Husband: భార్య డాక్టర్, భర్త ప్రభుత్వ డాక్టర్, తేడాతో విడాకులు, స్టార్ హోటల్ లో విషం ఇంజెక్షన్ తో !

చెన్నై/ మదురై: ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి డాక్టర్ గా పని చేస్తున్న మహిళను వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ డాక్టర్లు కావడంతో దంపతులు సంతోషంగా జీవనం సాగించాలని అనుకున్నారు. అయితే వివాహం చేసుకున్న తరువాత దంపతులు కొంతకాలం మాత్రమే సంతోషంగా జీవించారు. రానురాను దంపతుల మద్య తేడాలు వచ్చాయి. డాక్టర్ దంపతులు విడిపోయారు. వేర్వేరు సిటీల్లో దంపతులు నివాసం ఉంటున్నారు. డ్రైవర్ తో కలిసి కారులో స్టార్ హోటల్ కు వెళ్లిన భర్త నేను ఫోన్ చేసిన తరువాత నువ్వు ఇక్కడికే రావాలని చెప్పి కారు డ్రైవర్ ను అక్కడి నుంచి పంపించేశాడు. ఫ్రెండ్ ఫోన్ చేసినా ఆ డాక్టర్ ఫోన్ రిసీవ్ చెయ్ల్యలేదు. స్నేహితుడు, కారు డ్రైవర్ వెళ్లి స్టార్ హోటల్ లోని రూమ్ ను నకిలీ తాళంతో తీసి చూడగా అందరూ షాక్ అయ్యారు. విషం ఇంజెక్షన్ వేసుకున్న ప్రభుత్వ వైద్యుడు స్టార్ హోటల్ బెడ్ మీద శవమై కనిపించడం కలకలం రేపింది.

 ప్రభుత్వ డాక్టర్

ప్రభుత్వ డాక్టర్

చెన్నై సిటీలోని రాయ్ పేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో మహేశ్వర్ (34) ప్రభుత్వ వైద్యుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. రాయ్ పేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో సర్జరీ విభాగంలో సర్జన్ గా పని చేస్తున్న మహేశ్వర్ కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. డాక్టర్ గా పని చేస్తున్న మహేశ్వర్ కు డాక్టర్ అమ్మాయి కావాలని అతని కుటుంబ సభ్యులు పెళ్లి సంబందాలు చూశారు.

 భార్య కూడా డాక్టర్..... దంపతుల మద్య తేడాలు

భార్య కూడా డాక్టర్..... దంపతుల మద్య తేడాలు

కొన్ని సంవత్సరాల క్రితం డాక్టర్ గా పని చేస్తున్న నందిని అనే యువతిని మహేశ్వర్ వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ డాక్టర్లు కావడంతో మహేశ్వర్, నందిని దంపతులు సంతోషంగా జీవనం సాగించాలని అనుకున్నారు. అయితే వివాహం చేసుకున్న తరువాత మహేశ్వర్, నందిని దంపతులు కొంతకాలం మాత్రమే సంతోషంగా జీవించారు. రానురాను నందిని, మహేశ్వర్ దంపతుల మద్య తేడాలు వచ్చాయి.

 విడిపోయిన డాక్టర్ దంపతులు

విడిపోయిన డాక్టర్ దంపతులు

మహేశ్వర్, నందిని కుటుంబ సభ్యులు ఇద్దరికి రాజీ చెయ్యాలని అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. రోజూ గొడవలు పడటం కంటే విడిపోవడం మేలు అని మహేశ్వర్, నందిని దంపతులు అనుకున్నారని సమాచారం. తరువాత డాక్టర్ మహేశ్వర్, డాక్టర్ నందిని దంపతులు విడిపోయారు. మదురైలో డాక్టర్ మహేశ్వర్ ఒంటరిగా నివాసం ఉంటున్నాడు.

 స్టార్ హోటల్ కు వెళ్లిన డాక్టర్

స్టార్ హోటల్ కు వెళ్లిన డాక్టర్

డాక్టర్ మహేశ్వర్ కారులో అతని డ్రైవర్ తో కలిసి చెన్నై చేరుకున్నాడు. చెన్నై సిటీలోని ఓ స్టార్ హోటల్ కు వెళ్లిన డాక్టర్ మహేశ్వర్ అక్కడ రూమ్ అద్దెకు తీసుకున్నాడు. నేను ఫోన్ చేసిన తరువాత నువ్వు ఇక్కడికే రావాలని చెప్పిన డాక్టర్ మహేశ్వర్ తరువాత అతని కారు డ్రైవర్ ను అక్కడి నుంచి పంపించేశాడు.

 డాక్టర్ ఫ్రెండ్ కు అనుమానం

డాక్టర్ ఫ్రెండ్ కు అనుమానం

మహేశ్వర్ చెన్నై వచ్చాడని అతని ఫ్రెండ్ కు తెలిసింది. ఫ్రెండ్ ఫోన్ చేసినా డాక్టర్ మహేశ్వర్ ఫోన్ రిసీవ్ చెయ్ల్యలేదు. తరువాత స్నేహితుడు డాక్టర్ మహేశ్వర్ కారు డ్రైవర్ కు ఫోన్ చేశాడు. ప్రైవేట్ స్టార్ హోటల్ లో డాక్టర్ మహేశ్వర్ రూమ్ తీసుకుని ఉన్నాడని, తనను వెళ్లిపోవాలని చెప్పాడని కారు డ్రైవర్ డాక్టర్ స్నేహితుడికి సమాచారం ఇచ్చాడు.

 విషం ఇంజెక్షన్ వేసుకుని డాక్టర్ ఆత్మహత్య

విషం ఇంజెక్షన్ వేసుకుని డాక్టర్ ఆత్మహత్య

డాక్టర్ మహేశ్వర్ స్నేహితుడు, కారు డ్రైవర్ వెళ్లి స్టార్ హోటల్ లోని రూమ్ తలుపు తియ్యాలని చెప్పారు. మహేశ్వర్ నుంచి ఎలాంటి స్పందనలేకపోవడంతో నకిలీ తాళంతో తలుపులు తీసి చూడగా అందరూ షాక్ అయ్యారు. విషం ఇంజెక్షన్ వేసుకున్న ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ మహేశ్వర్ స్టార్ హోటల్ బెడ్ మీద శవమై కనిపించడం కలకలం రేపింది. కుటుంబ గొడవలతో డాక్టర్ మహేశ్వర్ ఆత్మహత్య చేసుకున్నాడా ?, మరేమైనా కారణాలు ఉన్నాయా ? అనే విషయం తెలీదని, కేసు విచారణలో ఉందని చెన్నై సిటీ పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+