భర్త పాఠశాలకు వెళ్లగానే భార్య మరొక మగాడితో.., సీసీటీవీ ఫుటేజితో వెలుగులోకి..
Recommended Video

పూణే : భర్త డ్యూటీపై వెళ్లగానే భార్య మరో వ్యక్తితో గుట్టుగా అక్రమ సంబంధం సాగిస్తోన్న ఉదంతమిది. అయితే ఆమె రాసలీలలు భర్త అమర్చిన రహస్య సీసీటీవీ ఫుటేజ్ లో వెలుగుచూశాయి. ఈ ఘటన మహారాష్ట్ర పూణే నగరంలోని అంబేగామ్ ప్రాంతంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే...
చదవండి: నెలరోజులే పని, మూడు నెలలుగా వ్యభిచారం, ఏజెంట్ మనుషులే బలవంతంగా...
పూణే నగరానికి చెందిన ఓ యువకుడు ఓ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. 2007 మార్చిలో ఓ యువతితో హిందూ సంప్రదాయం ప్రకారం అతడికి వివాహమైంది. వీరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. అయితే అతడికి తన భార్య వ్యవహారశైలిపై అనుమానం వచ్చింది.
ఇదిలా ఉండగా, అతడి భార్య ఓ రోజు ఇంటి నుంచి పారిపోయి మూడురోజుల తర్వాత తిరిగివచ్చింది. భర్తతో కొట్లాడి వేరు కాపురం పెట్టించడంతోపాటు ప్రతి విషయంలో ఆమె భర్తతో గొడవపడుతుండేది. తాను పాఠశాలకు వెళ్లిన తర్వాత రోజూ తమ ఇంటికి మరో వ్యక్తి వస్తున్నాడని తన కుమారుడి మాటల ద్వారా గ్రహించిన భర్త తన భార్య ఆటకట్టించాలని నిశ్చయించుకున్నాడు.

భార్యకు తెలియకుండా ఇంట్లోని అన్ని గదుల్లో రహస్యంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయించాడు. ఓరోజు పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చినతరువాత ఆ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన భర్తకు దిమ్మతిరిగిపోయింది.
అతడి భార్య మరో వ్యక్తితో సాగిస్తున్న రాసలీలలు వాటిలో రికార్డయి ఉన్నాయి. దీంతో అతడు కోర్టుకెక్కాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చూపుతూ తనను మోసగించి మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య నుంచి విడాకులు కోరాడు.
అయితే అతడి భార్య మాత్రం తనకు విడాకులు ఇస్తే ఆత్మహత్య చేసుకుంటానంది. తనకు మనోవర్తి ఇవ్వాలని, లేదంటే గృహహింస చట్టం కింద తాను కేసు పెడతానని భార్య బెదిరించింది. దీంతో ఆమె భర్త తన వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ సాక్ష్యంతో కోర్టును ఆశ్రయించాడు.
ఆ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన కోర్టు భార్య ఫిర్యాదును తోసిపుచ్చింది. భర్తకు విడాకులు మంజూరు చేయడమేకాకుండా.. భార్యతోపాటు ఆమె ప్రియుడిపై కూడా కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications