Central Govt: పాస్‌పోర్ట్ నెంబర్‌ను కోవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను ఇలా లింక్ చేయండి!!

న్యూఢిల్లీ: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. అంతేకాదు పలు ప్రపంచ దేశాలు తమ దేశంలోకి అడుగుపెట్టాలంటే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను అడుగుతున్నాయి. కరోనావైరస్ టీకా చేయించుకున్నట్లుగా ప్రభుత్వం ధృవీకరిస్తూ జారీ చేసే సర్టిఫికేట్‌ను తప్పనిసరిగా చూపించాలంటూ పలు దేశాలు నిబంధనలు తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కోసం తీసుకొచ్చిన కోవిన్ యాప్‌లో పలు మార్పులు చేసింది. కోవిన్ యాప్‌లో పాస్‌పోర్టులతో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అనుసంధానం చేసుకునే వెసులుబాటును కల్పించింది.

Recommended Video

    Covishield, Covaxin Effective Against Delta Plus variant - Says Health Secretary | Oneindia Telugu

    వ్యాక్సిన్ తీసుకున్న వారికి తప్పకుండా కేంద్రప్రభుత్వం జారీ చేసే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ వస్తుంది. ఆ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కోవిన్ యాప్‌లో కూడా లభిస్తుంది. ఇప్పుడు పాస్‌పోర్టు నెంబర్‌ను ఆ సర్టిఫికేట్‌తో అనుసంధానం చేయడం ద్వారా విదేశాలకు వెళ్లే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఇందుకోసం కోవిన్ యాప్‌లోని వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌లో మీ పాస్‌పోర్టు నెంబరును ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఈ మేరకు ఆరోగ్యసేతు యాప్ ట్వీట్ చేసింది.

    Centre asks citizens to link Passport number to Corona vaccination certificate

    ఇక పాస్‌పోర్టుపై ఉన్న పేరు, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ పై ఉన్న పేరు రెండూ ఒకేలా ఉండాలి. ఒక వేళ అలా లేకుంటే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ పై ఉన్న పేరును మార్చుకునేందుకు వెసులుబాటు ఉంది. అయితే ఇలా పేరు పాస్‌పోర్టుపై ఉన్న పేరుతో మార్చుకోవాలంటే ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుంది. అంతకుముందు ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన కోవిడ్-19 గైడ్‌లైన్స్‌లో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను పాస్‌పోర్టులతో లింక్ చేసుకోవాలని పేర్కొంది. అంటే పై చదవుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగాల కోసం వెళ్లేవారు,టోక్యో ఒలంపిక్స్ బృందంలో ఉండే క్రీడాకారులు ఇలా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను పాస్‌పోర్టుతో అనుసంధానం చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఉంటాయని కేంద్రం పేర్కొంది.

    ఇక వ్యాక్సిన్ సర్టిఫికేట్‌తో పాస్‌పోర్టును ఇలా లింక్ చేసుకోవాలి

    ముందుగా మీఐడీ వివరాలతో అధికారిక కోవిన్ యాప్‌పై లాగిన్ అవ్వాలి

    లాగిన్ అయ్యాక అకౌంట్ డీటెయిల్స్‌లో ఉన్న Raise Issue బటన్ మీద క్లిక్ చేయండి

    అక్కడ మూడు ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. సర్టిఫికేట్ కరెక్షన్: మెర్జ్ మల్టిపుల్ డోస్ #1 ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అండ్ యాడ్ పాస్‌పోర్ట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. యాడ్ పాస్‌పోర్ట్ డీటెయిల్స్ పై క్లిక్ చేయండి

    దీంతో పాస్‌పోర్ట్ వివరాలు కలిగి ఉన్న మరో పేజ్‌ ఓపెన్ అవుతుంది. అక్కడ డ్రాప్ డౌన్ మెనూ నుంచి ఎవరి వివరాలు అయితే నమోదు చేయాలనుకుంటున్నారో వారి పేరును సెలెక్ట్ చేసుకోండి. వారి పాస్‌ పోర్టు నెంబరును ఎంటర్ చేయండి. కరెక్ట్ పాస్ పోర్టు నెంబర్ ఎంటర్ చేశారో లేదో మరోసారి చెక్ చేసుకోండి. ఒకసారి మాత్రమే సర్టిఫికేట్ ఫోటో ఐడీ వివరాలు మార్చుకునేందుకు వీలుంటుంది

    అన్ని వివరాలు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నాక పాస్‌పోర్టు వివరాలు లబ్దిదారుడివే అయితే అక్కడ చెక్ బాక్స్‌లో టిక్ చేయండి. వ్యాక్సిన్ సర్టిఫికేట్ పాస్‌పోర్టు పై ఉన్న పేర్లు ఒకేలా ఉండేలా చూసుకోండి

    ఆ తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి . వెంటనే మీ వివరాలు మార్చడం జరిగిందని చెబుతూ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత కొన్ని నిమిషాలకు మీ వివరాలు అప్‌డేట్ అయ్యాయని చెబుతూ మరో మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మీ అకౌంట్ డీటెయిల్స్‌కు వెళ్లి పాస్‌పోర్ట్ వివరాలతో లింక్ అయిన కొత్త వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+