Cinema:హీరోకు డూప్, ఫైటర్ మృతి, స్టార్ హీరో, డైరెక్టర్, నిర్మాతలకు బెయిల్, నిర్లక్షం ప్రాణం తీసింది !
బెంగళూరు: స్యాండిల్ వుడ్ సినిమాలో అజయ్ రావ్, రుచితా రామ్ కు మంచి క్రేజ్ ఉంది. అజయ్ రావ్, రుచితా రామ్ హీరో హీరోయిన్లుగా ఐలవ్ యూ రచ్చు అనే సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఫైటర్ వివేక్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ కేసులో సినిమా హీరో అజయ్ రావ్ తో పాటు సినిమా డైరెక్టర్, నిర్మాత, ఫైట్ మాస్టర్, ప్రోడక్షన్ మేనేజర్, క్రేన్ ఆపరేటర్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఐ లవ్ యూ రచ్చు సినిమా షూటింగ్ సమయంలో నిర్లక్షంగా వ్యవహరించడంతో వివేక్ అనే ఫైటర్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కోవిడ్ నియమాలు పాటించి అన్ని జాగ్రత్తలు తీసుకుని సినిమా షూటింగ్ నిర్వహించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా సినిమా యూనిట్ సభ్యులు నిర్లక్షంగా వ్యవహరించడం వలనే యువకుడి ప్రాణం పోయిందని ఇప్పటికే కేసు నమోదు అయ్యింది. కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే అరెస్టు భయంతో సినిమా హీరో హడలిపోయాడు. చివరికి కోర్టులో బెయిల్ రావడంతో సినిమా హీరోతో పాటు ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

క్రేజీ కాంబినేషన్ లో సినిమా
స్యాండిల్ వుడ్ సినిమా రంగంలో అజయ్ రావ్, రుచితా రామ్ కు మంచి క్రేజ్ ఉంది. అజయ్ రావ్, రుచితా రామ్ హీరో హీరోయిన్లుగా ఐలవ్ యూ రచ్చు అనే సినిమా నిర్మిస్తున్నారు. ప్రమఖ నిర్మాత గురు దేశ్ పాండే ఐ లవ్ యూ రచ్చు సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు శంకర్ రాజ్ అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఫస్ట్ సినిమాతో షాక్
స్యాండిల్ వుడ్ లో అనేక సినిమా డైరెక్టర్ల దగ్గర పని చేసిన శంకర్ రాజ్ అలియాస్ శంకర్ అనే యువకుడు ఐ లవ్ యూ రచ్చు సినిమాతో పూర్తి స్థాయి డైరెక్టర్ గా పని చెయ్యడానికి మొదటి అవకాశం వచ్చింది. తన ప్రతిభతో సినిమాను సూపర్ హిట్ చేసి మరన్ని మంచి సినిమాలు తియ్యాలని దర్శకుడు శంకర్ రాజ్ అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాకు ఫైట్ మాస్టర్ గా వినోద్ పని చేస్తున్నాడు.

బిడిదిలో హంగామా
బెంగళూరు నగరం శివార్లలోని బిడది సమీపంలోని జోగరపాళ్య గ్రామం దగ్గర ఐ లవ్ యూ రచ్చు సినిమా షూటింగ్ జరుగుతోంది. కోవిడ్ నియమాలు పాటిస్తూ సినిమా షూటింగ్ జరుపుకోవడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. ఈనెల 9వ తేదీన సోమవారం యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడానికి సినిమా డైరెక్టర్ శంకర్ రాజ్, ఫైట్ మాస్టర్ వినోద్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సినిమా హీరో అజయ్ రావ్ తో పాటు సినిమా దర్శకుడు, ఫైట్ మాస్టర్, నిర్మాత గురు దేశ్ పాండే సినిమా షూటింగ్ సెట్ లో ఉన్నారు. సినిమా షూటింగ్ చూడటానికి ఆ రోజు బిడిది పరిసర ప్రాంతాల గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకున్నారు.

హీరోకు డూప్ గా ఫైటర్
టెన్షన్ గా ఫైట్ సీన్ తీస్తున్న సమయంలో అక్కడ ఉన్న సినిమా యూనిట్ మొత్తం షాక్ అయ్యింది. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో ఫైటర్ వివేక్ తో పాటు మరి కొందరు ఫైటర్లు గాల్లోకి ఎగరడంతో పైన వేలాడుతున్న 11 కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలాయి. విద్యుత్ షాక్ తగిలిన ఫైటర్ వివేక్ ప్రాణం పోయింది. ఇదే సమయంలో మరో ఫైటర్ కు తీవ్రగాయాలు కావడంతో అతన్ని బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హీరో అజయ్ రావ్ కు డూప్ గా ఆ రోజు వివేక్ ను రంగంలోకి దింపడంతో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని ఆరోపణలు ఉన్నాయి.

అందరి మీద కేసు నమోదు
షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో పైన హైటెన్షన్ విద్యుత్ తీగలు ఉన్న విషయం పూర్తిగా మరిచిపోయారని, అందువలనే ప్రమాదం జరిగి ఫైటర్ వివేక్ ప్రాణం పోయిందని బిడిది పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. నిర్లక్షంగా సినిమా షూటింగ్ జరపడం వలనే ఫైటర్ వివేక్ ప్రాణం పోయిందని ఆరోపిస్తూ సినిమా దర్శకుడు శంకర్ రాజ్, నిర్మాత గురు దేశ్ పాండే, ఫైట్ మాస్టర్ వినోద్ ను బిడిది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ రోజు సినిమా హీరో అజయ్ రావ్ మీద కేసు నమోదు అయ్యింది.

ఆ రోజు నిర్మాత అండ్ కో ఎస్కేప్
ఫైటర్ వివేక్ మరణించిన రోజు కేసు నమోదు చేసిన పోలీసులు సినిమా డైరెక్టర్ శంకర్, ఫైటర్ వినోద్, మహదేవను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ కేసులో సినీ నిర్మాత గురు దేశ్ పాండే, ఫర్నాండిస్ తప్పించుకుని ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. ఇదే కేసులో అరెస్టు భయంతో సినిమా హీరో అజయ్ రావ్ కూడా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు.

హీరోతో పాటు అందరికి బెయిల్ మంజూరు
కేసు వివరాలు తెలుసుకున్న బెంగళూరులోని జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సిద్దలింగ ప్రభు నిందితులకు బెయిల్ మంజూరు చేశారు. సినిమా హీరో అజయ్ రావ్ తో పాటు. సినిమా డైరెక్టర్ శంకర్, నిర్మాత గురు దేశ్ పాండే, ఫైట్ మాస్టర్ వినోద్ కుమార్, ప్రోడక్షన్ మేనేజర్ ఫెర్నాండిస్, క్రేన్ ఆపరేటర్ మహదేవకు గురువారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications