నా లెక్కలు నాకుంటాయి, దీపా, టీటీవీకి మిగిలేది ‘టీ’మాత్రమే !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తన మేనత్త జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్ కే నగర్ శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో కచ్చితంగా నేనే గెలుపొందుతానని, అందులో ఎలాంటి సందేహం లేదని, అమ్మ అభిమానులు నాకు అండగా ఉన్నారని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ అన్నారు.

సమరానికి సై: తమిళనాడు భారీ బడ్జెట్ ! పదవి ఉంటుందా, ఊడుతుందా

గురువారం చెన్నైలోని జయలలిత మేనకోడలు దీపా మీడియాతో మాట్లాడుతూ ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి తాను త్వరలో నామినేషన్ వేస్తానని చెప్పారు. తనకు డబ్బు లేకపోయినా మా మేనత్త జయలలిత ఇచ్చిన అభిమానులు అండగా ఉన్నారని చెప్పారు.

I will win in R.K. Nagar by-election and nominate soon, said Deepa

అన్నాడీఎంకే కార్యకర్తలు, అమ్మ అభిమానులు అండగా ఉన్నంత వరకు తన గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరని పరోక్షంగా శశికళ వర్గం నాయకులను హెచ్చరించారు. ఆర్ కేగర్ ప్రజలు ఇప్పటికే తనతో మాట్లాడారని దీపా అన్నారు. ఉప ఎన్నికల్లో దీపా ప్రత్యర్థిగా టీటీవీ దినకరన్ మీద పోటీ చేస్తే ఆయనకు చివరికి మిగిలేది టీ మాత్రమే అని ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై సంస్థ నాయకులు వ్యంగంగా అన్నారు.

సీఎం పళనిసామి సీరియస్: కమల్ హాసన్ కు అండగా నడిగర్ సంఘం

అమ్మ నిజమైన వారసురాలు ఆమె మేనకోడలు దీపానే అని ఆర్ కే నగర్ లోని అన్నాడీఎంకే పార్టీ నాయకులు చెప్పారు. శశికళ ఇక్కడి నుంచి పోటీ చేస్తే కచ్చితంగా ఓడిస్తామని గతంలో ఆర్ కే నగర్ ప్రజలు హెచ్చరించారు. అయితే శశికళ జైలుకు వెళ్లడంతో ఆమె అక్క కుమారుడు టీటీవీ. దినకరన్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
I will win in R.K. Nagar by-election and nominate soon, said Jayalalithaa’s niece Deepa Jayakumar.
Please Wait while comments are loading...