Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

థాయ్ లాండ్ హనీమూన్ ఫోటోలు లీక్ చేస్తానని ?, ఐటీ హబ్ భార్యకు షాక్, ఏడాదికే సైకో సీన్ !

బెంగళూరు: భార్య భర్తలు అంటే కొందరిలో గొడవలు జరగడం సహజం, దంపతుల మధ్య అభిప్రాయాలు కుదరక గొడవ పడటం పలు సందర్బాల్లో జరుగుతూనే ఉంటాయి. ఒక వేళ భార్య (wife) మాట వినకపోతే కొన్ని సార్లు భర్తలు హద్దు మీరి బెదిరింపులకు (Blackmail)పాల్పడుతుంటారు. పెళ్లైన కొన్నాళ్ల తర్వాత భర్త నిజ స్వరూపం బయట పడటంతో మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్న భార్య షాక్‌కు గురైంది.

డబ్బుల కోసం, విలాసవంతమైన జీవితం గడిపే విషయంలో భార్యను (wife)బ్లాక్ మెయిల్ చేసిన భర్త ఉద్దరగా ఆమె డబ్బులు లాక్కోవడానికి అనేకప ప్రయత్నాలు చేశాడు. తనకు డబ్బులు కావాలని భార్యను డిమాండ్ చేశాడు. తాను చెప్పినట్లు వినకపోతే తాను తీసిన నీ ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా, నీ ఉద్యోగం ఊడిపోయి రోడ్డున పడుతావని భార్యను బెదిరింపులకు (Blackmail) గురి చేసిన ఘటన బెంగళూరులో (Bengaluru) కలకలం రేపింది.

Husband Blackmails Wife With Thailand Honeymoon Videos For Rs 10 Lakhs, Salary Money

ఎలాంటి తాగుబోతు అయినా, తిరుగుబోతు భర్త అయినా అతని భార్య (wife) పరువు తీయాలని సామాన్యంగా అనుకోడు, భార్యతో గడిపిన మధుర క్షణాలు, ఆమె తాలూకా ప్రవైట్ పిక్స్ ను బయటపెట్టాలని ఎలాంటి భర్త అనుకోడు. కానీ ఇక్కడ ఓ శాడిస్టు మాత్రం అదే చెయ్యాలని అనుకున్నాడు. అంతే కాకుండా డబ్బుల కోసం కట్టుకున్న భార్యను బ్లాక్ మెయిల్ (Blackmail)చెయ్యడానికి పాల్పడ్డాడు.

తనతో భార్య ఏకాంతంగా ఉన్న సమయంలో రహస్యంగా తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని భార్యను బెదిరించిన (Blackmail) ఘటన వెలుగులోకి రావడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు, ఆమె బందువులు, స్నేహితులు హడలిపోయారు. తన భర్త తనతో సన్నిహితంగా ఉంటూ తనకు తెలీకుండానే తనతో మద్యం తాగించాడని, ఆ సందర్బంలో కొన్ని నీలి చిత్రాలను చూపించాడని, ఆ సందర్బంలో తన భర్త ఫోన్లో వీడియోలు రికార్డు చేశాడని ఓ భార్య (wife) ఆరోపించింది.

తన భార్య శాడిస్టులా తయారై తనకు చిత్రహింసలు పెడుతున్నాడని బెంగళూరు సిటీలో ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్న మహిళ ఆమె (lady) భర్త పై మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. బెంగళూరులోని (Bengaluru) బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతులు నివాసం ఉంటున్నారు. గతేడాది నవంబర్ లో వీరి వివాహం జరిగింది.

Husband Blackmails Wife With Thailand Honeymoon Videos For Rs 10 Lakhs, Salary Money

వివాహం అనంతరం నూతన దంపతులు థాయిలాండ్ కు (Thailand) హనీమూన్ కు ( honeymoon) వెళ్లారు. హనీమూన్ కు వెళ్లిన సమయంలో తన భర్త తనతో చాలా సన్నిహితంగా ఉన్నాడని, ఆ సమయంలో బెడ్ రూమ్ లో తనకు తెలీకుండా రహస్యంగా వీడియోలు తీశాడని, ఇప్పుడు తన ప్రైవేట్ వీడియోలు తనకే చూపించి బెదిరింపులకు (Blackmail) దిగుతున్నాడని అతని భార్య బెంగళూరులోని బసవనగుడి మహిళా (wife) పోలీసులకు చెప్పింది.

అంతటితో ఆగకుండా ఆ వీడియోలను తనకు చూపించి నగదు ఇవ్వాలని తన భర్త డిమాండ్ చేస్తున్నాడని భార్య ఆరోపించింది. బెంగళూరుకు (Bengaluru) తిరిగి వచ్చిన తర్వాత తనకు రూ 10 లక్షలు ఇవ్వాలని, ప్రతినెల తనకు వచ్చే జీతం మొత్తం తనకే ఇవ్వాలని ఉద్యోగం చేస్తున్న తనను తన భర్త బెదిరించాడని, అడిగిన నగదు ఇవ్వకపోతే నీ నగ్న వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని తన భర్త బ్లాక్ మెయిల్ (Blackmail) చేస్తున్నాడని అతని భార్య (wife)పోలీసుల ముందు ఆవేదన వ్యక్తం చేసింది.

Husband Blackmails Wife With Thailand Honeymoon Videos For Rs 10 Lakhs, Salary Money

తనకు సొంత నిర్మాణ సంస్థ ఉందని పెళ్లికి ముందు చెప్పిన భర్త నిజానికి అతడికి ఎలాంటి ఉద్యోగం లేదని, వివాహం తర్వాత తాను మోసపోయానని తెలుసుకున్నానని ఆమె పోలీసులకు వివరించింది. తమ కుమార్తెను బ్లాక్ మెయిల్ (Blackmail)చేస్తున్న తమ అల్లుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి (wife) తల్లిదండ్రులు బెంగళూరు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.

ఎంతో నమ్మి తన కుమార్తెను ఇచ్చి చాలా గ్రాండ్ గా వివాహం చేస్తే ఇలాంటి బెదిరింపులకు (Blackmail)పాల్పడటం సరికాదని, ఇలాంటి నీచుడిని వదిలిపెట్టకూడదని, వీడిని ఇలాగే వదిలేస్తే ఇలాంటి శాడిస్టులు ఇంకా తయారు అవుతారని, అతనికి తగిన గుణపాఠం చెప్పాలని బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు, బంధువులు బెంగళూరు (Bengaluru) పోలీసులకు మనవి చేశారు. కేసు విచారణలో ఉందని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+