన్ వ్యవహార శైలి ఉందంటూ పలువురు నేతలు నివాళి అర్పిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+