తొలి రాఫెల్ యుద్ధ విమానంను అందుకున్న భారత వాయుసేన
2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విమర్శలు గుప్పించే క్రమంలో రాఫెల్ యుద్ధవిమానాల అంశాన్ని అస్త్రంగా ఉపయోగించింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అవినీతికి పాల్పడిందంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదే పదే విరుచుకుపడ్డారు. ఇక ఆ సంగతి పక్కనబెడితే ఫ్రాన్స్ దేశం నుంచి తొలి రాఫెల్ యుద్ధ విమానం భారత్‌కు చేరుకుంది. ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న డిప్యూటీ ఎయిర్ చీఫ్ మార్షల్ చౌదరీ ఈ యుద్ధ విమానంను అందుకున్నారు.
మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు భారత్ ఒప్పందం ఫ్రాన్స్‌తో కుదుర్చుకుంది. ఇక అప్పటి నుంచి దీనిపై వివాదాలు నడుస్తున్నాయి. రోజుకో వివాదం తలెత్తుతుండటంతో బీజేపీకి ఆ సమయంలో రాఫెల్ వ్యవహారం తలనొప్పింగా మారింది. మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భావించిన భారత్... తొలి యుద్ధ విమానంను భారత్‌కు అప్పగించింది ఫ్రాన్స్. ఇక విమానం టెయిల్ నెంబర్ ఆర్‌బీ-01 అని ఇచ్చారు. ఆర్‌బీ అంటే ఎయిర్‌మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా పేరు వచ్చేలా ఇచ్చారు.

ఎయిర్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా, కొత్త ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా నియమితులయ్యారు. రాఫెల్ జెట్ యుద్ధ విమానాల ఒప్పందంలో భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు యుద్ధవిమానంను నడిపిన తొలి ఐఏఎఫ్ బృందంలో ఈయనొకరుగా ఉన్నారు. ఇక రాఫెల్ యుద్ధ విమానాలు భారత వాయుసేనలో అధికారికంగా అక్టోబర్ 8న చేరనుంది. ఆ సమయంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫ్రాన్స్ పర్యటనకు వెళతారు. అయితే మే 2020లో మాత్రమే ఈ రాఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు చేరుకుంటాయి. అప్పటిలోగా దీని పనితీరు, వినియోగంపై పైలట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాఫెల్ యుద్ధవిమానంను నడపడంలో కొంతమంది పైలట్లు శిక్షణ పొందారు. మొత్తంగా మే 2020 నాటికి 24 మంది పైలట్లకు మూడు బృందాలుగా విడగొట్టి శిక్షణ ఇవ్వనుంది.
రాఫెల్ యుద్ధ విమానాలను ఒక స్క్వాడ్రాన్‌ను హర్యానాలోని అంబాలా ఎయిర్‌బేస్‌లో ఉంచుతుంది. మరో స్క్వాడ్రాన్ యుద్ధవిమానాలను పశ్చిమ బెంగాల్‌లోని హషిమరా ఎయిర్‌బేస్‌లో ఉంచుతుంది. సెప్టెంబర్ 2016లో భారత్ ఫ్రాన్స్ ప్రభుత్వంల మధ్య 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం జరిగింది. దీని విలువ 7.8 బిలియన్ యూరోలు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications