అక్రమ సంబంధం, భార్య ముక్కు కోసేసి జోబులో పెట్టుకుని పరారైన భర్త!

లక్నో/ఉత్తరప్రదేశ్: వివాహం చేసుకున్న భర్త అతని భార్యతో చక్కగా కాపురం చేశాడు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యతో హ్యాపీగా తిరుగుతున్న భర్త ఆమెను శుభకార్యాలకు పిలుచుకుని వెలుతున్నాడు. ఇదే సమయంలో ఓ శుభకార్యంలో భర్తకు ఓ వివాహిత మహిళ పరిచయం కావడంతో అదికాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. అక్రమ సంబంధానికి భార్య అడ్డుపడటంతో రగిలిపోయిన భర్త అతని భార్య ముక్కు కోసేసి ఆ ముక్కును జోబులో పెట్టుకుని ఎస్కేప్ అయ్యాడు.

ఉత్తరప్రదేశ్ లోని లఖీంపుర ఖేరి జిల్లాలోని మిథౌలి సమీపంలోని బన్సాలి గ్రామంలో విక్రమ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 12 సంవత్సరాల క్రితం సీమాదేవి అనే మహిళను విక్రమ్ పెళ్లి చేసుకున్నాడు. భార్య సీమాదేవితో సంతోషంగా కాపురం చేసిన విక్రమ్ ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. పిల్లలతో కలిసి విక్రమ్, సీమాదేవి దంపతులు చాలా సంతోషంగా ఉండేవాళ్లు.

Husband flees for wifes nose due to illicit relationship in Uttar Pradesh

భార్య సీమాదేవితో కలిసి విక్రమ్ బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో జరుగుతున్న శుభకార్యాలకు వెళ్లి వస్తున్నాడు. ఇదే సమయంలో గత ఏడాది ఓ శుభకార్యంలో వివాహిత మహిళ విక్రమ్ కు పరిచయం అయ్యింది. ఇద్దరు ఫోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. రానురాను వివాహిత మహిళను నేరుగా కలవడం మొదలుపెట్టిన విక్రమ్ ఆమె మోజులో పడిపోయాడు.

తరువాత వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న విక్రమ్ ఆమెతో ఎక్కువ సమయం కేటాయిస్తూ భార్య సీమాదేవితో పాటు ఇద్దరు పిల్లలను నిర్లక్షం చెయ్యడం మొదలుపెట్టాడు. భర్త విక్రమ్ అక్రమ సంబందం గురించి తెలుసుకున్న సీమాదేవి భర్తను నిలదీసింది. వివాహిత మహిళతో అక్రమ సంబంధం మానుకోవాలని సీమాదేవి ఆమె భర్తను హెచ్చరించింది.

ఇదే విషయంలో విక్రమ్ సీమాదేవి దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. భార్య మీద కోపం పిల్లల మీద చూపిస్తున్న విక్రమ్ అతని భార్య నోరు మూయించాలని ప్రయత్నించాడు. ఇదే సమయంలో నాలుగేళ్ల కుమారుడు విక్రమ్ మొబైల్ తీసుకుని ఆడుకుంటున్నాడు. తన మొబైల్ ఇవ్వాలని విక్రమ్ అతని కొడుక్కి చెప్పాడు.

Husband flees for wifes nose due to illicit relationship in Uttar Pradesh

అయితే ఆ బాలుడు మొబైల్ ఫోన్ ఇవ్వకపోవడంతో విక్రమ్ అతన్ని చితకబాదేశాడు. కొడుకు మీద దాడి చేస్తున్నాడని సీమాదేవి అడ్డుపడటంతో విక్రమ్ ఆమెను కూడా చితకబాదేశాడు. తరువాత ఇంట్లో ఉన్న కత్తి తీసుకున్న విక్రమ్ అతని భార్య సీమాదేవి ముక్కు కోశాడు. భార్య ముక్కు జోబులో పెట్టుకున్న విక్రమ్ అక్కడి నుంచి పరారైనాడు. స్థానికులు అంబులెన్స్ లో సీమాదేవిని మిథౌలి ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందిన తరువాత సీమాదేవి ఆమె భర్త విక్రమ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ముక్క కోసి పరారైనా విక్రమ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ సంబంధం కారణంగానే విక్రమ్ అతని భార్య సీమాదేవి ముక్కును కోసేశాడని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+