ఆక్స్‌ఫర్డ్ కోవిషిల్డ్ వ్యాక్సిన్: పాట్నా ఆర్ఎంఆర్ఐలో ఫేజ్-2, ఫేజ్-3 ప్రయోగం, 160 మంది రెడీ..
ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తల 'కోవిషిల్డ్' వ్యాక్సిన్‌ను త్వరలో పాట్నాలో గల రాజేంద్ర మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఆర్ఎంఆర్ఐ)లో హ్యుమన్ ట్రయల్ చేయనున్నారు. వ్యాక్సిన్ ఫేజ్ 2, ఫేజ్ 3 ఇక్కడ ప్రయోగిస్తారు. బ్రిటీష్ స్వీడిష్ మల్టీ నేషనల్ కంపెనీ ఆస్ట్రా జెనెకాతో కలిసి ఆక్స్ ఫర్డ్ కోవిషిల్డ్ వ్యాక్సిన్ అభివృద్ది చేస్తోన్న సంగతి తెలిసిందే. కోవిషిల్డ్ వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్ కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) 17 సంస్థలకు అనుమతిచ్చింది. అందులో పాట్నాలో గల ఆర్ఎంఆర్ఐ ఒకటి.
Recommended Video

పుణె సిరం ఇనిస్టిట్యూట్..
తొలుత పుణెలో గల సిరం ఇనిస్టిట్యూట్‌లో కోవిషిల్డ్ వ్యాక్సిన్ ప్రయోగించి.. ఇమ్యూనిటీ లెవల్స్ పరిశీలించారు. ఆర్ఎంఆర్ఐలో రెండు, మూడో ఫేజ్ ప్రయోగం కోసం 160 మంది ఆరోగ్యంగా ఉన్న వాలంటీర్లు సిద్ధంగా ఉన్నారని డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ దాస్ తెలిపారు. ఇందులో పురుషులు, మహిళలు ఇద్దరు ఉన్నారని చెప్పారు. 18 ఏళ్లకు పైబడిని వారిని మాత్రమే తీసుకున్నామని వివరించారు. వారికి వ్యాక్సిన్ ఇచ్చి పంపివేస్తామని.. మొదటి రోజు, 29వ రోజు 0.5 ఎంఎల్ ఇంజెక్షన్ ఇస్తామని తెలిపారు. తర్వాత 59వ రోజు 180 వ రోజు పరిశీలిస్తామని పేర్కొన్నారు.

ఫేజ్-1, ఫేజ్-2
ఫేజ్ 1, ఫేజ్ 2లో ప్రాథమికంగా వ్యాక్సిన్ ప్రయోగం చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారిని మాత్రమే తీసుకొని ఇస్తున్నారు. బ్రిటన్, బ్రెజిల్, అమెరికా, సౌతాఫ్రికా దేశాల్లో కూడా హ్యుమన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. మూడో దశలో బీపీ, షుగర్ ఇతర వ్యాధులు ఉన్నవారిపై ప్రయోగిస్తామని ఇదివరకే శాస్త్రవేత్తలు తెలిపారు. వ్యాక్సిన్ వేశాక టీ సెల్ 14 రోజుల్లో స్పందిస్తుందని.. యాంటీ బాడీ 28 రోజుల్లో రియాక్టవుతోందని తెలిపారు. ఇప్పటికే యాంటీ బాడీస్ తీసుకున్నవారిపై హ్యుమన్ ట్రయల్ చేయమని దాస్ స్పష్టంచేశారు.

7 నెలల్లో క్లినికల్ ట్రయల్స్..
క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ 7 నెలల్లో పూర్తిచేస్తామని దాస్ తెలిపారు. జీరో నుంచి మొదటి నెల ట్రయల్ కోసం వాలంటీర్ల పేర్లను నమోదు చేస్తున్నామని తెలిపారు. ట్రయల్స్ చేయడం వల్ల ఢిల్లీలో గల ఐసీఎంఆర్ తమకు రూ.55 లక్షలు అందజేస్తుందని చెప్పారు. ఆర్ఎంఆర్ఐ పాటు ముంబైలో గల కేఈఎం, చండీగడ్‌లోని పీజీఐఎంఈఆర్, పుణెలోని జహంగీర్ ఆస్పత్రి, ఢిల్లీ ఎయిమ్స్, గోరఖ్ పూర్ ఐసీఎంఆర్, నాగ్ పూర్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఉన్నాయి.












Click it and Unblock the Notifications