• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మొగుడు కాదు మృగాడు: పొర్న్ వీడియోల భంగిమల్లో భార్య, బ్లాక్ మెయిల్, రూ. 50 లక్షలు!

|

పుదుచ్చేరి: కట్టుకున్న భార్య అశ్లీల వీడియోలు, ప్రైవేట్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న భర్తను పుదుచ్చేరీ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే రూ. 50 లక్షలు కట్నం తీసుకున్న భర్త కట్టుకున్న భార్య శీలం అత్తమామల దగ్గర వేలానికి పెట్టాడు. భర్త వేధింపులతో పాటు అత్త, మామల టార్చర్ ఎక్కువ కావడంతో భాదితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృగాడిగా మారిన భర్త మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

పేరుకే టీచర్, ఆ ముసుగులో కామేశ్వరి ఎన్ని అరాచకాలు, సోషల్ మీడియాలో ?!

 ఏడాది క్రితం పెళ్లి

ఏడాది క్రితం పెళ్లి

భారతీనగర్ కు ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువతితో తిరుక్కోవిలూర్ ప్రాంతానికి చెందిన కార్తీక్ కు ఏడాది క్రితం పెళ్లి జరిగింది. యువతి కుటుంబ సభ్యులు పెళ్లి ఘనంగా చేశారు. కార్తీక్ తమ కుమార్తెను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారని యువతి కుటుంబ సభ్యులు మురిసిపోయారు.

రూ. 50 లక్షలు కట్నం, నగలు

రూ. 50 లక్షలు కట్నం, నగలు

పెళ్లి సమయంలో యువతి కుటుంబ సభ్యులు కార్తీక్ కు రూ. 50 లక్షల కట్నంతో పాటు, బంగారు నగలు, విలువైన వస్తువులు తీసిచ్చారు. యువతి కుటుంబ సభ్యులు ఇచ్చిన కట్నకానుకలు తీసుకున్న కార్తీక్ మొదట భార్యను భాగానే చూసుకున్నాడు. కార్తీక్ కుటుంబ సభ్యులు సైతం యువతితో మొదట భాగానే ఉన్నారు.

వంట రుచిగా చెయ్యడం రాదని!

వంట రుచిగా చెయ్యడం రాదని!

కార్తీక్ రానురాను భార్య మీద కోపం చేసుకోవడం మొదలు పెట్టాడు. కోడలు రుచిగా వంట చెయ్యడం లేదని కార్తీక్ తండ్రి గోవిందరాజ్, అత్త మల్లిక, కార్తీక్ సోదరి శ్రీప్రియ తిట్టడం మొదలు పెట్టారు. అత్తమామలు, ఆడపడుచు తిట్లదండకం తట్టుకోలేని కోడలు ఇంటిలో జరుగుతున్న తతంగం గుర్తించి భర్త కార్తీక్ కు చెప్పింది. అయితే కార్తీక్ మాత్రం భార్య మాటలు పెద్దగా పట్టించుకోలేదు.

మొగుడు కాదు మృగాడు

మొగుడు కాదు మృగాడు

మా అమ్మానానల గురించి చెడుగా చెబుతావా, నీకు ఎంత ధైర్యం అంటూ కార్తీక్ భార్య మీద ఇష్టం వచ్చినట్లు తిట్టడం మొదలు పెట్టాడు. అంతే కాకుండా కొంత కాలంగా భార్య బాత్ రూంలో, బెడ్ రూంలో ఉండే సమయంలో ప్రైవేట్ దృశ్యాలను కార్తీక్ అతని మొబైల్ లో వీడియోలు తీశాడు.

చెప్పినట్లు చెయ్యాలి!

చెప్పినట్లు చెయ్యాలి!

భార్య ప్రైవేట్ వీడియోలు తీసిన కార్తీక్ తాను, తన తల్లిదండ్రులు చెప్పినట్లు చెయ్యాలని, మా మాట వినాలని, లేదంటే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలు పెట్టాడు. వీడియోలు చూసి ఆందోళనకు గురైన భార్య భర్త కార్తీక్ చెప్పినట్లు వినింది.

పొర్న్ వీడియోలు చూపించి!

పొర్న్ వీడియోలు చూపించి!

భార్యకు పొర్న్ వీడియోలు చూపించిన కార్తీక్ అందులో ఉన్నట్లు చెయ్యాలని ఒత్తిడి చేశాడు. సెక్స్ భంగిమల్లో భర్త చెప్పినట్లు చేస్తున్న భార్య ప్రైవేట్ వీడియోలను రహస్యంగా చిత్రీకరించిన కార్తీక్ ఆమెను మరింతగా వేధింపులకు గురి చేశాడు. ఇంకా తనకు ఇంకా రూ. 50 లక్షలు కట్నం కావాలని, లేదంటే నీ వీడియోలు మొత్తం సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, మీ కుటుంబం పరువు పోతుందని బెదిరింపులకు గురి చేశాడు.

ఈ టార్చర్ తట్టుకోలేను!

ఈ టార్చర్ తట్టుకోలేను!

కార్తీక్ టార్చర్ రోజురోజుకూ ఎక్కువ కావడంతో ఇక తాను తట్టుకోలేనని, పుట్టింటికి వచ్చేస్తానని భాదితురాలు ఆమె తల్లిదండ్రుల దగ్గర విలపించింది. యువతి కుటుంబ సభ్యులు తిరుక్కోవిళూరు మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కార్తీక్, అతని తల్లిదండ్రులు గోవిందరాజ్, మల్లిక, కార్తీక్ సోదరి శ్రీప్రియను అరెస్టు చేశారు. కార్తీక్ మొబైల్ స్వాధీనం చేసుకుని అందులోని వీడియోలు డిలీట్ చేశామని పోలీసులు అన్నారు. కార్తీక్ కు సహకరించిన మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

English summary
Sexual harassment, private videos, blackmail: Husband arrest sexval herasment wife in Puducheri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X