ఫోన్ సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై యాసిడ్ పోసిన భర్త..?
దేశవ్యాప్తంగా యాసిడ్ దాడులు, గృహ హింస, వేధింపులు వంటి ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అందుకు ఉదాహరణగా లేటెస్ట్ గా చోటు చేసుకున్న ఈ ఘటనే చెప్పుకోవాలి. మొబైల్ ఫోన్‌లో ఉన్న సౌండ్ తగ్గించాలని కోరినందుకు భర్త తన భార్యపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఈ నెల 19న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ దారుణ ఘటన ఉత్తర బెంగళూర్‌లోని సిదేదహల్లిలోని ఎన్ఎంహెచ్ లేఅవుట్‌లో చోటు చేసుకుంది. ఈ దాడి ఘటనలో మహిళ తల, ముఖంపై తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ప్రాణాపాయం నుంచి కోలుకున్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే...

సిదేదహల్లిలో నివసిస్తున్న భర్తతో కలిసి నివసిస్తుంది. బ్యూటిషియన్ గా పనిచేస్తుంది. 19వ తేదీ నాడు రాత్రి 9 గంటల సమయంలో మద్యం కొనుగోలు కోసం డబ్బులు అడిగినట్లు ఆరోపించింది. అందుకు నిరాకరించడంతో తనను వేధించడం మొదలు పెట్టాడని.. చివరకు డబ్బులు సంపాదించుకుని మద్యం కొనుగోలు చేసినట్టు వివరించింది. అయితే తాగి ఇంటికి వచ్చిన తర్వాత.. మొబైల్ ఫోన్‌లో ఎక్కువ వాల్యూమ్‌తో పాటలు ప్లే చేయడం ప్రారంభించాడని.. సౌండ్ తగ్గించాలని కోరినందుకు నిరాకరించాడని వాపోయింది.
దీంతో వారి మధ్య వాగ్వాదం జరగగా.. బాత్‌రూం నుంచి టాయిలెట్ యాసిడ్ క్లీనర్ తీసుకువచ్చి తల, ముఖంపై పోశాడని ఫిర్యాదులో పేర్కొంది. కేకలు వేయడంతో స్థానికులు గమనించి ఆస్పత్రిలో చేర్చినట్టు వాపోయింది. అయితే దాడి తర్వాత భర్త అక్కడ నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. పరారీలో ఉన్న భర్త కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications