Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శుభవార్త: జియో ఫీచర్‌ఫోన్‌లో వాట్సాప్‌ కోసం ఇలా చేస్తే సరి

న్యూఢిల్లీ: జియో ఫీచర్‌‌ఫోన్‌లో వాట్సాప్ ఉపయోగించవచ్చు. అయితే వర్చ్యువల్ టెక్నాలజీ సహయంతో జియోఫీచర్‌ఫోన్‌లో కూడ వాట్సాప్‌ను ఉపయోగించే వెసులుబాటు లభిస్తోంది.

అతి తక్కువ ధరకే జియో ఫీచర్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ ఫోన్‌లో అన్ని రకాల సౌకర్యాలున్నప్పటికీ వాట్సాప్ ఆఫ్షన్ మాత్రం లేదు. అయితే ఇంటర్నెట్ ఉపయోగించుకోవచ్చు. సినిమాలు చూసే అవకాశం ఉన్నా వాట్సాప్ లేకపోవడం ఈ ఫోన్‌కు వెలితి.

అయితే వర్చువల్ టెక్నాలజీ కారణంగా జియో ఫీచర్ ఫోన్‌లో కూడ వాట్సాప్ సౌకర్యాన్ని పొందే అవకాశం కూడ లేకపోలేదంటున్నారు నిపుణులు.

 జియో ఫీచర్‌ఫోన్‌లో వాట్సాప్

జియో ఫీచర్‌ఫోన్‌లో వాట్సాప్

జియో ఫీచర్ ఫోన్‌లో వాట్సాప్ సౌకర్యాన్ని పొందే అవకాశం లభిస్తోంది. వర్చ్యువల్‌ టెక్నాలజీ ద్వారా పలు వెబ్‌బ్రౌజర్లను విర్చ్యువల్‌గా ఉపయోగించుకోనే అవకాశం ఇంటర్నెట్‌లో ఉంది.తద్వారా మీ జియోఫోన్‌లో వాట్సప్‌ ఓపెన్‌ చేయెచ్చు. ఈ మేరకు టెక్నాలజీ నిపుణులు జియో ఫీచర్ ఫోన్‌లో కూడ వాట్సాప్‌ను ఉపయోగించవచ్చని నిరూపించారు. అయితే రిలయన్స్ జియో మాత్రం ఈ ఫోన్‌లో వాట్సాప్ ఆఫ్షన్ ఇవ్వలేదు. అయితే వాట్సాప్ అవకాశం ఇవ్వకున్నా కానీ, టెక్నాలజీ సహయంతో వాట్సాప్‌ను ఉపయోగించుకోవచ్చని నిరూపించారు.

 జియోలో వాట్సాప్ కోసమిలా..

జియోలో వాట్సాప్ కోసమిలా..

మీఫోన్‌లోని ఇంటర్నెట్‌ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేసి https://www.browserling.com అనే సైట్‌లో లాగాన్‌ అవ్వాలి.

అక్కడ పలు ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌కు చెందిన పలు బ్రౌజర్లు అందుబాటులో ఉంటాయి. వాటిలో విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టం ఎంచుకొని, గూగుల్‌ క్రోమ్‌, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌లలో ఏదో ఒకదాన్ని ఎన్నుకొని అడ్రస్‌బార్‌లో http://web.whatsapp.com అని టైప్‌చేసి టెస్ట్‌నౌ అనే బటన్‌పై క్లిక్‌ చేస్తే, స్క్రీన్ మీద ఓ క్యూఆర్‌ కోడ్‌ చూపిస్తుంది. మీదగ్గర ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్‌ ఓపెన్‌ చేసి వాట్సప్‌ వెబ్‌ ఆప్షన్‌లోకి వెళ్లి కోడ్‌ను స్కాన్‌ చేస్తే మీజియోఫోన్‌లో వాట్సప్‌ ఓపెన్‌ అవుతుంది.

 వాట్సాప్ వస్తే జియో‌ ఫీచర్ ఫోన్‌కు తిరుగుండదు

వాట్సాప్ వస్తే జియో‌ ఫీచర్ ఫోన్‌కు తిరుగుండదు

అతి తక్కువ ధరకే అన్ని రకాల ఆఫ్షన్లతో జియో ఫీచర్ ఫోన్ ముందుకు వచ్చింది. అయితే వాట్సాప్ కూడ ఆ ఫోన్‌లో ఓపెన్ అయ్యే వెసులుబాటు కలగడంతో ఆ ఫోన్‌కు తిరుగుండదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే వాట్సాప్ ఆఫ్షన్ ఉంటే ఇతర స్మార్ట్‌ఫోన్లకు ఫీచర్ ఫోన్ కూడ ఏ మాత్రం తీసిపోదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

 టెలికం ఆపరేటర్ల పోటా పోటీ

టెలికం ఆపరేటర్ల పోటా పోటీ

జియో ఫీచర్ ఫోన్‌ పోటీని ఎదుర్కొనేందుకు ఎయిర్‌టెల్, ఐడియాలు తక్కువ ధరకే ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇప్పటికే ఎయిర్ టెల్ జియో ఫీచర్ ఫోన్‌కు సమానమైన ధరలోనే స్మార్ట్‌ఫోన్ ‌ను అందుబాటులోకి తీసుకువచ్చాయి.ఐడియా, వొడాఫోన్‌ కూడ తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొనే అవకాశం లేకపోలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+