నెలరోజులే పని, మూడు నెలలుగా వ్యభిచారం, ఏజెంట్ మనుషులే బలవంతంగా...

దుబాయ్: ఉన్న ఊళ్లో ఉపాధి కరువై, కుటుంబ పోషణ కోసం దుబాయ్ వెళ్లిన ఓ భారతీయ మహిళను ఏజెంట్ మనుషులే మోసం చేశారు. నెల రోజులపాటు పని ఇప్పించి, ఆపైన బలవంతంగా వ్యభిచారంలోకి దించిన ఉదంతమిది.

చదవండి: భర్త పాఠశాలకు వెళ్లగానే భార్య మరొక మగాడితో.., సీసీటీవీ ఫుటేజితో వెలుగులోకి..

ఎదుగుతున్న పిల్లలకు అన్ని సౌకర్యాలు సమకూర్చాలని ఆమె(45) తాపత్రయపడింది. తన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందనే గంపెడాశతో ఎంత కష్టమైనా భరించేందుకు సిద్ధమై దుబాయ్ వెళ్లింది. ఆమె అవసరాలను ఆసరాగా తీసుకుని ఓ గల్ఫ్ ఏజెంట్ ఆమెను మోసం చేశాడు.

woman-prostitution

అయితే అక్కడికెళ్లేంత వరకు తాను ఓ నిప్పుల కుంపటిలోకి అడుగుపెడుతున్నానని ఆమెను అణువంత అనుమానం కూడా కలగలేదు. దుబాయ్‌లో నెలరోజులపాటు ఓ చోట పనిచేసింది. తరువాత పని లేదన్నారు. అంతేకాదు, వ్యభిచారం చేయాల్సిందిగా ఆమెను తీవ్ర ఒత్తిడి చేశారు.

ఏజెంట్ మనుషులే ఓ అపార్ట్‌మెంట్‌లో రూమ్ అద్దెకు తీసుకుని ఆమెతో ఆ పని చేయించారు. నాలుగు నెలల క్రితం ఆమె దుబాయ్ వెళ్లింది. మూడు నెలలుగా ఏజెంట్ మనుషులు ఆమెతో వ్యభిచారం చేయిస్తున్నారు. ఇటీవల పోలీసులు ఆ అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి, ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.

ఆ అపార్ట్ మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతోనే తాము రైడ్ చేశామని, ఓ భారతీయ మహిళ వ్యభిచారం చేస్తోందని తెలిసి ఆమెను అదుపులోకి తీసుకున్నామని, ఆమెతో ఆ పని చేయిస్తున్న ఇద్దరు వ్యక్తుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+