వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Illegal affair: అమెరికాలో భార్య, జాయింట్ అకౌంట్ లో రూ. 1.20 కోట్లతో భర్త ఎస్కేప్, ప్రియురాలితో జల్సా !

|
Google Oneindia TeluguNews

కొచ్చి/నేపాల్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. భర్త సొంత ఊర్లో ఉన్నాడు. భార్య అమెరికా వెళ్లి మంచి ఉద్యోగం చేస్తున్నది. విదేశాల్లో ఉన్న భార్య, సొంత ఊర్లో ఉన్న భర్త పేరుతో బ్యాంకులో జాయింట్ అకౌంట్ ఉంది. ప్రతినెల భార్య భర్త, ఆమె పేరుతో ఉన్న జాయింట్ లో రూ. లక్షలు లక్ష్లలు డిపాజిట్ చేసింది. సొంత ఊర్లో భర్త జాయింట్ అకౌంట్ ఉన్న డబ్బులు డ్రా చేసుకుని పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు. అమెరికాలో ఉన్న భార్యకు డౌట్ వచ్చి జాయింట్ అకౌంట్ లో డబ్బులు ఎంత బ్యాలెన్స్ ఉంది అని చెక్ చేసింది. అంతే ఒక్కసారిగా భార్య మైండ్ బ్లాక్ అయ్యింది. భర్త పేరు, తన పేరుతో ఉన్న జాయింట్ అకౌంట్ లో ఏకంగా రూ. 1.50 కోట్లు మాయం అయ్యిందని తెలుసుకుని షాక్ అయ్యింది. తన భర్త ఆ డబ్బు ఏం చేశాడు అని భార్య ఆరా తీసింది. ఇదే సమయంలో భర్త వేరే ఊరిలో ఉన్న మరో మహిళ పేరుతో ఏకంగా రూ. 1.20 కోట్లు ట్రాన్స్ ఫర్ చేశాడని తెలుసుకుని బిత్తరపోయింది. భార్య ఎక్కడ ఉన్నాడు అని భార్య ఆరా తీసింది. నేపాల్ లో తన భర్త అతని ప్రియురాలితో ఎంజాయ్ చేస్తూ నేనను పంపించిన డబ్బుతో జల్సాలు చేస్తున్నాడని తెలుసుకుని రగిలిపోయింది. ఈ దెబ్బతో అమెరికాలోనే కుర్చున్న భార్య ఏం చెయ్యాలో అది చేసింది. ప్రియురాలితో కలుకుతున్న భర్తకు ఇప్పుడు త్రీడీ సినిమా కనపడింది.

Illegal affair: ప్రియురాలిని ఇంటికే పిలుచుకుని వెళ్లాడు, భార్య సైలెంట్, కూతురు రివర్స్, క్లైమాక్స్ లో !Illegal affair: ప్రియురాలిని ఇంటికే పిలుచుకుని వెళ్లాడు, భార్య సైలెంట్, కూతురు రివర్స్, క్లైమాక్స్ లో !

భార్య నర్సు

భార్య నర్సు

కేరళలోని అలప్పుజ జిల్లాకు చెందిన రీటా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ, కేరళలోని కోజికోడ్ లోని కొడంచేరి వెలంకోడ్ ప్రాంతానికి చెందిన సిజు (52) అనే వ్యక్తికి కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. వివాహం చేసుకున్న తరువాత దంపతులు సంతోషంగా జీవించారు. నర్సుగా కేరళలోనే ఉద్యోగం చేసిన రీటా భర్తతో కలిసి సంతోషంగా ఉండేది.

అమెరికాలో ఉద్యోగం

అమెరికాలో ఉద్యోగం

కొన్ని సంవత్సరాల క్రితం రీటాకు అమెరికాలోని ప్రముఖ ఆసుపత్రిలో ఉద్యోగం వచ్చింది. లక్షల్లో జీతం వస్తోందని రీటా అమెరికా వెళ్లిపోయింది. రీటాను వివాహం చేసుకున్న సిజు కేరళలోని సొంత ఊర్లో ఉన్నాడు. భార్య రీటా అమెరికా వెళ్లి మంచి ఉద్యోగం చేస్తుంటే భర్త ఇక్కడే వ్యాపారం చేస్తున్నాడు. విదేశాల్లో ఉన్న రీటా, సొంత ఊర్లో ఉన్న ఆమె భర్త సిజు పేరుతో అమెరికాలోని ప్రముఖ బ్యాంకులో జాయింట్ అకౌంట్ ఉంది.

 జాయింట్ అకౌంట్ లో డబ్బులు

జాయింట్ అకౌంట్ లో డబ్బులు

ప్రతినెల రీటా, ఆమె భర్త సిజు పేరుతో ఉన్న బ్యాంక్ జాయింట్ లో రూ. లక్షలు లక్ష్లలు డిపాజిట్ చేసింది. సొంత ఊర్లో ఉన్న టీరా భర్త సిజు జాయింట్ అకౌంట్ ఉన్న డబ్బులు డ్రా చేసుకుని పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు. చాలాకాలం నుంచి కేరళలో ఉన్న సిజు ఆడిందే ఆటగా పాడిందే పాటగా తయారైయ్యింది.

 రూ. 1.50 కోట్లు మాయం.....భార్యకు డౌట్ వచ్చేసింది

రూ. 1.50 కోట్లు మాయం.....భార్యకు డౌట్ వచ్చేసింది

అమెరికాలో ఉన్న భార్య రీటాకు నా బ్యాంకులో డబ్బులు ఏమైయ్యింది అంటూ డౌట్ వచ్చి జాయింట్ అకౌంట్ లో డబ్బులు ఎంత బ్యాలెన్స్ ఉంది అని చెక్ చేసింది. అంతే ఒక్కసారిగా రీటా మైండ్ బ్లాక్ అయ్యింది. భర్త సిజు, తన పేరుతో ఉన్న జాయింట్ అకౌంట్ లో ఏకంగా రూ. 1.50 కోట్లు మాయం అయ్యిందని తెలుసుకున్న రీటా షాక్ అయ్యింది. తన భర్త సిజు ఆ డబ్బు ఏం చేశాడు అని అతని భార్య రీటా ఆరా తీసింది.

 ప్రియుడికి 52 ఏళ్లు...... ప్రియురాలికి 30 ఏళ్లు

ప్రియుడికి 52 ఏళ్లు...... ప్రియురాలికి 30 ఏళ్లు

ఇదే సమయంలో తన భర్త సిజు కాయంకుళం గోవిందమట్టం ఊరిలో ఉన్న ప్రియాంక (30) అనే మహిళ పేరుతో ఏకంగా రూ. 1.20 కోట్లు ట్రాన్స్ ఫర్ చేశాడని తెలుసుకుని బిత్తరపోయింది. తన భర్త సిజు ప్రియాంకతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని రీటాకు తెలిసిపోయింది. నా భర్త సిజు నన్ను మోసం చేశాడని తెలుకున్న రీటా ఆమె భర్తకు ఫోన్ చేసి నిలదీసింది.

 నేపాల్ లో ప్రియురాలితో భర్త జల్సాలు

నేపాల్ లో ప్రియురాలితో భర్త జల్సాలు

భార్య రీటాకు మ్యాటర్ తెలిసిపోయిందని సిజు అతని ప్రియురాలు ప్రియాంకతో కలిసి జెండా ఎత్తేశాడు. నా భర్త సిజు ఎక్కడ ఉన్నాడు అని రీటా ఆరా తీసింది. నేపాల్ లో తన భర్త సిజు అతని ప్రియురాలు ప్రియాంకతో ఎంజాయ్ చేస్తూ నేను పంపించిన డబ్బుతో జల్సాలు చేస్తున్నాడని తెలుసుకున్న రీటా రగిలిపోయింది. ఈ దెబ్బతో అమెరికాలోనే కుర్చున్న భార్య రీటా పోలీసు కేసు పెట్టింది.

 ఎయిర్ పోర్టులో భర్త, ప్రియరాలు అరెస్టు

ఎయిర్ పోర్టులో భర్త, ప్రియరాలు అరెస్టు

కేరళ పోలీసులు సిజు, అతని ప్రియురాలు ప్రియాంక మీద లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. నేపాల్ నుంచి ఢిల్లీ ఎయిర్ పోర్టు చేరుకున్న సిజు, అతని ప్రియురాలు ప్రియాంకను పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాలోనే మకాం వేసి రీటా ఏం చెయ్యాలో అది చెయ్యడంతో ప్రియురాలు ప్రియాంకతో కలుకుతున్న సిజుకు ఇప్పుడు త్రీడీ సినిమా కనపడింది.

English summary
Illegal affair: Husband sends money to his girlfriend from joint account with his wife in Alappuzha in Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X