బ్యాంకాక్ బాడీ టు బాడీ మసాజ్, లోపల ఏం చేస్తున్నారంటే ?, హైదరాబాద్ యూత్ హైటెక్ స్కెచ్ !
హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న మసాజ్ పార్లర్, స్పా సెంటర్ పై బెంగళూరు సీసీబీ పోలీసులు దాడులు చేసి 44 మంది మహిళలు, 34 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఒక్కొక్కటిగా షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. తెలంగాణ రాజధానిహైదరాబాద్‌కు చెందిన నిందితుడు అనీల్ అలియాస్ అనీల్ బెంజ్ అనిల్ ఈ దందా కింగ్ పిన్ అని వెలుగు చూసింది.
బెంగళూరు నగరంలోని టిన్ ఫ్యాక్టరీ సమీపంలోని ఓల్డ్ మద్రాస్ రోడ్డులో నిర్వాణ ఇంటర్నేషనల్ స్పా ప్రై.లి పేరుతో అనీల్ బెంజ్ హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అనీల్ కొన్నాళ్లుగా వ్యభిచారం నిర్వహిస్తున్నా స్థానిక పోలీసులు ఎవరూ పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి, అయితే సమాచారం తెలుసుకున్న బెంగళూరు సీసీబీ పోలీసు అధికారి ధర్మేంద్ర నేతృత్వంలోని బృందం దాడి చేసి నిందితులను పట్టుకుంది. దాడికి ముందు నెల రోజుల పాటు సీసీబీ బృందం మఫ్టీలో నిందితులను పట్టుకోవడానికి మకాం వేసింది.

హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చిన బెంజ్ అనిల్ మొదట హైటెక్ వ్యభిచార కేంద్రం వ్యాపారం ప్రారంభించాడు. నిర్వాణ స్పా పేరుతో సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యాడు. సోషల్ మీడియాను వినియోగించే వినియోగదారుల కోసం నిందితుడు అనీల్ వల వేస్తున్నాడు. ఈ స్పా సెంటర్ బ్యాంకాక్-స్టైల్ బాడీ-టు-బాడీ మసాజ్ సేవలను అందిస్తుందని పోలీసు అధికారులు తెలిపారు. నిందితుడు అనీల్ బహుళ అంతస్తుల భవనాన్ని అద్దెకు తీసుకుని హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు.
2017 నుండి నిర్వాన్ స్పా నడుస్తోందని, ఇప్పటివరకు ఈ స్పాసెంటర్ మీద ఎటువంటి దాడి జరగలేదని, ఇది ఆశ్చర్యం కలిగిస్తుందని, కొందరు పోలీసుల సహకారంతో ఈ హైటెక్ వ్యభిచార కేంద్రం రాకెట్ జరిగిందని బెంగళూరు సీసీబీ పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. ఐదేళ్ల నుంచి బెంగళూరు సీసీబీ పోలీసులు, స్థానిక పోలీసుల దృష్టికి ఈ విషయం వచ్చిందా ?, లేకపోతే పోలీసు అధికారులు వీళ్లకు నోటీసులందించారా అన్నది విచారణ అనంతరం వెల్లడిస్తామని బెంగళూరు సీసీబీ పోలీసు అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌కు చెందిన నిందితుడు అనీల్ అడవాళ్ల మాంసంతో వ్యాపారం (వ్యభిచారం) చేయించడానికి బెంగళూరుకు వచ్చాడు. ఉద్యోగం పేరుతో వాళ్లకు డబ్బు ఆశ చూపి ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన యువతులకు నిందితులు ఫోన్లు చేసి వారిని లొంగదీసుకున్నాడు. కోవిడ్ కాలంలో అన్ని వ్యాపార నష్టాలు ఉన్నప్పటికీ అనీల్ అలియాస్ బెంజ్ అనీల్ వ్యభిచారం వ్యాపారం మాత్రం పుంజుకుందని పోలీసు అధికారులు అంటున్నారు. కేసు విచారణలో ఉంది.












Click it and Unblock the Notifications