Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హృతిక్ మాజీ భార్యపై చీటింగ్ కేసు: ఏమైంది?

పనాజి: ప్రముఖ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య, ఇంటీరియర్ డిజైనర్ సుసన్నే ఖాన్‌పై గోవా పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఫిర్యాదు మేరకు గోవా పోలీసులు ఆమెపై 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

ఆర్కిటెక్ట్‌గా పరిచయం చేసుకున్న సుసన్నే ఖాన్.. తమ నుంచి ఓ కాంట్రాక్టు తీసుకుందని, ఈ పనికోసం 2013లో ఆమెకు 1.87 కోట్ల రూపాయలు చెల్లించామని, అయితే ఇప్పటివరకు పని పూర్తిచేయలేదని ఎంజీ ప్రాపర్టీస్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Hrithik Roshan’s ex-wife Sussanne Khan booked by Goa Police! – Know why

కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో రిజిస్ట్రేషన్ నెంబర్ వివరాలు ఇవ్వాల్సిందిగా సుసన్నేను కోరగా.. ఆమె తెలియజేయలేదని ఆరోపించింది. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో ఆరా తీయగా సుసాన్నే అసలు రిజిస్ట్రేషన్ చేసుకోలేదని తెలిసిందని ఈ సంస్థ వెల్లడించింది. అయితే, ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+